Game Changer: 'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... మెగాస్టార్ ఇచ్చిన రివ్యూ ఏమిటో తెలుసా?
Game Changer First Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' విడుదలకు ఇంకో పది రోజులు ఉంది. ఆల్రెడీ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా చూశారు. ఆయన రివ్యూ ఏమిటో తెలుసా?
Game Changer Movie Review: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్ విడుదలకు పట్టుమని పది రోజులు కూడా సమయం లేదు. దీని టాక్ ఎలా ఉందో తెలుసుకోవాలని మెగా అభిమానులు అందరూ ఎదురుశచూస్తున్నారు. సుమారు ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా నటించిన సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి ఏమన్నారు? అంటే...
'గేమ్ చేంజర్' చూసిన చిరంజీవి... రివ్యూ ఏమిటంటే?
Chiranjeevi watches Game Changer movie: విజయవాడలో 'గేమ్ చేంజర్' సినిమాలోని రామ్ చరణ్ కటౌట్ డిసెంబర్ 29న ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తున కటౌట్ నెలకొల్పి రికార్డ్ క్రియేట్ చేశారు. ఆ కార్యక్రమానికి చిత్ర నిర్మాత 'దిల్' రాజు ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. అక్కడ చిరంజీవి సినిమా చూసిన విషయాన్ని చెప్పారు.
''నేను విజయవాడ వచ్చే ముందు చిరంజీవి గారికి ఫోన్ చేశాను ఆయన కొన్ని రోజుల క్రితం సినిమాలో కొంత భాగం చూశారు. ఇప్పుడు సినిమా పూర్తిగా కంప్లీట్ అయింది. మరోసారి సినిమా చూడమని అడిగాను. ఆయనతో పాటు కొందరు సినిమా చూడటం మొదలు పెట్టారు. నేను విజయవాడకు బయలు దేరాను. నేను ఇక్కడకు చేరుకునే సమయానికి చిరంజీవి గారు ఫోన్ చేశారు. 'ఈ సంక్రాంతికి మామూలుగా కొట్టడం లేదని అభిమానులకు చెప్పండి' అని చిరంజీవి గారు నాతో చెప్పారు'' అని 'దిల్' రాజు తెలిపారు.
Also Read: 'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?
Taking fan frenzy to unprecedented levels 💥🔥
— Game Changer (@GameChangerOffl) December 29, 2024
Presenting the #GameChangerBiggestCutout for our Global Star @AlwaysRamCharan 😎
ఈ సంక్రాంతి మాత్రం మామూలుగా ఉండదు! 🤙🏼#GameChanger #GameChangerOnJan10 🚁 pic.twitter.com/Ft6MQBedUq
'గేమ్ చేంజర్' సినిమా గురించి 'దిల్' రాజు మాట్లాడుతూ... ''మెగా పవర్ స్టార్'లో 'మెగా'ని, అలాగే 'పవర్'ని చూస్తారు. నాకు నాలుగేళ్ల క్రితం శంకర్ గారు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ఏం ఫీలయ్యానో... చిరంజీవి గారు ఒక్కో సన్నివేశం గురించి చెబుతుంటే అదే ఫీలయ్యాను. నాకు చాలా సంతోషంగా అనిపించింది. జనవరి 10న ప్రేక్షకులు, మెగా అభిమానులు రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు. ఇందులో రామ్ చరణ్ మూడు షేడ్స్ చూపిస్తారు. కాసేపు ఐఏఎస్ అధికారిగా, ఇంకొంత సేపు పోలీస్ అధికారిగా, ఇంకా కొంత సేపు రాజకీయ నాయకుడిగా కనిపించబోతోన్నారు. దర్శకుడు శంకర్ మార్క్ కచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తుంది. సినిమా నిడివి రెండు గంటల 45 నిమిషాలు మాత్రమే ఉండాలి అని శంకర్ గారితో మాట్లాడాను. ఆయన అంతే నిడివిలో అద్భుతంగా రెడీ చేశారు'' అని చెప్పారు.
Also Read: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్... ఏ ఛానల్‌లో ఏది టాప్‌లో ఉందో తెల్సా?