Hanuman OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్’ తెలుగు వెర్షన్ - స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Hanuman OTT: సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన 'హనుమాన్' మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా తెలుగు వెర్షన్ ను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చారు.
Hanuman OTT: తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘హను-మాన్’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సూపర్ హీరో మూవీ, బాక్సాఫీసు వద్ద సెన్సేషనల్ సక్సెస్ సాధించింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో ఎపిక్ బ్లాక్ బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. నేటితో వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది. ఎట్టకేలకు హనుమంతుడు డిజిటల్ వేదికల మీదకు వచ్చేసారు.
సంక్రాంతి విన్నర్ ‘హనుమాన్’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ, మేకర్స్ సైడ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ లోకి అందుబాటులోకి వచ్చేసింది. ఈ మూవీ హిందీ వెర్షన్ శనివారం రాత్రి 8 గంటల నుంచి 'జియో సినిమా' ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటూ దూసుకెళ్తోంది. కాకపోతే తెలుగు వెర్షన్ అందుబాటులోకి రాకపోవడంపై సినీ ప్రియులు కాస్త నిరాశ చెందారు. వారి కోసం ఇప్పుడు ఉన్నట్టుండి సడన్ గా తెలుగు వెర్షన్ కూడా వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 వేదికగా ఆదివారం ఉదయం నుంచి ‘హనుమాన్’ సినిమా తెలుగు వెర్షన్ ను స్ట్రీమింగ్ కు పెట్టారు. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓటీటీలో ఈ సినిమాని చూస్తున్న ప్రేక్షకులు.. హైలైట్ గా నిలిచిన సన్నివేశాల వీడియో క్లిప్పింగులను షేర్ చేస్తున్నారు. ఇదొక విజువల్ వండర్ అని, క్లైమాక్స్ సీన్ అద్భుతమని పోస్టులు పెడుతున్నారు.
HanuMan is now streaming on @ZEE5Telugu 😊@tejasajja123 @Niran_Reddy @Actor_Amritha @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @AsrinReddy @Primeshowtweets @tipsofficial @tipsmusicsouth @ThePVCU @RKDStudios #HanuMan #HanuManOnZEE5 pic.twitter.com/PLf0lF3Lfw
— Prasanth Varma (@PrasanthVarma) March 17, 2024
సోషియో ఫాంటసీ కథాంశానికి పురాణాల నేపథ్యం జోడించి ‘హను-మాన్’ సినిమా రూపొందించారు ప్రశాంత్ వర్మ. ఇందులో తేజ సజ్జా సరసన అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, సముద్ర ఖని, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గౌరహరి సంగీతం సమకూర్చగా, దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
ఓ మోస్తరు అంచనాతో విడుదలైన 'హనుమాన్' మూవీ.. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. కేవలం 40 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 300 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు,. ఓవర్ సీస్ లోనూ దుమ్ములేపింది. సుమారు 150 థియేటర్లలో 50 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. అలాంటి సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికలోకి వచ్చేసింది. ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్ గా 'జై హనుమాన్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించారు.
Also Read: రియల్ లైఫ్‌లోనైనా, రీల్ లైఫ్‌లోనైనా వేరొకరి బిడ్డను అనాథగా విడిచిపెట్టలేను - హీరో విశాల్