News
News
వీడియోలు ఆటలు
X

Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!

ఇటీవల మంచు విష్ణు మంచు మనోజ్ వద్ద పనిచేసే వ్యక్తి ఇంటికివెళ్లి ఎంత గొడవ చేశాడో వైరల్ అయిన వీడియోలో చూశాం. అయితే ఈ వీడియో నిజం కాదట. కేవలం ప్రమోషన్స్ కోసం ఆ వీడియోను చేసినట్టు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

Manchu Vishnu: టాలీవుడ్ లో మంచు ఫ్యామిలీకు మంచి గుర్తింపు ఉంది. నటుడిగా మోహన్ బాబు ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఆయన తర్వాత ఆయన కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ లు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. గత కొంత కాలంగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయని నిత్యం వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంచు విష్ణు మంచు మనోజ్ వద్ద పనిచేసే వ్యక్తి ఇంటికి వెళ్లి గొడవ చేస్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది. దానిపై మనోజ్ స్పందిస్తూ ఇలాగే విష్ణు ఇళ్ల మీదకు వచ్చి అందిరిపైనా దాడి చేస్తాడు అంటూ ఫైర్ అయ్యారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు మళ్లీ కాసేపటికి డిలీట్ చేసేశారు. అప్పటికే ఆ వీడియో వైరల్ అయింది. అయితే తర్వాత దానిపై విష్ణు స్పందిస్తూ మనోజ్ తెలియక చేశాడు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో అప్పటి నుంచి అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడే మంచు విష్ణు తన బిజినెస్ మైండ్ ను ఉపయోగించాడు. ఈ గొడవల నేపథ్యంలో విష్ణు అందరికీ ఓ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. అది చూసి అందరూ షాక్ అవుతున్నారు. 

‘హౌస్ ఆఫ్ మంచు’ పేరుతో రియాలిటీ షో..

ఇటీవల మంచు విష్ణు మంచు మనోజ్ వద్ద పనిచేసే వ్యక్తి ఇంటికెళ్లి ఎంత గొడవ చేశాడో వైరల్ అయిన వీడియోలో చూశాం. అయితే ఈ వీడియో నిజం కాదని, కేవలం ప్రమోషన్స్ కోసం ఆ వీడియోను చేశారని తెలుస్తోంది. ఎందుకంటే.. మంచు ఫ్యామిలీ త్వరలో ఓ సరికొత్త ప్రయత్నం చేయబోతోంది. ‘హౌస్ ఆఫ్ మంచు’ పేరుతో ఓ రియాలిటీ షో ను ప్రారంభించనున్నారట మంచు ఫ్యామిలీ. ఇందుకు సంబంధించి మంచు విష్ణు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో ఆ రోజు మంచు విష్ణు గొడవ పడిన వీడియోను ప్రారంభంలో పెట్టారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే.. త్వరలో ‘హౌస్ ఆఫ్ మంచు’ అనే రియాలిటీ షోతో మీ ముందుకు వస్తాం అంటూ అనౌన్స్ చేశాడు విష్ణు. ఈ రియాలిటీ షో ను ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపాడు. అవా ఎంటర్టైన్మెంట్ ఈ రియాలిటీ షో ను రూపొందిస్తోంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. ఈ రియాలిటీ షోలో మంచు విష్ణు ఫ్యామిలీకి సంబంధించిన వారి వ్యక్తిగత జీవితాలను చూపించనున్నట్లు సమాచారం. భారీ ఎత్తునే ఈ షో ను ప్లాన్ చేస్తున్నారట మంచు ఫ్యామిలీ.

అంతా ప్లాన్ ప్రకారమే చేశారా?

అసలు ముందు నుంచీ ఈ మంచు ఫ్యామిలీ గొడవలపై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. గొడవ వీడియో బయటకు రాగానే న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తర్వాత ఏం జరుగుతుందా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. అన్నదమ్ముల మధ్య నిజంగానే ఇంత వైరం ఉందా అని అనుకున్నారంతా. అయితే ఇదంతా కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చేసిన ప్లాన్ అని తెలుస్తోంది. నిజంగా ఇది రియాలిటీ షో కోసం లీక్ చేసిన ప్రమోషన్ వీడియోనా లేదా బయటపడ్డ పరువును కాపాడుకోడానికి చేసిన కవరింగ్ రియాలిటీ షో నా అనే ప్రశ్నలతో తలపట్టుకుంటున్నారు నెటిజన్స్. కొంతమంది అయితే దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఏప్రిల్ రాకుండానే జనాలను భలే ఫూల్ చేసింది మంచు ఫ్యామిలీ’ అని కొంత మంది అంటుంటే.. మరికొంత మంది ‘ఈ మంచు ఫ్యామిలీ ఏం చేసినా ఇలాగే చేస్తారు’ అంటూ పంచ్ లు వేస్తున్నారు. ఏదేమైనా కాంట్రవర్సీలను కూడా ఎలా క్యాష్ చేసుకోవాలో మంచు ఫ్యామిలీను చూసి నేర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మరి రాబోయే ఆ రియాలిటీ షో ఎలా ఉంటుందో అందులో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయో చూడాలి. 

Read Also: నా దేశంలో వయసు అనేది అవమానం - ‘ఆంటీ’ ట్రోలర్స్‌కు అనసూయ చురకలు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

Published at : 30 Mar 2023 08:26 PM (IST) Tags: Manchu Manoj Manchu Family Manchu Vishnu House of Manchus

సంబంధిత కథనాలు

భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

భగవంత్ కేసరి టీజర్, రజనీ, అమితాబ్ కాంబినేషన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

Nayanthara - Vignesh Shivan: నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్, యానివర్సరీ సందర్భంగా ఊహించని గిఫ్ట్!

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

NBK 109 Movie : మారణాయుధాలతో పాటు మందు బాటిల్ - బాలకృష్ణతో బాబీ ప్లాన్ ఏంటి?

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Thalaivar 170 : తమిళ సినిమాలో అమితాబ్ బచ్చన్ - 32 ఏళ్ళ తర్వాత రజనీతో!

Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

Ram Charan Shirt Cost : శర్వా రిసెప్షన్‌లో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్ రేటు ఎంతో తెలుసా?

టాప్ స్టోరీస్

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

IND VS AUS: ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!

Telangana News : కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !

Telangana News :  కేసీఆర్ పేరును పచ్చబొట్టు వేయించుకున్న మంత్రి !