అన్వేషించండి

Tollywood 2024 hits and flops: 2024లో టాలీవుడ్ ఫస్టాఫ్‌ ఎలా నడిచింది? ఆ సినిమాలు అదుర్స్, కానీ..

Tollywood 2024: ప్రథమార్థంలో గడిచిన ఆరు నెలల్లో అనేక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కొన్ని విజయం సాధిస్తే, మరికొన్ని పరాజయం పాలయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు డిజాస్టర్లుగా మారాయి.

Tollywood 2024 first half report: ఈ ఏడాదిలో అప్పుడే ఆరు నెలలు గడిచిపోయింది. 2024 ఫస్టాఫ్ టాలీవుడ్ రిపోర్ట్ చూస్తుకుంటే.. 135కి పైగా తెలుగు సినిమాలు విడుదలైతే, వాటిల్లో కొన్ని మాత్రమే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.. భారీ అంచనాలున్న సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. సమ్మర్ సీజన్ లో పెద్ద హీరోలెవరూ తమ చిత్రాలను రిలీజ్ చేయడానికి ముందుకు రాకపోవడంతో, ఈ గ్యాప్ ను చిన్న మీడియం రేంజ్ హీరోల సినిమాతో పూర్తి చేసారు. ఎండలు, ఎన్నికలు, ఐపీఎల్ క్రికెట్ వల్ల  జనాలు థియేటర్లకు రావడానికి పెద్దగా ఆసక్తి కనబరచలేదు. టాక్ బాగున్న సినిమాలను మాత్రమే జనాలు ఆదరించారు. అందుకే ఈ ఏడాది ప్రథమార్థంలో తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ సక్సెస్ రేట్ నమోదైంది.  

❂ సంక్రాంతి సినిమాలలో 'హను-మాన్' విన్నర్ గా నిలిచింది. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో వచ్చిన ఈ సూపర్ హీరో మూవీ.. స్టార్ హీరోల సినిమాలను తట్టుకొని కూడా బాక్సాఫీస్ వద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ₹40 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిస్తే, ప్రపంచవ్యాప్తంగా ₹300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

❂ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే మహేశ్ స్టార్ పవర్ తో సినిమాని గట్టెక్కించారు.

❂ కింగ్ అక్కినేని నాగార్జున ప్రధాన పాత్ర పోషించిన 'నా సామి రంగా' చిత్రం 50 కోట్ల గ్రాస్ వసూలు చేసి, అన్ని ఏరియాలో గ్రీక్ ఈవెన్ మార్క్ అందుకుంది.

❂ విక్టరీ వెంకటేష్ చేసిన 'సైంధవ్' సినిమా మాత్రం డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసింది. 

❂ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'టిల్లు స్క్వేర్'. 'డీజే టిల్లు'కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద 135 కోట్ల వరకూ రాబట్టి, బ్లాక్ బస్టర్ సినిమాలో లిస్టులో చేరిపోయింది.

❂ ‘టిల్లు స్క్వేర్’ కంటే ముందు వచ్చిన రవితేజ 'ఈగల్'.. వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్'.. ఏపీ మాజీ సీఎం జగన్ బయోపిక్ 'యాత్ర 2' చిత్రాలు ప్లాప్ అయ్యాయి.

❂ సుహాస్ 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్'.. సందీప్ కిషన్ 'ఊరి పేరు భైరవకోన'.. శ్రీవిష్ణు 'ఓం భీమ్ బుష్' సినిమాలు ఉన్నంతలో బాగానే ఆడాయి.

❂ విశ్వక్ సేన్ నటించిన 'గామి' మూవీ హిట్టవ్వగా.. గోపీచంద్ చేసిన 'భీమా' బోల్తాకొట్టింది.

❂ 'ప్రేమలు' వంటి మలయాళ డబ్బింగ్ సినిమా మంచి వసూళ్లను సాధించింది. 

Also Read: ఉత్తమ విదేశీ చిత్రంగా యూకె నేషనల్ ఫిలిం అవార్డ్ గెలుచుకున్న 'కెప్టెన్ మిల్లర్'

❂ ఎన్నో అంచనాలతో విడుదలైన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన 'ది ఫ్యామిలీ స్టార్' సినిమా తీవ్ర నిరాశ పరిచింది.

❂ అంజలి 'గీతాంజలి మళ్ళీ వచ్చింది'.. అల్లరి నరేష్ 'ఆ ఒక్కటీ అడక్కు' చిత్రాలను జనాలు పట్టించుకోలేదు.

❂ పాజిటివ్ రివ్యూలు తెచ్చుకున్న 'ప్రసన్న వందనం', 'కృష్ణమ్మ' 'భజే వాయు వేగం' 'హరోం హర' సినిమాలు సైతం మంచి వసూళ్లు సాధించలేకపోయాయి.

❂ 'ప్రతినిధి 2', 'లవ్ మీ' 'సత్యభామ' లాంటి చిత్రాలు పత్తా లేకుండా పోయాయి.

❂ శర్వానంద్ నటించిన 'మనమే' మూవీ ప్లాప్ అవ్వగా.. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్లుగా మేకర్స్ ప్రకటించారు. 

❂ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం 'కల్కి 2898 AD'. జూన్ నెలాఖరున థియేటర్లలోకి వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా, బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 6 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ. 700 కోట్ల కలెక్షన్లు రాబట్టి, 2024 లో ఇప్పటి వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. రెండో వారంలోనూ ఇదే హవా కొనసాగిస్తే, త్వరలోనే ఈ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఇకపోతే 2024 సెకండాఫ్ లో పలు క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. 'దేవర 1', 'గేమ్ ఛేంజర్', 'పుష్ప 2' 'తండేల్' లాంటి సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ అవుతాయి. వీటితో పాటుగా 'భారతీయుడు 2', 'రాయన్', 'తంగలాన్', 'GOAT', 'కంగువ', 'వెట్టయాన్', 'అమరన్' లాంటి డబ్బింగ్ చిత్రాలు కూడా తెలుగులో విడుదల కానున్నాయి.

Also Read: 'కల్కి' సినిమాకు సంగీతం అందించిన కీరవాణి, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Embed widget