అన్వేషించండి

Emraan Hashmi: గ్లింప్స్ వచ్చేస్తోంది- ఇమ్రాన్ హష్మీ చెప్పింది ‘ఓజీ’ గురించేనా?

బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ తొలిసారి తెలుగు సినిమాలో కనిపించబోతున్నారు. ‘ఓజీ’లో విలన్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

Emraan Hashmi About ‘OG’ Movie: పవన్ కల్యాణ్, సుజీత్ కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ’. ప్రస్తుతం నిర్మాణ పనులు కొనసాగుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ జరుపుకున్నది. ఏపీ ఎన్నికల నేపథ్యంలో పవన్ షూటింగ్ కు బ్రేక్ తీసుకున్నారు. ఎన్నికలు పూర్తి కాగానే మళ్లీ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఇక ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా చేసిన ఓ కామెంట్ ఆసక్తి కలిగిస్తోంది. ఇంతకీ ఆయన చెప్పిన విషయం ‘ఓజీ’ గురించేనా అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఏం చెప్పారంటే..

త్వరలో గ్లింప్స్ రాబోతోంది- ఇమ్రాన్ హష్మీ

బాలీవుడ్ లో రొమాంటిక్ స్టార్ గా  పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ.. గత కొంత కాలంగా విలన్ పాత్రల్లో నటిస్తున్నారు. గత ఏడాది ఆయన ‘టైగర్ 3’లో విలన్ గా కనిపించారు. ఎప్పుడు ముద్దులతో కవ్వించే ఇమ్రాన్, భీకర విలన్ పాత్రలో కనిపించడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆయన ‘ఓజీ’ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆయన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో ఆయన రోల్ మరో రేంజిలో ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా ‘ఓజీ’ మూవీ గ్లింప్స్ గురించి నెట్టింట తెగ చర్చ నడుస్తోంది. తమన్ రీసెంట్ గా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఇమ్రాన్ హష్మీ ఈ సినిమా గురించి చేసిన కామెంట్ ఆసక్తి కలిగిస్తోంది. ‘ఓజీ’ మూవీలో ఆయన రోల్ గురించి ఓ నెటిజన్ ప్రశ్నించాడు. దీనికి ఇమ్రాన్ ఆసక్తికర సమాధానం చెప్పారు. “నేను ప్రస్తుతం ఏమీ చెప్పను. త్వరలోనే గ్లింప్స్ వీడియో రిలీజ్ కాబోతోంది” అంటూ అప్ డేట్ ఇచ్చారు.

పవన్ కల్యాణ్ పై ఇమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇమ్రాన్ హష్మీ ఇచ్చిన హింట్ తో పవన్ అభిమానులతో పాటు సినీ లవర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు పవన్ గురించి ఇమ్రాన్ రీసెంట్ గా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘ఓజీ’లో ఆయన ఇప్పటి వరకు కనిపించని రీతిలో కనిపిస్తారని చెప్పారు. సెట్స్ లో కూల్ గా కనిపించే ఆయన, సినిమాల్లో చాలా వయోలెంట్ గా ఉంటారన్నారు. ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోందని చెప్పారు. ‘ఓజీ’ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Aslo: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సర్‌ప్రైజ్ - పవర్‌స్టార్ డబ్బింగ్ టీజర్‌కేనా?

టాప్ హెడ్ లైన్స్

Ranabaali Review - 'రణబాలి' రివ్యూ: విజయ్ దేవరకొండ నట విశ్వరూపం... సినిమా హిట్టా? ఫట్టా?
'రణబాలి' రివ్యూ: విజయ్ దేవరకొండ నట విశ్వరూపం... సినిమా హిట్టా? ఫట్టా?
Anupama Parameswaran : పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
పెళ్లికి ముందే బిడ్డ కావాలని ఉండేది - సినిమాలకు స్వస్తి చెప్పాలనుకున్నా... అనుపమ పరమేశ్వరన్ రియాక్షన్
Campus Drivers Series OTT : ఓటీటీలోకి సరికొత్త లవ్ రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త లవ్ రొమాంటిక్ సిరీస్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Nindu Manasulu Serial Today October 16th: నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!
నిండు మనసులు: కారులో పడుకున్న సిద్ధూ! కనికరించని ప్రేరణ! ప్లాన్ ఫెయిల్!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan YSRCP Local Body Elections: స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
స్థానిక ఎన్నికల్లో జగన్ సంచలన వ్యూహం - ఇన్‌చార్జ్‌లకు స్వేచ్ఛ.. వైసీపీ కార్యకర్తలకు బిగ్ టెస్ట్!
Vijaya Dairy Milk Price: విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
విజయ పాల ధరల పెంపు... అక్టోబర్ 17 నుంచి కొత్త ధరలు అమల్లోకి
CM Revanth Reddy: ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
ముఖానికి నాట్లు వేసుకొని తిరుగుతున్నాడు.. KTRపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
Tesla Roadster: రాకెట్‌లా గాల్లోకి దూసుకెళ్లే కారు.. రోడ్డుపై 0.81 సెకన్లలో 100 కి.మీ వేగం! టెస్లా కొత్త రోడ్‌స్టర్‌లో ఇన్ని వింతలా?
గాల్లో ఎగిరిన టెస్లా కారు.. ఒక్క సెకనులో 100km స్పీడ్‌.. ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న 'ఫ్లైయింగ్‌ కార్‌' వీడియో
El Nino Food Price Rise: ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎల్‌నినో పేరిట దోపిడీ - దేశంలో ధాన్యానికి కొరత లేకపోయినా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఎస్‌యూవీ మార్కెట్‌లో Hyundai Creta సరికొత్త రికార్డు.. 15 లక్షల సేల్స్‌ మైల్‌స్టోన్‌ దాటేసింది!
2015 నుంచి ఇప్పటివరకు కూడా ఇదే మొనగాడి కారు.. ఏకంగా 15 లక్షల మంది కొన్నారు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
రావణుడి గురించి మీకు తెలియని 10 ఆసక్తికర విషయాలు!
Embed widget