అన్వేషించండి

Nindu Manasulu Serial Today March14th: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ

Nindu ManasuluSerial Today Episode March 14th: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ

Nindu Manasulu Serial Today Episode: ప్రేరణ వల్లే సిద్ధూకు ఈ పరిస్థితి వచ్చిందని కోపంగా ఉన్న సిద్ధూ తల్లి...ప్రేరణను అనరాని మాటలు అంటుంది. నీవల్లే ఇవాళ సిద్ధూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని మండిపడుంది. ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసని నిన్ను వాడికి దూరంగా ఉండమన్నా నా మాట వినలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సిద్ధూ నాకు చాలా మంచి ప్రెండ్‌ అని నా బాగోగులన్నీ చూసుకున్న సిద్ధూకు ఇలా జరగడం నాకు కూడా బాధగానే ఉందని ప్రేరణ అంటుంది. 
 
నువ్వు కావాలనే సిద్ధూకు దగ్గరయ్యావని సిద్ధూతల్లి అంటుంది. మీ అమ్మలాగే నువ్వు కూడా  బాగా డబ్బున్న వాడిని వలలో వేసుకోవాలనుకున్నారని...అందుకే నాకొడుక్కి మాయమాటలు చెప్పి వాడిని నీవైపు తిప్పుకున్నావని అంటుంది. ఆ మాటలకు ప్రేరణ చాలా బాధపడుతుంది.నేను ఎప్పుడూ సిద్ధూను ఓమంచి ప్రెండ్‌లాగే భావించానని అంటుంది. అయితే ఇంతకు ముందు సిద్ధూకు దూరం జరిగిన దానివి మళ్లీ ఎందుకు దగ్గరయ్యావని... అలాగే ఎందుకు ఉండలేదని ప్రశ్నిస్తుంది. 
 
అసలు సిద్ధూకు మళ్లీ మళ్లీ ఎందుకు దగ్గరవుతున్నావని అడుగుతుంది. ఇవాళ ఇలా జరగడానికి నువ్వు కారణం కాదా అని నిలదీస్తుంది. నేను మొదటి నుంచి అనుకున్న విధంగానే  సిద్ధూ ప్రాణాల మీదకు తెచ్చావని కోప్పడుతుంది. నీ మాయలో పడి వాడు కనీసం మా మాట వినడం లేదని...ఇంటికికూడా  రాకుండా  ఇక్కడికి వచ్చి ఇలా చేసుకున్నాడని అంటుంది. వాడికి అంటుకున్న పెద్ద దరిద్రానివి నువ్వేనని తిట్టిపోస్తుంది.
 
రాజశేఖర్‌ మళ్లీ ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో భార్య ఈశ్వరి ఆయన దగ్గరకు వెళ్లి పలకరిస్తుంది. కల్లు తెరిచి తనను పిలవాలంటూ  కోరుతుంది. అప్పుడు అక్కడికి వచ్చిన గణా...నాన్నను ఇబ్బంది పెట్టొద్దని అంటాడు. జీవచ్ఛంలా పడి ఉన్న మీనాన్న ఆ పరిస్థితుల్లోనూ  తన నోటితో ప్రేరణ అని పిలిచాడు కానీ....కట్టుకున్న భార్య నన్నుగానీ, కన్నకొడుకు నిన్ను గానీ గుర్తుపెట్టుకోలేదని బాధపడుతుంది. డాక్టర్‌  చెప్పినట్లు ఇప్పుడు ఆయన మళ్లీ మామూలు మనిషి అయితే వాళ్లను ఇక్కడికి తీసుకొస్తానని అంటాడని....వాళ్లే నా బిడ్డలని అందరికీ చెబుతాడని ఏడుస్తుంది. 
 
