Pooja Hegde Hit Songs : గోపికమ్మ... ఎల్లువొచ్చి గోదారమ్మ... ఇప్పుడు బతుకమ్మ - బుట్ట బొమ్మ హిట్ సాంగ్స్!
Bathukamma Song - Kisi Ka Bhai Kisi Ki Jaan Movie : పూజా హెగ్డే చేసిన సినిమాలు కొన్నే. కానీ, ఆమె ఖాతాలో హిట్ సాంగ్స్ ఉన్నాయి. అందులోనూ మెలోడీ సాంగ్స్ ఉన్నాయి. లేటెస్టుగా ఆ లిస్టులో 'బతుకమ్మ' చేరింది.
తెలుగు, తమిళ్, హిందీ... మూడు భాషల్లో పూజా హెగ్డే (Pooja Hegde) సినిమాలు చేస్తున్నారు. అగ్ర హీరోలతో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ స్టేటస్ అందుకున్నారు. హీరోలతో సమానంగా డ్యాన్స్ చేయగల హీరోయిన్ అని పేరు తెచ్చుకున్నారు.
అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం' సినిమాలో 'సీటీ మార్...', రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాలో 'జిగేల్ రాణి...', ఎన్టీఆర్ 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాలో 'రెడ్డి ఇక్కడ సూడు...', 'అల వైకుంఠపురములో' సినిమాలో 'రాములో రాములో...', మహేష్ బాబు 'మహర్షి' సినిమాలో 'పాల పిట్ట...', విజయ్ 'బీస్ట్' సినిమాలో 'అలమత్తి హాబీబో...' పాటల్లో పూజా హెగ్డే ఎనర్జీతో డ్యాన్స్ చేశారు. గ్లామర్ గాళ్ అన్నట్టు కనిపిస్తారు.
తెలుగులో పూజా హెగ్డే చేసిన సినిమాలు కొన్నే కావచ్చు. కానీ, హిట్స్ ఎక్కువ ఉన్నాయి. అందులోనూ స్టార్ హీరోలతో చేసిన సినిమాలు ఎక్కువ. ఆ సినిమాల్లో హిట్ సాంగ్స్ కూడా ఎక్కువే. అయితే, పూజా హెగ్డే ఖాతాలో కొన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయి. ఆమె పేరు చెబితే గుర్తుకు వచ్చే పాటలు కొన్ని ఉన్నాయి. సంప్రదాయ దుస్తుల్లో చక్కగా సందడి చేసిన పాటలు ఉన్నాయి.
గోపికమ్మ అంటే...
గుర్తొచ్చేది పూజానే!
తెలుగులో పూజా హెగ్డేకు 'ముకుంద' రెండో సినిమా! కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఆమెకు మంచి పాట పడింది.'గోపికమ్మ'గా ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసుకుంది. మంచి పాట పడటం ఒక ఎత్తు... పాటను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేయడం మరో ఎత్తు! ఆస్వాదిస్తూ పూజా హెగ్డే డ్యాన్స్ చేయడం వల్ల పాటకు మరింత అందం పెరిగింది.
ఎల్లువొచ్చి గోదారమ్మ...
నయా శ్రీదేవి వచ్చిందమ్మా!
శ్రీదేవి సూపర్ హిట్ సాంగుల్లో 'ఎల్లువొచ్చి గోదారమ్మ' ఒకటి. ఆ పాటను రీమిక్స్ చేస్తున్నారని తెలిసినప్పుడు 'ఎలా ఉంటుందో?' అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. 'గద్దలకొండ గణేష్' సినిమాలో సాంగ్ విడుదలైన తర్వాత 'భలే చేశారు, బాగుంది' వంటి మాటలు వినిపించాయి. ముఖ్యంగా పూజా హెగ్డేను నయా శ్రీదేవి అంటూ చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
ఇప్పుడు బతుకమ్మ...
కుందనపు బొమ్మలా!
హిందీ సినిమా 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' నుంచి లేటెస్టుగా 'బతుకమ్మ...' సాంగ్ విడుదల అయ్యింది. ఆ సినిమాలో కథానాయిక పూజా హెగ్డేను మన హైదరాబాదీ అమ్మాయిగా చూపిస్తున్నారు. అందుకని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ పాటను రూపొందించారు. పాటలో తెలుగు సాహిత్యం వినబడుతుంది. కుందనపు బొమ్మలా పూజా హెగ్డే నృత్యం చేశారు. సల్మాన్ ఖాన్ సినిమా అయినా సరే... సాంగులో హైలైట్ మాత్రం పూజా హెగ్డేనే.
Also Read : విడాకులకు నాగ చైతన్యే కారణమా? సమంత మాటలకు అర్థం ఏమిటి?
'అల వైకుంఠపురములో' సినిమాలోని 'బుట్ట బొమ్మ...', 'సామజ వర గమన' పాటలతో పాటు పైన చెప్పిన కొన్ని పాటలు వింటున్నప్పుడు మనకు హీరోలు కూడా గుర్తుకు వస్తారు. హీరోలతో పాటు పూజా హెగ్డే కూడా గుర్తొస్తారు. అదీ ఆమె స్పెషాలిటీ. మరీ ముఖ్యంగా పైన ప్రత్యేకంగా ప్రస్తావించిన మూడు పాటలు విన్నప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది పూజా హెగ్డేనే.
Also Read : బాలీవుడ్‌కు కాజల్ భారీ పంచ్ - సౌత్‌తో కంపేర్ చేస్తూ గాలి తీసేసిందిగా!