News
News
వీడియోలు ఆటలు
X

Varun Sandesh Vithika: ఆ సమయంలో మా చేతిలో రూ.5 వేలు కూడా లేవు: వరుణ్ సందేశ్ భార్య వితిక

వరుణ్ సందేశ్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. ఆయన కెరీర్ ప్రారంభంలో నటించిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాయి. అయితే తర్వాత వరుణ్ కు సరైన హిట్ అందలేదు.

FOLLOW US: 
Share:

Varun Sandesh Vithika: టాలీవుడ్‌లో ఎంతో మంది యంగ్ హీరోలు ఉన్నారు. వారిలో ఒక హిట్ కోసం ఎన్నో ఏళ్లు ఎదురుచూసిన ఒక హిట్ తో ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. మరికొంత మంది కెరీర్ ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ అందుకొని తర్వాత ఒక హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న హీరోలు ఉన్నారు. ఇందులో హీరో వరుణ్ సందేశ్ రెండో కేటగిరీలోకి వస్తారు. ‘హ్యాపీ డేస్’ సినిమాతో మంచి హిట్ అందుకొని తర్వాత ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు వరుణ్. అయితే ఈ సినిమాల తర్వాత ఆయనకు ఇప్పటి దాకా సరైన హిట్ లేదు. మధ్యలో అడపా దడపా సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆయన్ను కమర్షియల్ హీరోగా నిలబెట్టలేకపోయాయి. దీంతో కొన్ని సంవత్సరాలు సినిమాలకు దూరం అయిపోయారు వరుణ్ సందేశ్. వితికతో వివాహం తర్వాత కాస్త ఎక్కువగా బయట కనిపిస్తున్నారు. తాజాగా ఈ జంట యాంకర్ ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న ఓ టీవీ కార్యక్రమానికి గెస్ట్ లుగా వచ్చారు. ఇటీవలే ఈ ప్రోగ్రాం కు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ సందర్భంగా సినిమా కెరీర్ లో తాము ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్పుకొచ్చింది ఈ జంట. 

వరుణ్ సందేశ్ కు టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. ఆయన కెరీర్ ప్రారంభంలో నటించిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాయి. అయితే తర్వాత వరుణ్ కు సరైన హిట్ అందలేదు. టాలీవుడ్ లో వివాదాలకు దూరంగా ఉండే హీరోల్లో వరుణ్ ఒకరు. అందుకే హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆయన సినిమాలు చేస్తూ వస్తున్నారు. ప్రేక్షకుల్లో కూడా వరుణ్ పై సాఫ్ట్ కార్నర్ ఉంది. అదే ఆయన్ను ఇంకా సపోర్ట్ చేస్తూ వస్తోంది. వరుణ్ సందేశ్ 2016లో టాలీవుడ్ నటి రితికను వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత వరుణ్, రితిక జంట పలు ఈవెంట్లు, టీవీ ప్రోగ్రాంలలో కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ ఓంకార్ హోస్ట్ గా చేస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా కెరీర్ గురించి ఓంకార్ వరుణ్ ను ప్రశ్నించారు ఓంకార్. దానికి వరుణ్ సమాధానం చెబుతూ.. తాను చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం వలనే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. సినిమాలు సెలెక్ట్ చేయడంలో తాను ఎక్కడో పొరబాటు చేసినట్లు మాట్లాడారు. ఒకానొక సమయంలో ఫ్యామిలీతో పాటు అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చిందని అన్నారు వరణ్.

అనంతరం వరుణ్ భార్య వితిక మాట్లాడుతూ.. ఇద్దరం ఒకే ఆలోచనలు కలిగిన వారమని, ఒకరినొకరు సంతోషంగా ఉంచడానికే చూస్తామని అందుకే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎదుర్కొని నిలబడ్డామని చెప్పుకొచ్చింది. ఏదో చేసేయాలని, కార్లు బంగ్లాలు కొనేయాలి ఏదో ఐపోవాలి అనే ఆలోచన తమకు ఉండదని అంది. ఏదైనా ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకెళ్తామని చెప్పింది. కెరీర్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఒకానొక సమయంలో చేతిలో ఒక రూ.5 వేలు కూడా లేవని చెప్తూ భావోద్వేగానికి గురైంది వితిక. ప్రస్తుతం ఈ ప్రోగ్రాంకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక వరుణ్ సందేశ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నారు. గతేడాది ‘ఇందువదన’ సినిమాలో నటించారు. ఈ ఏడాది సందీప్ కిషన్ ‘మైఖేల్’ సినిమాలో ఓ పాత్రలో కనిపించారు. తాజాగా ‘చిత్రం చూడర’ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు వరుణ్.

Read Also: నా దేశంలో వయసు అనేది అవమానం - ‘ఆంటీ’ ట్రోలర్స్‌కు అనసూయ చురకలు

Published at : 30 Mar 2023 06:11 PM (IST) Tags: Varun Sandesh Vithika Sheru varun-Vithika varun sandesh Movies

సంబంధిత కథనాలు

Sixth Sense Promo: పెళ్లి అంటేనే పెద్ద భూతం, క్యూట్ బ్యూటీస్ హాట్ కామెంట్స్!

Sixth Sense Promo: పెళ్లి అంటేనే పెద్ద భూతం, క్యూట్ బ్యూటీస్ హాట్ కామెంట్స్!

మహేష్ పార్టీకి, అఖిల్‌కు లింకేంటీ? ఆ హాట్ వెబ్ సీరిస్‌లో తమన్నా, మృణాల్ - ఇంకా ఎన్నో సినీ విశేషాలు!

మహేష్ పార్టీకి, అఖిల్‌కు లింకేంటీ? ఆ హాట్ వెబ్ సీరిస్‌లో తమన్నా, మృణాల్ - ఇంకా ఎన్నో సినీ విశేషాలు!

Gruhalakshmi June 6th: రాజ్యలక్ష్మి ప్లాన్ సక్సెస్, దివ్యని అసహ్యించుకున్న విక్రమ్- రంగంలోకి లాస్య మాజీ మొగుడు

Gruhalakshmi June 6th: రాజ్యలక్ష్మి ప్లాన్ సక్సెస్, దివ్యని అసహ్యించుకున్న విక్రమ్- రంగంలోకి లాస్య మాజీ మొగుడు

Krishna Mukunda Murari June 6th: కొడుకు, కోడలు విడిపోకుండా అదిరిపోయే ప్లాన్ వేసిన రేవతి- ముకుందకి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్

Krishna Mukunda Murari June 6th: కొడుకు, కోడలు విడిపోకుండా అదిరిపోయే ప్లాన్ వేసిన రేవతి- ముకుందకి ఫ్యూజులు ఎగిరిపోయే షాక్

Guppedanta Manasu June 6th: కేడీ గ్యాంగ్ మీద కంప్లైంట్ ఇస్తానన్న వసు- తండ్రిని తలుచుకుని బాధపడుతున్న రిషి

Guppedanta Manasu June 6th: కేడీ గ్యాంగ్ మీద కంప్లైంట్ ఇస్తానన్న వసు- తండ్రిని తలుచుకుని బాధపడుతున్న రిషి

టాప్ స్టోరీస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!