SRH vs LSG: హైదరాబాద్‌పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రిషభ్ పంత్, లక్నో ప్లేయింగ్ 11లోకి ప్రమాదకర బౌలర్ రాక
SRH vs LSG:ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. లక్నో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒక మార్పుతో ఆడుతోంది.

SRH vs LSG Playing 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో భాగంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య ఏడో మ్యాచ్ జరుగుతోంది. పాట్ కమ్మిన్స్ SRH జట్టుకు నాయకత్వం వహిస్తుండగా, రిషబ్ పంత్ LSG జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. రిషభ్ పంత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. లక్నో ప్లేయింగ్ 11లో ఒక మార్పు జరిగింది.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ భీరకరమైన ఫామ్‌తో హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. కానీ లక్నోకు సంతోషకరమైన విషయం ఏమిటంటే వారి ప్రధాన ఫాస్ట్ బౌలర్ తిరిగి వచ్చాడు. నేడు హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆవేష్ ఖాన్ లక్నో ప్లేయింగ్ 11లో ఉన్నాడు.
కెప్టెన్లు ఏమి చెప్పారు...
SRH కెప్టెన్ పాట్ కమిన్స్: ఇది మా టీం ఆలోచనా విధానాన్ని మార్చదు, మేము ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తాము. మేం దేని కోసం ఈ టోర్నమెంట్‌లోకి వచ్చామో మాకు తెలుసు. ఓవర్‌లో చేసిన 10 లేదా 11 పరుగులే ఆ రోజు మ్యాచ్ గెలిచేలా చేస్తుంది. మేము ఒక జట్టుగా ఆట గెలవాలని అనుకుంటున్నాం. బౌలింగ్ యూనిట్‌గా బాగా రాణించాలని కోరుకుంటున్నాము. పెద్ద స్కోరు చేస్తామని ఆశిస్తున్నాము. మేము అదే జట్టుతో ఆడుతున్నాము.
LSG కెప్టెన్ రిషబ్ పంత్: మేము ముందుగా బౌలింగ్ చేస్తాము. వారిని త్వరగా అవుట్ చేసి లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాం. ఇది జట్టు కూర్పుపై ఆధారపడి ఉంటుంది, అందుకే మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాము. దానిని ఛేదించడానికి మాకు బ్యాటింగ్ లైనప్ ఉంది. ఒకే ఒక మార్పు ఏమిటంటే షాబాజ్ ప్లేస్‌లో అవేష్ తిరిగి జట్టులోకి వచ్చాడు. వారు ఎంత స్కోర్ చేసినా మేము ఛేదిస్తాము, ఎంతే అనేది పట్టించుకోం.
లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయింగ్ 11
ఎడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి, ఆవేష్ ఖాన్, దిగ్విజయ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మొహమ్మద్ షమీ
పాయింట్ల పట్టికలో రెండు జట్ల స్థితి
సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. వారు తమ మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించారు, ఇందులో ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. జట్టు నెట్ రన్ రేట్ (+2.200)చాలా బాగుంది. .
లక్నో సూపర్ జెయింట్స్ విషయానికి వస్తే, వారిని మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించింది. అయితే చివరి వరకు లక్నో గెలుస్తుందని అనిపించింది కానీ ఢిల్లీ ఆటగాడు ఆశుతోష్ శర్మ పరిస్థితిని మార్చేశాడు. లక్నో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

