By: ABP Desam | Updated at : 29 Mar 2023 08:52 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Keerthy Suresh/instagram
నేచురల్ స్టార్ నాని దేశ వ్యాప్తంగా సినీ అభిమానులను అలరించబోతున్నారు. ఆయన కెరీర్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా, మాస్ యాక్షన్‌తో హై-ఆక్టేన్, హై-ఎనర్జీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్, పాటలు, ప్రమోషన్ మూవీపై భారీ అంచనాలు పెంచాయి. అయితే, ఈ సినిమా వెనుక 5 ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం..
1. నాని తొలి పాన్ ఇండియా మూవీ
కొద్ది సంవత్సరాలుగా తనదైన శైలిలో సినిమాలు చేస్తూ సౌత్ ప్రేక్షకులను బాగా అలరించారు నాని. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. ‘దసరా’ మూవీ నాని కెరీర్ లో తొలి పాన్ ఇండియన్ సినిమా. యూనివర్సల్ అప్పీల్ స్టోరీతో అన్ని ప్రాంతాల ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.
2. 6 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న నాని, కీర్తి సురేష్
నటులు నాని, కీర్తి సురేష్ చివరిసారిగా ‘నేను లోకల్’ అనే బ్లాక్ బస్టర్ సినిమాలో నటించారు. 2017లో విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. 6 సంవత్సరాల తరువాత 'దసరా' కోసం మళ్లీ జతకట్టారు. ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు.
3. మాస్ ఎనర్జిటిక్ మ్యూజిక్
‘దసరా’ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. విభిన్న ట్రాక్‌లతో కూడిన ఆల్బమ్‌ను స్కోర్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల నోళ్లలో మెదులుతున్నాయి. అప్ టెంపో బీట్‌లతో అవుట్ అండ్ అవుట్ హై ఎనర్జీతో ఆకట్టుకుంటున్నాయి. టీజర్ విడుదల నుంచి ఈ సినిమా మ్యూజిక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలోని ‘చమ్కీల అంగీలేసి’ అనే పాట సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో హల్ చల్ చేస్తోంది.
4. సరికొత్త అవతార్‌లో నాని, కీర్తి
ఈ చిత్రంలో నాని, కీర్తి సురేష్ సరికొత్త పాత్రల్లో కనిపించనున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా పూర్తి స్థాయి డీ గ్లామర్ పాత్రల్లో అలరించనున్నారు. వీరిద్దరి పాత్రలు సినిమాలో చాలా రియలిస్టిక్ గా ఉండనున్నాయి. వీరి నటన, ఫైట్స్, పాటలు అన్ని పాన్ ఇండియన్ ప్రేక్షకులలో ఉత్సాహాన్ని నింపనున్నాయి.
5. 25 ఎకరాల్లో భారీ సెట్టింగ్స్
‘దసరా’ షూటింగ్ కోసం 25 ఎకరాల సెట్‌తో కోల్ మైనింగ్ ను నిర్మించారు. సినిమాలో పని చేస్తున్న వారి కోసం అన్ని సౌకర్యాలతో ఓ విలేజ్ సెట్ కూడా రూపొందించారు. ఈ సినిమా కోసం రైళ్లు నడిచేలా సెట్ వేయడంతో పాటు రైలు ట్రాక్ కూడా నిర్మించారు. సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఒదెల తండ్రి సింగరేణి బొగ్గు గనిలో కార్మికుడిగా ఉన్నందున, కథకు అనుకూలమైన విజువల్స్ కోసం మైనింగ్ నిపుణుల వివరాలు తీసుకుని రూపొందించారు. చాలా రియలిస్టిక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ‘దసరా’ సినిమాలె దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్రఖని, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం మార్చి 30న (గురువారం) దేశ వ్యాప్తంగా విడుదలకానుంది.
Read Also: దుమ్మురేపుతున్న‘చమ్కీల అంగీలేసి’ సాంగ్, సోషల్ మీడియాకు కొత్త వైరస్!
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!
ప్రభాస్ తనలో రాముడిని బయటకు తెచ్చారు, నేటితరానికి ఈ మూవీ అవసరం: చిన్న జీయర్ స్వామి
రామ్ చరణ్ సినిమా కోసం 'RRR' ఫార్ములాను ఫాలో అవుతున్న బుచ్చిబాబు!
వివాదంలో ‘2018’ మూవీ - జూన్ 7 నుంచి థియేటర్స్ బంద్, ఎందుకంటే..
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Kakinada MP Vanga Geetha: వైసీపీ ఎంపీ వంగా గీత నుంచి ప్రాణహాని! స్పందనలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన ఆడపడుచు