అదే జరిగితే నేను తట్టుకోలేనని  అంటుంది. ఆ ఇందిర,నేను సమానమని అంటే ఊహించుకోలేకుండా  ఉన్నానని అంటుంది. వాళ్లు మళ్లీ ఇక్కడికి వస్తారని అంటుంది. అది నువ్వే కాదు అమ్మా నేను కూడా  తట్టుకోలేనని   గణా అంటాడు. నాన్నకు నువ్వు మాత్రమే భార్వవి....నేను మాత్రమే కొడుకునని అంటాడు. వాళ్లను మళ్లీ ఇంట్లోకి రానిచ్చేదిలేదని, నాన్నను చూడనిచ్చేది అస్సలు ఉండదని గణా అంటాడు. అలా వాళ్లు మాట్లాడుతుండగానే  ఇందిర, ఐష్‌ అక్కడికి వస్తారు. వాళ్లను వెతుకుతూ  ఐష్‌ గట్టిగా పిలుస్తుంది. వాళ్ల రాకను చూసి గణా కోపంతో రగిలిపోతాడు.
 
ఆస్పత్రి దగ్గర నుంచి వెళ్లిపోవాలని ప్రేరణను  సిద్ధూ వాళ్ల అమ్మ తీవ్రమైన ఒత్తిడి చేస్తుంది. నువ్వు ఉన్నంత వరకు వాడి ప్రాణాలకు ముప్పేనని...ఇంకెప్పుడూ  వాడి జీవితంలోకి రావొద్దని హెచ్చరిస్తుంది. దీనికి ప్రేరణ కూడా దీటుగా  జవాబిస్తుంది. మీరు అన్నమాటలు ఏవీ నిజం కావని...మామధ్య ఎలాంటి దురుద్దేశాలులేనప్పుడు నేను ఎందుకు బాధపడాలని అంటుంది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు సిద్ధూ నా వెంటే ఉన్నాడని....నా ప్రాణాలు కాపాడబోయి తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని...అలాంటి పరిస్థితుల్లో సిద్ధూను వదిలేసి నేను వెళ్లనని ప్రేరణ అంటుంది. 
 
సిద్ధూకు ప్రాణాపాయం లేదని తెలిసిన తర్వాతే ఇక్కడి నుంచి వెళ్తానని  తెగేసి చెబుతుంది. అప్పుడే డాక్టర్ వచ్చి సిద్ధూకు ఇంకా ప్రాణాపాయం తప్పలేదని...రక్తం ఎక్కువగా పోవడం వల్ల ఆపరేషన్ చేయాలంటే రక్తం కావాలని అడుగుతాడు. సిద్ధూ తల్లి, చెల్లితో పాటు ఎవరి రక్తం కూడా  అతనికి మ్యాచ్ అవ్వదు..ప్రేరణ రక్తం మాత్రమే మ్యాచ్ అవుతుంది. దీంతో ప్రేరణ రక్తం ఇస్తానని అనడంతో సిద్ధూవాళ్ల అమ్మ వద్దని అంటుంది. ఆస్పత్రిలో ఇంకా  ఎవరిదైనా ఉందే చూడమని డాక్టర్‌కు చెబుతుంది. అన్నిచోట్ల వెతికామని ఎక్కడా  దొరకడం లేదని చెబుతారు. 
 
అయినా సరే ఈ ప్రేరణ రక్తం ఇవ్వడానికి వీల్లేదని చెప్పి...తన భర్తకు ఫోన్ చేసి తెప్పిస్తానని చెప్పినా అతని ఫోన్ కలవదు. మీకు మీకు మధ్య ఎన్ని గొడవలు ఉన్నా తర్వాత చూసుకోండని...ఇప్పుడు అతని ప్రాణాలు దక్కాలంటే  రక్తం కావాల్సిందేనని  చెప్పి  ప్రేరణను తీసుకెళ్లి రక్తం ఎక్కిస్తాడు. ఆపరేషన్ సక్కెస్‌ అయ్యిందని...సిద్ధూ ప్రాణాలకు ప్రమాదం ఏమీలేదని డాక్టర్ చెప్పడంతో  అందరూ సంతోషిస్తారు.

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget