Posani Krishna Murali Arrest: శ్రీకాకుళం నుంచి అనంత వరకు పోసానిపై నమోదైన కేసులు చిట్టా ఇదే!
Posani Krishna Murali Arrest: నటుడు పోసాని కృష్ణ మురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కేసులు నమోదై ఉన్నాయి. ఆయన అరెస్టుతో ఇప్పుడు ఆ కేసులపై చర్చ మొదలైంది.

Posani Krishna Murali Arrest: సినిమా నటుడు పోసాని కృష్ణ మురళిని అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్ అయింది. ఆయన అరెస్టును వైసీపీ నేతలు ఖండిస్తుంటే... కూటమి నేతలు మాత్రం తగిన శాస్తి జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వైసీపీ నేతలను అరెస్టు చేస్తోందని ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనికి కౌంటర్‌గా పోసాని చేసిన కామెంట్స్‌ను టీడీపీ, జనసేన మద్దతుదారులు గుర్తు చేస్తున్నారు.
పోసాని అరెస్టు అయిన కేసు ఏంటీ?
వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసిన పోసాని కృష్ణమురళి ఆ పార్టీ అధికారంలోకి రావడంతోనే రెచ్చిపోయారు. చంద్రబాబు, పవన్, లోకేష్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ తిట్టారు. అప్పుడే వైసీపీ ప్రభుత్వం ఆయనకు ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి అప్పగించింది. దీంతో మరింతగా రెచ్చిపోయారాయన. ఆవేశంతో కుటుంబ సభ్యులను కూడా వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేశారు. అధికారంలో ఉన్నప్పుడే కాకుండా అధికారం కోల్పోయిన తర్వాత కూడా పోసాని తన నోటికి తాళం వేయలేదు.
ఇలా ఇష్టారీతిన తిడుతూ కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, పవన్ కల్యాణ్‌ను కించపరుస్తున్నారని జనసేన నేత జోగినేని మణి ఈ మధ్య కేసు పెట్టారు. పోసానిపై చర్యలు తీసుకోవాలని రెండు రోజుల క్రితం ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఘర్షణలకు కారణమవుతున్నారని అందులో పేర్కొన్నారు. దీనిపై కేసు బీఎన్‌ఎస్‌లోని 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి వర్గాల కులాల మధ్య చిచ్చు పెట్టారని, వ్యవస్థీకృత నేరానికి పాల్పడ్డారని అభియోగాలపై ఆయన్ని బుధవారం రాత్రి అరెస్టు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా కేసులు
ఈ ఒక్క కేసు మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి జిల్లాలో పోసానిపై కేసులు నమోదై ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై అనుచతి వ్యాఖ్యలు చేశారని ఈ కేసులు రిజిస్టర్ అయ్యాయి. గతంలో చంద్రబాబును దూషించారని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ నవంబర్‌లో ఫిర్యాదు చేశారు. కొన్ని డాక్యమెంట్స్ కూడా పోలీసులకు అందజేశారు. వాటి ఆధారంగా ఏపీ సీఐడీ కేసు పెట్టింది. అది విచారణలో ఉంది. అప్పుడు కూడా బీఎన్‌ఎస్‌లోని 111, 196, 353, 299, 336 (3)(4), 341, 61(2) సెక్షన్ల కిందే పోసానిపై కేసు రిజిస్టర్ చేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్నారు. ఆయన నియామకాన్ని ప్రశ్నిస్తూ వ్యక్తిగతగా విమర్శలు చేశారు. దీనిపై పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కేసు నోదు అయింది. ప్రాంతాలు, కులాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కూటమి నేతలను తిట్టి, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేత కలమట వెంకట రమణమూర్తి కూడా కేసు పెట్టారు. ఆయన ఫిర్యాదు మేరకు పాతపట్నం పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ పెట్టి చంద్రబాబును, పవన్ కల్యాణ్, లోకేష్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు కడప రిమ్స్ పీఎస్‌లో కేసు నమోదు అయింది. బాపట్ల, మంగళగిరి, అనంతపురం, చిత్తూరు జిల్లా యాదమరి, తిరుపతి జిల్లా పుత్తూరులో కేసులు రిజిస్టర్ అయ్యాయి.
Also Read: పార్టీ ప్లీనరీ ముందు ఈ స్టేట్మెంట్ అవసరమా జనసేనానీ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

