News
News
వీడియోలు ఆటలు
X

NTR30 Shoot Begins : అదిగో భయం - కొరటాల సెట్స్‌కు ఎన్టీఆర్ వచ్చేశాడు

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణ మొదలు అయ్యింది. సెట్స్ లో ఎన్టీఆర్ అడుగు పెట్టిన వీడియో విడుదల చేసింది చిత్ర బృందం.

FOLLOW US: 
Share:

''అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు.... అవసరానికి మించి తను ఉండకూడదు అని! అప్పుడు భయానికి తెలియాలి... తను రావాల్సిన సమయం వచ్చిందని! వస్తున్నా...'' - డైలాగ్ గుర్తు ఉంది కదా! 

స్క్రీన్ మీద యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కనిపించలేదు. కానీ, ఆయన గొంతులో గాంభీర్యం ప్రేక్షకుల మనస్సులో బలంగా ముద్ర పడింది. ఓ పది నెలల NTR 30 చిత్ర బృందం చిన్న టీజర్ విడుదల చేసింది. అందులో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ పాపులర్ అయ్యింది. ఇప్పుడు సినిమా మొదలైంది. అంతే కాదు... ఎన్టీఆర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. భయం వచ్చేసింది అంటూ ఈ రోజు చిత్ర బృందం ఓ వీడియో విడుదల చేసింది. 

ఇదిగో భయం...
సెట్స్‌లో ఎన్టీఆర్!
ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైంది. శ్రీరామ నవమి తర్వాత రోజు నుంచి చిత్రీకరణ ప్రారంభించారు. అభిమానుల కోసం లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... సెట్స్‌లో ఎన్టీఆర్ అడుగు పెట్టిన వీడియో విడుదల చేయడం!

ఎన్టీఆర్ నడుచుకుంటూ వెళ్లి దర్శకుడు కొరటాల శివను కలిసి వీడియో విడుదల చేసింది ఎన్టీఆర్ 30 టీమ్! ప్రస్తుతం రాత్రి వేళలో చిత్రీకరణ చేస్తున్నారు. ఎన్టీఆర్ పాల్గొనగా ఫైట్ తీస్తున్నారని తెలిసింది. షూటింగ్ స్టార్ట్ కావడానికి ముందు లొకేషన్ పిక్స్ కొన్ని లీక్ అయ్యాయి. బ్లడ్ ట్యాంకర్స్ ఫోటోలు బయటకు వచ్చాయి. 

Also Read : బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు - అసలు నిజం ఏమిటంటే?

ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో ఆయన సంగీతం అందిస్తున్న చిత్రమిది.  ఇందులో ఎన్టీఆర్ జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా సందడి చేయనున్నారు.  

Also Read కోయంబత్తూరు వెళ్లిన తారక రత్న భార్య అలేఖ్యా రెడ్డి 

ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ను తీసుకు వచ్చారు. 'ఆక్వా మాన్', 'జస్టిస్ లీగ్', 'బ్రాడ్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్' సినిమాలకు వర్క్ చేసిన బ్రాడ్ మైనించ్ NTR 30లో కొన్ని కీలకమైన సన్నివేశాలకు వీఎఫ్ఎక్స్ సూపర్ విజన్ చేస్తారని నిర్మాతలు తెలిపారు. హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీల్లో ఒకటైన 'మిషన్ ఇంపాజిబుల్', 'ట్రాన్స్‌ఫార్మర్స్', 'రాంబో 3' తదితర హాలీవుడ్ సినిమాలకు పని చేసిన స్టంట్ డైరెక్టర్ కెన్నీ బాట్స్ ఎన్టీఆర్ 30 సినిమాకు పని చేయనున్నారు. తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ 'సాహో' సినిమాకు కూడా ఆయన పని చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల, సినిమాటోగ్రాఫర్ రత్నవేలుతో కెన్నీ బేట్స్ డిస్కస్ చేస్తున్న ఫోటో విడుదల చేశారు. అది చూస్తే... షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ అని తెలుస్తుంది. సినిమాలో మెజారిటీ ఫైట్స్ ఆయనే చేస్తారని ఎన్టీఆర్ 30 బృందం తెలిపింది.

Published at : 01 Apr 2023 07:16 PM (IST) Tags: Janhvi Kapoor Jr NTR Koratala siva NTR 30 Shoot Begins

సంబంధిత కథనాలు

ఎన్టీఆర్ జయంతి: అన్నగారితో ఈ హీరోలు నటించిన మూవీస్ భలే బాగుంటాయ్!

ఎన్టీఆర్ జయంతి: అన్నగారితో ఈ హీరోలు నటించిన మూవీస్ భలే బాగుంటాయ్!

Vijayashanthi-NTR: ఇంటికి వచ్చి మరీ క్షమాపణ చెప్పారు, ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే- విజయశాంతి

Vijayashanthi-NTR: ఇంటికి వచ్చి మరీ క్షమాపణ చెప్పారు, ఆ మహోన్నత వ్యక్తిని ఎంతగా ప్రశంసించినా తక్కువే- విజయశాంతి

NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

NT Rama Rao Jayanti : ఎన్టీఆర్‌ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?

Naga Chaitanya's Next Movie : గీతా ఆర్ట్స్ లో అక్కినేని హీరో నెక్స్ట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?

Naga Chaitanya's Next Movie : గీతా ఆర్ట్స్ లో అక్కినేని హీరో నెక్స్ట్ మూవీ - డైరెక్టర్ ఎవరంటే?

Full Bottle Teaser : బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తా - 'ఫుల్ బాటిల్'లో సత్యదేవ్ చింపేశాడుగా 

Full Bottle Teaser : బాలయ్య బాబు ఫ్యాన్ ఇక్కడ, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తా - 'ఫుల్ బాటిల్'లో సత్యదేవ్ చింపేశాడుగా 

టాప్ స్టోరీస్

Telangana Politics : అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

Telangana Politics :  అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ

New Parliament Inauguration: కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఏమిటి, దానిని ఏ సమయంలో ప్రారంభిస్తారు, ఎవరికి ఆహ్వానం పంపారు? అన్నీ తెలుసుకోండి

New Parliament Inauguration: కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఏమిటి, దానిని ఏ సమయంలో ప్రారంభిస్తారు, ఎవరికి ఆహ్వానం పంపారు? అన్నీ తెలుసుకోండి

New Parliament Building Inauguration: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఎవరు హాజరవుతున్నారు, ఎన్ని పార్టీలు నిరసన తెలుపుతున్నాయి

New Parliament Building Inauguration: కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ఎవరు హాజరవుతున్నారు, ఎన్ని పార్టీలు నిరసన తెలుపుతున్నాయి