అన్వేషించండి

Anasuya Bhardwaj: నా దేశంలో వయసు అనేది అవమానం - ‘ఆంటీ’ ట్రోలర్స్‌కు అనసూయ చురకలు

నటి అనసూయ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఫారిన్ లో వృద్దులకు నిర్వహించిన రన్నింగ్ రేస్ వీడియోను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనసూయ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బుల్లితెర ప్రేక్షకుల్ని తన అంద, చందాలతో ఎంతో ఆకట్టుకుంది. ‘జబర్దస్త్’ కామెడీ షో తో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత పలు ఛానెల్స్ లో యాంకర్ గా షోలు చేసింది. యాంకర్ గా చేస్తూనే పలు సినిమాల్లో నటించింది. బుల్లితెరపై టాప్ యాంకర్ గా వెలుగు వెలిగిన అనసూయకు, వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్తగా నటించిన మెప్పించడంతో అవకాశాలు క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో టీవీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి సినిమా ఇండస్ట్రీలోకి పూర్తి స్థాయిలో అడుగు పెట్టింది.  

మా దేశంలో వయసు అనేది అవమానం - అనసూయ

తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. వృద్ధులకు నిర్వహించిన రన్నింగ్ రేస్ కు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. మన దగ్గర వయసు పెరగడం అవమానంగా భావిస్తారు ట్వీట్ చేసింది. “నా దేశంలో, నా రాష్ట్రంలో వయస్సు పెరగడం అనేది ప్రతి ఒక్కరికీ అవమానం” అని క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియోను వాలా అఫ్సర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో 100 ఏండ్ల వయసున్న వృద్ధులకు రన్నింగ్ రేస్ నిర్వహిస్తారు. 102 సంవత్సరాలున్న పండు ముసలి వ్యక్తి ఈ ఈవెంట్ లో పాల్గొని అందరినీ ఆకట్టుకుంటాడు. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అంతేకాదు, అనసూయ స్టేట్ మెంట్ పై అందరూ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. మరికొంత మంది మాత్రం ‘ఆంటీ’ అన్నందుకు ఫీలైనట్లుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.  

వరుస సినిమాలతో బిజీ బిజీ

కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరెక్కిన 'రంగమార్తాండ'లో ప్రకాష్ రాజ్ కోడలి పాత్రలో అనసూయ కనిపించారు.  తాజాగా విడుదలైన ఈ చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం 'పుష్ప 2', ‘అరి’, సహా పలు తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది. ‘పుష్ష’ సినిమాలో కాత్యాయినిగా ఆకట్టుకున్న అనసూయ, ‘పుష్ప2’లో మరింత అలరించనున్నట్లు తెలుస్తోంది.    

అనసూయ మనసులో ఏమీ దాచుకోదు!

వాస్తవానికి అనసూయ భరద్వాజ్ మనసులో ఏమీ దాచుకోదు. తన మనసుకు అనిపించిన విషయాలను బయటకు చెప్పేస్తుంది. ఎవరో ఏదో అనుకుంటారని సైలెంట్ గా ఉండే రకం కాదు తను. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులుకు ఫిర్యాదు కూడా చేసింది. అంతేకాదు,  ఎవరైన తన గురించి పిచ్చి కామెంట్స్ చేస్తే, చీరి చింతకు కట్టేలా రిప్లై ఇస్తుంది. అందుకే ఆమెపై ఫైర్ బ్రాండ్ అనే ముద్ర పడింది. ఆమె పర్సనల్ విషయాలు ఎలా ఉన్నా, సినిమా రంగంలో మాత్రం మంచి స్వింగ్ లో కొనసాగుతోంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Read Also: నెట్ ఫ్లిక్స్ షాక్, స్ట్రీమింగ్ నుంచి ‘రానా నాయుడు’ తొలగింపు, కారణం అదేనా?

టాప్ హెడ్ లైన్స్

Pyaar Prema Kalyanam OTT : ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి డైరెక్ట్‌గా కొత్త మూవీ - తెలుగమ్మాయి హీరోయిన్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Venkatesh AK47 : చిట్టిబాబుగా వెంకటేశ్ - ఆదర్శ కుటుంబంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్
చిట్టిబాబుగా వెంకటేశ్ - ఆదర్శ కుటుంబంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 27th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదే! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిండ ప్రదానానికి కనీసం ఫొటో కూడా లేదా! విహారి చేసిన పనికి ఏడుపు రాక మానదు!
Ram Charan Surgery: అంత పెద్ద అపోలో ఉండగా.. గంగా హాస్పిటల్ ఎందుకు? రామ్‌చరణ్‌ సర్జరీకి అక్కడికి వెళ్లడానికి అసలు రీజన్ అదే..
అంత పెద్ద అపోలో ఉండగా.. గంగా హాస్పిటల్ ఎందుకు? రామ్‌చరణ్‌ సర్జరీకి అక్కడికి వెళ్లడానికి అసలు రీజన్ అదే..

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Embed widget