Pushpa 2: ‘బాహుబలి 2’ని దాటవేసిన ‘పుష్ప 2’ - అఫీషియల్‌గా ప్రకటించిన నిర్మాతలు!
Pushpa 2 Collections: ‘బాహుబలి 2’ వసూళ్లను ‘పుష్ప 2’ అధికారికంగా అధిగమించిందని నిర్మాతలు ప్రకటించారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా ‘పుష్ప 2’ అవతరించిందని తెలిపారు.
Pushpa 2 Crossed Baahubali 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ఫ 2’ విడుదల అయి నెల రోజులు దాటేసినా రికార్డులు మాత్రం ఆగడం లేదు. సినిమా విడుదల అయిన 32 రోజుల్లోనే ‘బాహుబలి 2’ని దాటేసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా ‘పుష్ప 2’ నిలిచింది. కేవలం 32 రోజుల్లోనే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కొత్త రికార్డును క్రియేట్ చేసింది.
‘బాహుబలి 2’ అవుట్...
32 రోజుల్లోనే రూ. 1,831 కోట్ల రూపాయలు వసూలు చేసి ‘పుష్ప 2: ది రూల్’ భారతీయ సినీ చరిత్రలో రికార్డులను తన పేరు మీద రాసుకుంది. రూ. 1810 కోట్ల రూపాయాలు వసూలు చేసిన ‘బాహుబలి 2’ వసూళ్లను క్రాస్ చేసి ‘పుష్ప 2’ కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు అని పిలిచే దర్శకుడు సుకుమార్‌ల కలయికలో రూపొందిన ‘పుష్ప 2 ది రూల్’ రిలీజయ్యే నాటికే దానిపై ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి.
Also Read: అభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం, మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం
ఈ సెన్సేషనల్ కాంబినేషన్‌లో అత్యున్నత నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థతో కలిసి ఈ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమాను నిర్మించింది. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పిన ‘పుష్ప 2’ విడుదల రోజు ప్రీమియర్స్ నుంచే సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ టాక్‌ను అందుకుంది. అల్లు అర్జున్ నట విశ్వరూపానికి, సుకుమార్ వరల్డ్ క్లాస్ టేకింగ్ తోడయి ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు.
రష్మిక మందన్న నాయికగా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలను అందించాడు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు కూడా వన్నె తెచ్చింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్, శామ్ సీఎస్ ఈ సినిమాకు అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ డెలివర్ చేశారు. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా చాలా హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది. మొదటి రోజే రూ.294 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది.
#Pushpa2TheRule is now Indian Cinema's INDUSTRY HIT with THE HIGHEST EVER COLLECTION FOR A MOVIE IN INDIA 🔥
— Pushpa (@PushpaMovie) January 6, 2025
The WILDFIRE BLOCKBUSTER crosses a gross of 1831 CRORES in 32 days worldwide 💥💥#HistoricIndustryHitPUSHPA2
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/sh7UN5RXLE
#Pushpa se dhanda karke box office ko bahut mazaa aagaya 💥💥
— Pushpa (@PushpaMovie) January 6, 2025
Presenting Indian Cinema's INDUSTRY HIT - #Pushpa2TheRule ❤🔥#HistoricIndustryHitPUSHPA2
Book your tickets for now!
🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpa pic.twitter.com/KeTrEwypi2