By: ABP Desam | Updated at : 30 Mar 2023 10:59 AM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Venkatesh Daggubati/Instagram/Pixabay
తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో దగ్గుబాటి వెంకటేష్, ఆయన అన్నయ్య కొడుకు రానా. టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగిన వెంకటేష్, ఎన్నో కుటుంబ కథా చిత్రాల్లో నటించారు. మంచి ఫ్యామిలీ హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలకు కారణం కాకుండా చాలా డిగ్నిటీగా ఉన్నారు. అలాంటి హీరో ఒకే ఒక్క వెబ్ సిరీస్ తో దశాబ్దాల తరబడి సాధించిన ప్రతిష్టను గంగలో కలుపుకున్నారు. చాలా మంది హీరోల్లాగే రానాతో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. బాబాయ్, అబ్బాయ్ కలిసి నటించడంతో ఈ వెబ్ సిరీస్ విడుదలకు ముందు ఓ రేంజిలో హైప్ అందుకుంది. ఇందులో వీరిద్దరు తండ్రి కొడుకుల్లా నటించారు. నెట్ ఫ్లిక్స్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించగా, సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ తెరకెక్కించారు.
అశ్లీలత, బూతులపై తీవ్ర విమర్శలు
ఈ వెబ్ సిరీస్ అమెరికన్ పాపులర్ వెబ్ సిరీస్ ‘రే డోనోవర్’కు ఇండియన్ వెర్షన్ గా రూపొందించారు. బాలీవుడ్ హాట్ బ్యూటి సుర్విన్ చావ్లా ఇందులో చక్కటి నటన కనబర్చింది. ఆశిష్ విద్యార్థి, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఆదిత్య మీనన్, ముకుల్ చద్దా కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ను మార్చి 10 నుంచి ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో హిందీతో పాటు తెలుగు, తమిళంలో స్ట్రీమింగ్ కు ఉంచింది. విడుదల తర్వాత పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఇందులో విపరీతమైన అశ్లీలత, అసభ్య పదజాలం ఉండటంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. విజయశాంతి, శివకృష్ణ లాంటి నటులు కూడా ఈ వెబ్ సిరీస్ ను తీవ్రంగా వ్యతిరేకించారు. వెంటనే దీన్ని స్ట్రీమింగ్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, నెటిజన్ల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు వెర్షన్ ‘రానా నాయుడు’ని తొలగించింది.
పొరపాటున తొలగించారా? కావాలనే చేశారా?
ఈ వెబ్ సిరీస్ తొలగింపుపై నెట్ ఫ్లిక్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ తొలగింపు పొరపాటున జరిగిందా? లేదంటే, ఉద్దేశపూర్వకంగా తొలగించబడిందా? అనే విషయాన్ని OTT ప్లాట్ ఫామ్ వెల్లడించలేదు. తొలుత ఈ వెబ్ సిరీస్ ను హిందీలో షూట్ చేసి, దానికి తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ఈ వెబ్ సిరీస్ పై ఓ వైపు తీవ్ర నిరసనలు వ్యక్తం అయినా, మరోవైపు టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. కొద్ది రోజుల క్రితం ఈ సిరీస్ గురించి మాట్లాడిన వెంకటేష్, డబ్బింగ్ సమయంలో చాలా ఇబ్బంది పడినట్లు తెలిపారు. తాజాగా నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించడంపై వెంకటేష్, రానా కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Also: ‘దసరా’ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు, తెలిస్తే మిస్ చేయకుండా చూస్తారు!
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
మహేష్ పార్టీకి, అఖిల్‌కు లింకేంటీ? ఆ హాట్ వెబ్ సీరిస్‌లో తమన్నా, మృణాల్ - ఇంకా ఎన్నో సినీ విశేషాలు!
Lust Stories 2 Teaser : పెళ్ళికి ముందు టెస్ట్ డ్రైవ్ చేయరా? హాట్ హాట్‌గా తమన్నా, మృణాల్ వెబ్ సిరీస్ టీజర్!
Telangana Tyagadhanulu Web Series : తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన త్యాగధనులు చరిత్రతో వెబ్ సిరీస్
Top 50 Web Series: ఇండియాలో టాప్ 50 వెబ్ సీరిస్‌లు ఇవేనట - ‘రానా నాయుడు’ ఏ స్థానంలో ఉందో తెలుసా?
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!