Samantha Divorce Reason : విడాకులకు నాగ చైతన్యే కారణమా? సమంత మాటలకు అర్థం ఏమిటి?
Samantha Comments On Naga Chaitanya : నాగ చైతన్య, సమంత ఎందుకు విడాకులు తీసుకున్నారు? అనేది ఎవరికీ తెలియదు. ఇద్దరూ కారణాలు చెప్పలేదు. కానీ, ఇప్పుడు సమంత మాటలను చూస్తే... తప్పు చైతన్యదే అన్నట్లు ఉంది.
విడాకులకు అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) కారణమా? వివాహ బంధం నుంచి బయటకు రావాలని ఆయన కోరుకున్నారా? ఆయన వల్లే వేర్వేరుగా జీవించాల్సి వస్తోందా? అంటే... సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) చెబుతున్న మాటలను బట్టి 'అవును' అనుకోవాలి. లేకపోతే... ఆమె మాటలకు అర్థం ఏమిటి? తన తప్పు ఏమీ లేదని, తప్పంతా తన మాజీ భర్తదే అని సమంత పరోక్షంగా స్పష్టం చేస్తున్నారు.
విడాకులకు కారణం ఏమిటి?
చైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. తెలుగు చిత్రసీమలో చూడముచ్చని జంటల్లో వాళ్ళది ఒకటని పరిశ్రమ ప్రముఖులు, ప్రేక్షకులు అనుకునేవారు. అయితే, ఒక్కసారిగా వాళ్ళిద్దరూ షాక్ ఇచ్చారు. తాము వేరు పడుతున్నట్లు ప్రకటించారు. దానికి కొన్ని రోజుల ముందు నుంచి సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు అన్ ఫాలో కావడం వంటివి జరిగినా... అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ప్రేక్షకుల్లో చాలా మందికి అదొక హఠాత్పరిణామం. అప్పటి నుంచి విడాకులకు కారణం ఏమిటో తెలుసుకోవాలని ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. చైతన్య, సమంత... ఇద్దరిలో ఇప్పటి వరకు ఎవరూ కారణాలు చెప్పలేదు. కానీ, సమంత లేటెస్ట్
కామెంట్స్ వింటుంటే... చైతన్య తప్పు చేశాడని పరోక్షంగా చెబుతున్నట్లు అయ్యింది.
నేను ఏ తప్పూ చేయలేదు! - సమంత
సమంత ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'శాకుంతలం' ఏప్రిల్ 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియాకు ఆమె వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ''విడాకులు తీసుకున్నాం. కానీ, నేను ఏమీ తప్పుగా చేయలేదు. నా వైపు నుంచి వంద శాతం కృషి చేశా. వైవాహిక బంధానికి కట్టుబడి ఉన్నాను'' అని సమంత పేర్కొన్నారు.
తాను తప్పు చేయలేదని సమంత చెప్పడంలో అర్థం ఏమిటి? చైతన్య తప్పు చేశాడని చెబుతున్నారా? రెండు లైన్లలో ఎన్నో అనుమానాలు, ప్రశ్నలను ప్రేక్షకులకు వదిలేశారు. సమంత కామెంట్స్ వల్ల నాగ చైతన్య బ్యాడ్ అవుతున్నాడని అక్కినేని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.
Also Read : మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
విడాకుల తర్వాత సమంత మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. అప్పట్లో సమంతకు ఎవరితోనో ఎఫైర్ ఉందని చెప్పుకొచ్చారు. ఆ వదంతులను, పుకార్లను సమంత ఖండించారు. తనపై వచ్చిన విమర్శలపై సమంత స్పందిస్తూ... "అభిమానుల ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలను. అయితే... దాన్ని మారో రూపంలో చెబితే బావుండేది. ట్రోల్స్ చేయకుండా" అని అన్నారు.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత నేరుగా స్టార్స్‌ను కామెంట్ చేసే, ట్రోల్స్ చేసే నెటిజన్స్ సంఖ్య పెరిగింది. స్టార్స్ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశిస్తున్నారు. దీనికి కారణం స్టార్స్ అనేది సమంత మాటలను బట్టి అర్థమవుతోంది. "అభిమానులు చూపించే ప్రేమ కోసం స్టార్స్ పరితపిస్తారు. ప్రతి విషయాన్నీ వాళ్లతో పంచుకుంటారు. నా వ్యక్తిగత విషయాల్ని వారితో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా. అలా చేయడం వల్ల... ఓ విధంగా అభిమానులు, ప్రేక్షకులను నా జీవితంలోకి ఆహ్వానించడమే" అని సమంత వ్యాఖ్యానించారు.
Also Read : ఆ సమయంలో మా చేతిలో రూ.5 వేలు కూడా లేవు: వరుణ్ సందేశ్ భార్య వితిక