ETV Win OTT: పిల్లలూ మీ కోసమే ఈ కార్టూన్ షోస్ - ఒకే రోజు 5 సరికొత్త కార్టూన్స్, ఈటీవి విన్‌లో ఫస్ట్ ఎపిసోడ్స్ ఫ్రీగా చూసి ఎంజాయ్!
ETV Win Cartoon Shows: 'ఈటీవీ విన్' ఓటీటీ పిల్లల కోసం సరికొత్తగా కార్టూన్ షోస్‌తో ముందుకొచ్చింది. ఒకే రోజు 5 కార్టూన్స్ స్ట్రీమింగ్ చేస్తుండగా ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీగా చూడొచ్చని తెలిపింది.

Cartoon Shows On ETV Win: ఓటీటీ ప్లాట్ ఫాంలో 'ఈటీవీ విన్' (ETV Win) తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఎక్స్ క్లూజివ్ తెలుగు కంటెంట్ కోసం వచ్చిన ఈ ఓటీటీ ప్లాట్ ఫాం.. ఇటీవల ఒరిజినల్ మూవీస్, షోలతో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇప్పుడు చిన్నారులను సైతం ఆకర్షించే పనిలో పడింది. పిల్లలను అలరించేందుకు ఒకే రోజు 5 కార్టూన్ షోస్‌తో (Cartoon Shows) ముందుకొచ్చింది. వీటిలో ఫస్ట్ ఎపిసోడ్‌ను ఫ్రీగా చూడొచ్చు. ఈ నెల 27 నుంచి 5 సరికొత్త కార్టూన్ షోస్‌ను స్ట్రీమింగ్ చేయనున్నట్లు తన 'ఎక్స్' అకౌంట్ ద్వారా వెల్లడించింది. 'త్వరలోనే ఫన్ స్టార్ట్ కాబోతోంది. మీ ఫేవరెట్ కార్టూన్ షోలు మీ ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తున్నాయి. సిద్ధంగా ఉండండి. ఫన్, కామెడీ, మ్యాజిక్‌తో కూడిన అడ్వెంచర్ కోసం రెడీ అయిపోండి.' అంటూ క్యాప్షన్స్‌తో ఈ షోలను అనౌన్స్ చేసింది.
ఆ 5 కార్టూన్ షోస్ ఏవంటే..?
🎡 Fun Begins Soon! 🚀
— ETV Win (@etvwin) February 17, 2025
Buckle up! Your favorite cartoon shows are landing on @ETVWin this Feb 27! 🎉 Get ready for an adventure full of fun, laughter & magic! 🪄#EtvWin @etvbalbharat pic.twitter.com/ygNmyQIspN
బాల్ బాహుబలి ది లాస్ట్ సన్ గార్డియన్, ది సిస్టర్స్, అభిమన్యు ది యంగ్ యోధా, కిట్టీ ఈజ్ నాట్ ఎ క్యాట్ సీజన్ 3 కార్టూన్ షోస్‌తో పాటు పాపులర్ జపనీస్ కార్టూన్ షో 'డిటెక్టివ్ కోనన్'ను సైతం ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ చేయనుంది. 1996 నుంచి ఈ షో నడుస్తుండగా.. ఇప్పటికే 31 సీజన్లు పూర్తి చేసుకుంది. ఇటీవల పలు ఓటీటీ ప్లాట్ ఫాంలు పిల్లలను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా షోలను తీసుకొచ్చాయి. ఆ బాటలోనే 'ఈటీవీ విన్' సైతం కార్టూన్ షోస్ ద్వారా పిల్లలకు దగ్గరయ్యేందుకు సిద్ధమవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

