Jacqueliene Fernandez: దయచేసి ఆ కేసు కొట్టివేయండి, కోర్టు మెట్లెక్కిన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్
Jacqueliene: బాలీవుడ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కోర్టు తలుపులు తట్టింది. మనీలాండరింగ్ కేసు నుంచి తన పేరును తప్పించాలని విజ్ఞప్తి చేసింది. సంబంధం లేని కేసులో తనను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేసింది.
Jacqueliene Fernandez Money Laundering Case: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ కు మనీ లాండరింగ్ కష్టాలు ఇంకా తీరలేదు. ఈ కేసు విషయంలో కోర్టు, విచారణ సంస్థల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతోంది. తాజాగా ఆ కేసు నుంచి తనకు విముక్తి కల్పించాలని కోర్టుకు విన్నవించుకుంది. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ తో పాటు ఈడీ ఛార్జ్ షీట్లను కొట్టివేయాలని కోరింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జి షీట్లలో తనను నిందితురాలిగా చూపించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో తొలుత తనను సాక్షిగానే కోర్టులో హాజరు పరిచిన విచారణ అధికారులు, ఆ తర్వాత నిందితురాలిగా చేర్చారని చెప్పింది. ఆర్థిక నేరస్తుడు సుఖేష్ చంద్రశేఖర్ కు సంబంధించిన మోసాల విషయం తనకు తెలియదని వెల్లడించింది.
జైలు నుంచే రూ. 200 కోట్ల మనీ లాండరింగ్
ఆర్థిక నేరస్తుడు సుఖేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. ఆయనపై 30కి పైగా కేసులు నమోదయ్యాయి. పలు సంస్థలు ఆయా కేసులను విచారిస్తున్నాయి. జైల్లో ఉండే ఏకంగా రూ. 200 కోట్లకుపైగా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. జైల్లో ఉంటూనే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే అధికారిగా చెప్పుకుంటూ, బడా వ్యాపారవేత్తలను టార్గెట్ చేసి అందినకాడికి డబ్బులు దండుకున్నాడు. ఓ ఢిల్లీ వ్యాపారి భార్య నుంచి ఏకంగా రూ. 215 కోట్లు కొట్టేసి సంచలనం కలిగించాడు. ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.
Also Read: ప్రభాస్, ప్రశాంత్ నీల్‌లో అది కామన్, హీరోను ఇరిటేట్ చేశా - ఆసక్తికర విషయాలు బయటపెట్టిన శృతి హాసన్
సుఖేష్ నుంచి ఖరీదైన గిఫ్టులు పొందిన జాక్వెలిన్
రూ. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సుకేష్, జాక్వెలిన్ కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాల్ వైరల్ అయ్యాయి. జాక్వెలిన్ డేటింగ్ తో డేటింగ్ లో ఉన్నట్లు సుకేష్ ఈడీ అధికారులకు విచారణ సమయంలో చెప్పాడు. ఈ విషయం పైనా ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఆమెను కూడా ఈ కేసులో నిందితురాలిగా చేర్చారు. పలుమార్లు ఆమెను విచారించారు కూడా. అయితే, తనను కావాలని ఈ కేసులో ఇరికించినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. సుఖేష్ తన జీవితాన్ని నాశనం చేశాడని ఆరోపించింది. తన జీవితంలో ఆడుకుని, కెరీర్ ను మొత్తం చెడగొట్టాడని న్యాయస్థానం ముందు వాగ్మూలం ఇచ్చింది. హోంశాఖలో అధికారిగా పరిచయం చేసుకుని, తనను సంబంధంలేని కేసులో ఇరికించాడని బాధపడింది. సుఖేష్ ఓ మోసగాడని గుర్తించలేకపోయానని చెప్పింది. తనను మోసం చేసి తప్పుదారి పట్టించాడని వెల్లడించింది. జైలులో ఉండి కూడా సుఖేష్ తనతో ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడేవాడని జాక్వెలిన్ తెలిపింది. ఏనాడూ తను జైల్లో ఉన్న విషయాన్ని అతడు చెప్పలేదని చెప్పింది.
జాక్వెలిన్ మూవీస్
నటి జాక్వెలిన్ 2009లో ‘అలాదిన్’ మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ‘కిక్’, ‘మర్డర్ 2’, ‘ఎ జెంటిల్‌మన్’ సహా పలు చిత్రాల్లో నటించింది. ‘ఎటాక్’, ‘రామ్ సేతు’, ‘సర్కస్’, ‘బచ్చన్ పాండే’ చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చాయి. తాజాగా ఆమె ‘వెల్‌కమ్ 3’ మూవీలో నటించింది.
Read Also: హాలీవుడ్ రేంజ్ విజువల్స్, అదిరిపోయే బీజీఎం, ‘హనుమాన్’ ట్రైలర్‌తో ప్రశాంత్ వర్మ మ్యాజిక్!