News
News
వీడియోలు ఆటలు
X

Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా టైటిల్ ఈ నెలలో అనౌన్స్ చేయనున్నారని సమాచారం.

FOLLOW US: 
Share:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఓ సినిమా చేస్తున్నారు కదా! ఆ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. ఈ నెలలోనే టైటిల్ అనౌన్స్ చేయడానికి చిత్ర బృందం రెడీ అవుతోంది.

టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ కూడా
షూటింగ్ మొదలైన సందర్భంగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ సెట్స్ లో ఉన్న ఫోటోలను విడుదల చేశారు. అయితే, ఇంకా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. టైటిల్, దానితో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల (ఏప్రిల్) 8న పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ పుట్టినరోజు. అబ్బాయి బర్త్ డేకి టైటిల్ అనౌన్స్ చేస్తారా? లేదంటే కొన్ని రోజులు వెయిట్ చేస్తారా? అనేది చూడాలి. 

జూలై 28న సినిమా విడుదల
ప్రముఖ నటుడు, ఇంతకు ముందు రవితేజ 'శంభో శివ శంభో'కు దర్శకత్వం వహించిన సముద్రఖని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. జూలై 28న ఈ  చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేశారు.

ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన 'రొమాంటిక్' కథానాయిక కేతికా శర్మ (Ketika Sharma) నటించనున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో ప్రత్యేక గీతంలో శ్రీలీల కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. 

Also Read గోపికమ్మ... ఎల్లువొచ్చి గోదారమ్మ... ఇప్పుడు బతుకమ్మ - బుట్ట బొమ్మ హిట్ సాంగ్స్!

ఫిబ్రవరి 22న హైదరాబాదులో చిత్రీకరణ ప్రారంభించారు. ఈ సినిమాకు రోజుకు రెండు కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు జనసేన పదవ వార్షికోత్సవ సభలో పవన్ తెలిపారు. ఈ సినిమాకు ఆయన 20 నుంచి 25 రోజులు షూటింగ్ చేస్తే చాలు. ఆయన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా పూర్తి అయ్యిందట. కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది 'వినోదయ సీతమ్' సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు.

పవన్ మోడ్రన్ దేవుడి పాత్ర చేయడం రెండోసారి. ఇంతకు ముందు 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కొంత సేపే ఉంటుంది. షూటింగ్ చేయడానికి ఎక్కువ రోజులు అవసరం లేదు. అందుకని, ముందు ఈ సినిమా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 20 డేస్ కేటాయించారట. మార్చి నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ చేస్తారని సమాచారం.

'వినోదయ సీతం' రీమేక్ కాకుండా... 'హరి హర వీర మల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ సినిమా పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్నాయి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'హరి హర వీర మల్లు' చిత్రీకరణ చాలా వరకు పూర్తి అయ్యింది. వచ్చే నెల నుంచి హరీష్ శంకర్ సినిమా, ఆ తర్వాత మేలో సుజీత్ సినిమా సెట్స్ మీదకు వెళతాయట. ఒక్కో సినిమాకు పది పది రోజులు చొప్పున పవన్ డేట్స్ కేటాయించారట.  

Also Read బాలీవుడ్‌కు కాజల్ భారీ పంచ్ - సౌత్‌తో కంపేర్ చేస్తూ గాలి తీసేసిందిగా!

Published at : 01 Apr 2023 11:23 AM (IST) Tags: Sai Dharam Tej Pawan Kalyan Akira Nandan Birthday PKSDT Movie Title

సంబంధిత కథనాలు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Cannes 2023: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సత్తా చాటిన 'శాకుంతలం', ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులు

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

Keerthy Suresh Dating: ఆ అసత్య వార్తలతో మనఃశాంతి కరువవుతోంది - కీర్తి సురేష్‌ తండ్రి ఆవేదన!

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

గీతా ఆర్ట్స్‌లో అక్కినేని, శర్వానంద్‌కు యాక్సిడెంట్ - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

NTR In Rest Mode : 'దేవర'కు ఇంకో వారం విశ్రాంతి - ఎన్టీఆర్ మళ్ళీ సెట్స్‌కు వచ్చేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్‌ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి

NTR కి నిజమైన రాజకీయ, పరిపాలన వారసుడు సీఎం కేసిఆర్ : మంత్రి ఎర్రబెల్లి