ADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె
దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తులపైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. దీంట్లో ఏపీ సీఎం చంద్రబాబు దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచారు. ఆయన ఫ్యామిలీ ఆస్తులు మొత్తం రూ.931 కోట్లున్నాయి. అప్పు రూ.10 కోట్లుగా ఉంది. ఇక దేశంలోనే అతి పేద సీఎంగా మమత బెనర్జీ ఉన్నారు. ఈమె ఆస్తి.. రూ.15 లక్షలే. ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను సోమవారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ రిలీజ్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు దాఖలుచేసిన అఫిడవిట్ ప్రకారం.. ఆయన పేరు మీద రూ.36 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆయన భార్య భువనేశ్వరి పేరు మీద రూ.895 కోట్ల ఆస్తులున్నాయి. సంపన్న సీఎంలలో రెండో స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూఉన్నారు. ఈ ఆస్తి రూ.332 కోట్లుగా ఉంది. దేశం లో ధనిక, పేద ముఖ్యమంత్రుల జాబితా ఆసక్తికర చర్చను అయితే రేపింది.