By: ABP Desam | Updated at : 01 Apr 2023 02:35 PM (IST)
నందమూరి బాలకృష్ణ, శ్రీ లీల
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొత్త సినిమాలో శ్రీలీల (Sreeleela) నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఎన్.బి.కె 108 (NBK 108 Movie)లో వాళ్ళ కాంబినేషన్ కుదిరింది. ఆ సినిమాలో తండ్రి, కుమార్తెగా బాలకృష్ణ, శ్రీలీల కనిపిస్తారని ప్రచారం జరిగింది. అయితే, అందులో నిజం లేదని తెలిసింది.
బాలకృష్ణకు శ్రీలీల కూతురు కాదు!
Sreeleela Balakrishna Relation In NBK 108 : ఎన్.బి.కె 108లో బాలకృష్ణ, శ్రీలీల తండ్రీ కుమార్తెలు కాదు. బాబాయ్ పాత్రలో బాలయ్య కనిపిస్తారు. మరి, శ్రీలీల తండ్రి పాత్రలో ఎవరు నటిస్తున్నారు? అంటే... శరత్ కుమార్! ఈ సినిమాలో బాలకృష్ణకు అన్నయ్య పాత్రలో ఆయన నటిస్తున్నారు.
బాలకృష్ణ హీరోగా డిఫరెంట్ యాక్షన్ డ్రామాను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. దూకుడైన మనస్తత్వం కల హీరోగా బాలకృష్ణ క్యారెక్టర్ డిజైన్ చేశారట. శ్రీలీల, శరత్ కుమార్, హీరో మధ్య సీన్లు కొత్తగా ఉంటాయని తెలిసింది. సినిమాకు ఆ సీన్లు ఆయువు పట్టు లాంటివి అని తెలిసింది. ఇటీవల బాలకృష్ణ, శ్రీలీల, ఇతర తారాగణం పాల్గొనగా కీలకమైన సన్నివేశాలను తెరకెక్కించారు.
శ్రీలీల పాటకు ఐదు కోట్లు!?
ప్రస్తుతం శ్రీలీల మీద రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఆ పాట తీయడానికి మొత్తంగా ఐదు కోట్ల రూపాయల ఖర్చు అవుతోందట. ఆ సాంగ్ మాంచి మాసీగా ఉంటుందట. తమన్ క్యాచీ ట్యూన్ ఇవ్వగా, ముంబై నుంచి ప్రత్యేకంగా డ్యాన్సర్లను రప్పించి పిక్చరైజ్ చేస్తున్నారట.
దసరా బరిలో బాలకృష్ణ సినిమా
''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా బరిలో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇందులో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.
Also Read : కోయంబత్తూరు వెళ్లిన తారక రత్న భార్య అలేఖ్యా రెడ్డి
బాలకృష్ణ, కాజల్ కలయికలో తొలి చిత్రమిది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'లక్ష్మీ కళ్యాణం'తో కాజల్ కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'బృందావనం', 'టెంపర్' సినిమాల్లో నటించారు. ఇప్పుడు బాలయ్యతో సినిమా చేస్తున్నారు. దీని కంటే ముందు బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ కాంబినేషన్ రెండు మూడు సినిమాలకు పరిశీలనలోకి వచ్చింది. అయితే, ఇప్పటికి కుదిరింది.
దసరా బరిలో నాలుగు సినిమాలు
ఆల్రెడీ దసరా బరిలో మూడు సినిమాలు ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'ను అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అదే రోజున ఉస్తాద్ రామ్ పోతినేని, బాలయ్యతో 'సింహ', 'లెజెండ్', 'అఖండ' వంటి విజయవంతమైన సినిమాలు ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా కూడా విడుదల కానుంది. తమిళ స్టార్ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తీస్తున్న 'లియో' అక్టోబర్ 19న విడుదలకు రెడీ అయ్యింది. బాలకృష్ణ రాకతో మొత్తం మీద దసరా బరిలో నాలుగు సినిమాలు ఉన్నట్టు అయ్యింది.
Also Read : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?
SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!
Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!
PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!
మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!
Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా