SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Mahesh Babu Rajamouli Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కలయికలో సినిమా లాంచ్ ఎప్పుడు? ఫస్ట్ షెడ్యూల్ లొకేషన్ ఎక్కడ? అంటే...
SS Rajamouli's #SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు. కొన్ని రోజులగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా హుషారుగా జరుగుతోంది. అయితే... సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుంది? అని అటు మహేష్ బాబు, ఇటు రాజమౌళి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్లందరికీ ఒక గుడ్ న్యూస్...
జనవరి 2న మహేష్ రాజమౌళి మూవీ ఓపెనింగ్!
జనవరి 2వ తేదీ, గురువారం నాడు పూజా కార్యక్రమాలతో మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్ సిటీలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉదయం పది గంటలకు ఓపెనింగ్ జరుగుతుంది. సాధారణంగా తన సినిమా ఓపెనింగులకు మహేష్ బాబు హజరు కారు. మరి ఈ సినిమా కోసం వస్తారా? లేదా? అనేది చూడాలి. చిత్రసీమలో ప్రముఖులు కొందరితో పాటు సుమారు వంద మందికి పైగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసింది.
'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా చిత్రీకరణలో కొంత భాగం అల్యూమినియం ఫ్యాక్టరీలో చేశారు. ఆ సమయంలోను రాజమౌళి ఆఫీస్ అక్కడే ఏర్పాటు చేశారు. బాహుబలి కోసం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ చేసినప్పుడు తన ఆఫీసును అక్కడే ఏర్పాటు చేశారు రాజమౌళి. ఇప్పుడు కూడా అంతే... అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్ బాబు సినిమా షూటింగ్ కొంత చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకని ఆఫీస్ అక్కడ ఏర్పాటు చేశారు. సుమారు ఏడాదిగా అక్కడ ఈ సినిమా పనులు చేస్తున్నారు.
ఫస్ట్ షెడ్యూల్ లొకేషన్ ఎక్కడ? ఎప్పుడు వెళ్తారు?
సాధారణంగా న్యూ ఇయర్ వేడుకల కోసం సెలబ్రిటీలలో చాలా మంది విదేశాలు వెళుతూ ఉంటారు. అయితే... మహేష్ బాబు డిసెంబర్ 31కి మూడు నాలుగు రోజుల ముందు విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చారు. సినిమా ఓపెనింగ్ ఉండడం వల్ల ఆయన వచ్చినట్లు సమాచారం అందుతోంది. పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాక మరొకసారి మహేష్ బాబు విదేశాలు వెళతారు. అయితే ఈసారి వెళ్లేది వెకేషన్ కోసం కాదు షూటింగ్ కోసమే!
మహేష్ బాబు రాజమౌళి సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఆఫ్రికాలో జరగనుంది. కొన్ని రోజుల క్రితం కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్ వెళ్లిన రాజమౌళి, లొకేషన్స్ చెక్ చేసి వచ్చారు. అప్పుడు ఆయనతో పాటు తనయుడు ఎస్ఎస్ కార్తికేయ కూడా ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఆఫ్రికాలో ప్లాన్ చేస్తున్నారు. కెన్యా తో పాటు సౌత్ ఆఫ్రికాలోని కొన్ని లొకేషన్లలో కూడా షూటింగ్ చేసే అవకాశం ఉందని రాజమౌళి సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.
Also Read: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
'గుంటూరు కారం' తర్వాత మరో సినిమాను మహేష్ బాబు సెట్స్ మీదకు తీసుకు వెళ్ళలేదు. 'ఆర్ఆర్ఆర్' విడుదల తర్వాత రాజమౌళి ఈ సినిమా పనుల మీద దృష్టి పెట్టారు. మధ్యలో కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి పెళ్లి కోసం కొన్ని రోజులు విరామం తీసుకుని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేశారు. ఇప్పుడు బ్యాక్ టు వర్క్... సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. కొత్త ఏడాదిలో కొత్త సినిమా మొదలు అవుతుండడం రాజమౌళి, మహేష్ బాబు అభిమానులకు మాంచి కిక్ ఇస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.