Satyam Sundaram X Review - సత్యం సుందరం ట్విట్టర్ రివ్యూ: కార్తీ కెరీర్ బెస్ట్, మరి అరవింద్ స్వామికి... కోలీవుడ్ క్రిటిక్స్ ఏమంటున్నారంటే?
Meiyazhagan Twitter Review: కార్తీ, అరవింద్ స్వామి నటించిన 'సత్యం సుందరం' ప్రీమియర్ షో చెన్నైలో వేయగా... బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ సినిమా గురించి కోలీవుడ్ క్రిటిక్స్, ఆడియన్స్ ఏమంటున్నారో చూడండి.
కార్తీ (Karthi) హీరోగా నటించిన తాజా తమిళ సినిమా 'మెయ్యళగన్' (Meiyazhagan). ఈ టైటిల్‌కు స్వచ్చమైన మనిషి లేదా నిజమైన మనిషి అని అర్థం. ఇందులో అరవింద్ స్వామి (Arvind Swamy) ప్రధాన పాత్ర చేశారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'సత్యం సుందరం'గా శనివారం (సెప్టెంబర్ 28న) విడుదల చేస్తున్నారు. తమిళ ప్రేక్షకుల ముందుకు రేపు (శుక్రవారం, సెప్టెంబర్ 27న) విడుదల చేస్తున్నారు. అయితే, అక్కడ క్రిటిక్స్ అండ్ కామన్ ఆడియన్స్ కొంత మందికి ప్రీమియర్ షో వేశారు. సినిమా చూసినోళ్లు బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఇంతకీ, వాళ్లు ఏం చెప్పారో చూడండి.
కార్తీ కెరీర్ బెస్ట్ 'సత్యం సుందరం'
'పరుత్తివీరన్'తో కార్తీ కథానాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా స్పెషల్ గనుక అది పక్కన పెడితే... ఆయన కెరీర్ బెస్ట్ 'సత్యం సుందరం' అని ఓ క్రిటిక్ ట్వీట్ చేశారు. ఇంటర్వెల్ తర్వాత సింగిల్ షాట్ డైలాగ్స్, అప్పుడు నటనలో చూపించిన వేరియేషన్ అద్భుతం అని అన్నాడు. ఇందులో కార్తీ జోడీగా తెలుగు అమ్మాయి శ్రీ దివ్య నటించారు. ఆమెది చిన్న క్యారెక్టర్ అయినా బాగా చేశారని మరొక నెటిజన్ పేర్కొన్నారు.
I would rate @Karthi_Offl ‘s performance in #Meiyazhagan as his career best after #Paruthiveeran (which is extra special being his debut). In the second half of the film, man just owns all the single shot long dialogues with varying expressions 🙏🙏 All the cameraman has to do is… pic.twitter.com/kjcLWdgZkI
— Rajasekar (@sekartweets) September 25, 2024
Small role but sweet screen presence.
— Haricharan Pudipeddi (@pudiharicharan) September 25, 2024
Also Read: ప్రతి సినిమా ఫ్లాప్ అనేవాడు... 'దేవర'కు బ్లాక్ బస్టర్ రివ్యూ ఇచ్చాడు!
అరవింద్ స్వామికి మణిరత్నం కాదు...
అరవింద్ స్వామి బెస్ట్ ఫిలిమ్స్ అంటే ప్రేక్షకులకు మణిరత్నం గుర్తుకు వస్తారు. ఈ సినిమా చూశాక అరవింద్ స్వామికి దర్శకుడు ప్రేమ్ కుమార్ గొప్ప క్యారెక్టర్ రాశారని ప్రేక్షకులకు సైతం అనిపిస్తుందని చెప్పారు ఓ నెటిజన్. ఆయన కూడా అద్భుతంగా నటించారని పేర్కొన్నారు. కమల్ హాసన్, మాధవన్ నటించిన 'అన్బే శివమ్' (తెలుగులో 'సత్యమే శివమ్' పేరుతో అనువదించారు)తో ఈ సినిమాను కంపేర్ చేశారు. ఈ తరానికి అటువంటి సినిమా అన్నారు.
Not Mani Ratnam but #Premkumar has offered the best ever written character for @thearvindswami and our man has simply delivered his career best performance! He is majestic, vulnerable and highly relatable 👌#Meiyazhagan is the Anbe Sivam of our times. The major difference is… pic.twitter.com/88vvBmDv8D
— Rajasekar (@sekartweets) September 25, 2024
#Meiyazhagan - Amazing how Prem Kumar, after 96, once again gives us a film that strongly rests on just two characters. The kind of trust you need to have in your actors to even pull this off is absolutely mind-boggling. Phenomenal writing and performances
— Haricharan Pudipeddi (@pudiharicharan) September 25, 2024
ఫీల్ గుడ్... క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!
విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ ఈ 'సత్యం సుందరం' చిత్రానికి దర్శకుడు. ఆ సినిమాకు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. అయితే... శర్వానంద్, సమంతతో తెలుగు 'జాను'గా ఆ సినిమాను రీమేక్ చేశారు. ఆశించిన విజయం దక్కలేదు. తమిళనాడు ప్రీమియర్ షో టాక్ చూస్తే... '96' తరహాలో మరోసారి ఫీల్ గుడ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇవ్వడంలో ప్రేమ్ కుమార్ సక్సెస్ అయ్యారని పలువురు చెబుతున్నారు.
Also Read: 'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే
కార్తీ, అరవింద్ స్వామి... ఇద్దరూ అద్భుతంగా నటించారని, ప్రేమ్ కుమార్ చక్కగా తీశారని, కొన్ని సినిమాలు చూసినప్పుడు లెంగ్త్ ఎంత? అనేది ప్రేక్షకులు కూడా పట్టించుకోరని, 'సత్యం సుందరం' సైతం అటువంటి సినిమా అని చెబుతున్నారు. ఇద్దరు ముగ్గురు 4 స్టార్ రేటింగ్ ఇవ్వగా... ఓ ఇద్దరు మాత్రం 5/5 స్టార్స్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. 'సత్యం సుందరం' / 'మెయ్యిగళన్' సోషల్ మీడియా టాక్ ఎలా ఉందో ఈ కింద ట్వీట్లలో చూడండి.
#Meiyazhagan - 5 stars. A film so, so beautiful that you don’t want it to end. A single night story that’s so heartwarmingly refreshing, and it packs in just the right amount of drama to make your heart melt. Easily, the most satisfying story of going back to roots, celebrating…
— Haricharan Pudipeddi (@pudiharicharan) September 25, 2024
#Meiyazhagan - ⭐️⭐️⭐️⭐️⭐️A one of its kind feel-good drama that talks about unconditional love, the need to know your roots( also the history) and more love! What a phenomenal performers @Karthi_Offl and @thearvindswami are, they literally hold the film together with their…
— Rajasekar (@sekartweets) September 25, 2024
#Meiyazhagan
— Ram Muthuram Cinemas (@RamCinemas) September 25, 2024
Cant express the words, just 5/5!
Oru family kuda miss pana porathu ila ❤️❤️❤️
Congrats @2D_ENTPVTLTD for such a feel good movie after a long time, Tirunelveli to Tanjavur side ppl will get connected to the characters easily 💯#DirectorPrem after #96 this will…
#Meiyazhagan - 4/5 A feel-good, clean family entertainer that will satisfy you from the word go 😊@thearvindswami and @Karthi_Offl are superb 👌 A thoroughly enjoyable, perfect watch this weekend packaged brilliantly by dir #Premkumar which is a must watch 💯 pic.twitter.com/yWBuPVzrwN
— sridevi sreedhar (@sridevisreedhar) September 25, 2024
#Meiyazhagan [4.5/5] : A feel-good movie about going back to your roots.. Connecting with your long last relatives..@Karthi_Offl anchors as the innocent, very Tamil culture centric person.. Phenomenal acting..@thearvindswami 's best role and acting in his long career..
— Ramesh Bala (@rameshlaus) September 25, 2024
It's…