అన్వేషించండి

Game Changer : 'గేమ్ ఛేంజర్' పాటల కోసమే అన్ని కోట్లా? ఒక్కో పాట స్పెషల్ ఏంటంటే?

Game Changer : రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీలోని ఒక్కో పాట ఒక్కో విజువల్ వండర్ గా ఉండబోతోంది. ఇందులోకి 5 పాటల కోసమే ఏకంగా 75 కోట్లు ఖర్చు పెట్టారట మేకర్స్.

Game Changer Movie Songs : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' జనవరి 10న రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అయితే రీసెంట్ గా డల్లాస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ 'గేమ్ ఛేంజర్'పై మరింత బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా పాటల కోసం దాదాపు 75 కోట్లను మేకర్స్ ఖర్చు చేశారన్న వార్త హైప్ గ్రాఫ్ ను భారీగా పెంచేస్తోంది. సినిమాలో మొత్తం 5 పాటలు ఉండగా, ఒక్కో పాటను అద్భుతమైన లొకేషన్స్, సెట్స్ లో... అదిరిపోయే స్టెప్పులతో, పవర్ ఫుల్ మ్యూజిక్ తో విజువల్ వండర్ గా నిర్మించినట్టుగా తెలుస్తోంది. 

1. 'జరగండి' సాంగ్ 

ముందుగా 'జరగండి' పాట గురించి మాట్లాడుకుంటే 70 అడుగుల కొండపైనున్న ఓ పల్లెటూరులో, ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో 13 రోజుల పాటు 'జరగండి' పాటను చిత్రీకరించారు. ఈ పాటలో దాదాపు 600 మంది డాన్సర్లతో 8 రోజులపాటు షూట్ చేశారు. ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. ఇక ఈ పాటకు ఫస్ట్ టైం ఎకో ఫ్రెండ్లీ కాస్ట్యూమ్స్ ని వాడారు. జనపనారతో చేసిన ఆ కాస్ట్యూమ్స్ ను అశ్విన్ - రాజేష్ డిజైన్ చేశారు.

2. 'రా మచ్చా మచ్చా' సాంగ్ 

రెండో పాట రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ 'రా మచ్చా మచ్చా'. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్ ను ఇండియాలోని జానపద కళలకు నివాళిగా రూపొందించారు. ఇందులో 1000 కంటే ఎక్కువ మంది జానపద కళాకారులు డాన్స్ చేసినట్టుగా తెలుస్తోంది. భారతదేశంలోని పలు గొప్ప సంస్కృతులకు అద్దం పట్టే విధంగా ఈ పాటను రూపొందించారు. అందులో ఇండియాలోని 10 జానపద డాన్సులు ఉన్నట్టుగా తెలుస్తోంది. 

1) గుస్సాడి - ఆదిలాబాద్ 
2) చావు - పశ్చిమ బెంగాల్
3) ఘుమ్రా - ఒరిస్సా - మటిల్కల
4) గొరవర - కుణిత (కర్ణాటక)
5) కుమ్ముకోయ - శ్రీకాకుళం
6) రణప - ఒరిస్సా
7) పైకా - జార్ఖండ్
8) హలక్కీ - వొక్కలిగ - కర్ణాటక.
9) తాపిత గుళ్లు - విజయనగరం
10) దురువా - ఒరిస్సా

3. 'నానా హైరానా' సాంగ్ 

మూడో పాట 'నానా హైరానా'. ఈ రొమాంటిక్ పాటను ఫస్ట్ టైం ఇండియాలోనే ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలో చిత్రీకరించారు. న్యూజిలాండ్ లోని అద్భుతమైన లోకేషన్లలో రామ్ చరణ్ కియారా అద్వానీపై రూపొందిన ఈ పాట బెస్ట్ మెలోడీగా రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది. పాపులర్ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ పాటకు కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. ఈ పాటను 6 రోజులపాటు చిత్రీకరించారు. 

4. 'ధోప్' సాంగ్ 

నాలుగో పాట 'ధోప్' విషయానికి వస్తే... ఇదో టెక్నో డాన్స్ నెంబర్. ఈ పాటను కోవిడ్ సెకండ్ వేవ్ టైమ్ లోనే షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆర్ఎఫ్సి లో వేసిన మూడు కాస్ట్లీ సెట్ లలో 8 రోజుల పాటు దీన్ని షూట్ చేశారు. ఇక ఈ పాట కోసం ప్రత్యేక విమానంలో దాదాపు 100 మంది ప్రొఫెషనల్ డాన్సర్లను రష్యా నుంచి రప్పించినట్టుగా తెలుస్తోంది. ఈ సాంగ్లో రామ్ చరణ్ తో పాటు కియారా కూడా అదిరిపోయే స్టెప్పులు వేశారు. 

5. 'ద సర్ప్రైజ్ ప్యాకేజీ' సాంగ్ 

ఐదవ పాట సర్ప్రైజ్ ప్యాకేజీ.. ఈ పాటను ప్రేక్షకులు వెండితెరపై చూసి థ్రిల్ ఫీల్  అవ్వడం ఖాయమని అంటున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించారు.

Also Readతెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్... ఏ ఛానల్‌లో ఏది టాప్‌లో ఉందో తెల్సా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Indian Coast Guard Helicopter Crash: గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
Namo Bharat Corridor: నమో భారత్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ - విద్యార్థులతో కలిసి సామాన్యుడిలా ర్యాపిడ్ రైలులో ప్రయాణం
నమో భారత్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ - విద్యార్థులతో కలిసి సామాన్యుడిలా ర్యాపిడ్ రైలులో ప్రయాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Notices to Allu Arjun | అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చిన పోలీసులు | ABP DesamDaaku Maharaaj Trailer Decode | బాలకృష్ణతో కలిసి బాబీ ఆడిస్తున్న మాస్ తాండవం | ABP DesamUnstoppable With NBK Ram Charan | అన్ స్టాపబుల్ లో రచ్చ రచ్చ చేసిన బాలయ్య, రామ్ చరణ్ | ABP DesamIndia out form WTC Final Race | ఆసీస్ దెబ్బతో WTC నుంచి భారత్ ఔట్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: 'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
'విశాఖకు భారీగా ఐటీ కంపెనీలు' - వైసీపీ కుంభకోణాలపై త్వరలోనే యాక్షన్ ఉంటుందన్న మంత్రి లోకేశ్
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Indian Coast Guard Helicopter Crash: గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
గుజరాత్‌లోని విమానాశ్రయంలో కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం
Namo Bharat Corridor: నమో భారత్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ - విద్యార్థులతో కలిసి సామాన్యుడిలా ర్యాపిడ్ రైలులో ప్రయాణం
నమో భారత్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ - విద్యార్థులతో కలిసి సామాన్యుడిలా ర్యాపిడ్ రైలులో ప్రయాణం
JC Prabhakar Reddy Apology: నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
నటి మాధవిలతకు క్షమాపణ చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతరం సంచలన వ్యాఖ్యలు
Road Accident: మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం - బైక్‌ను లారీ ఢీకొని ముగ్గురు మృతి
మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం - బైక్‌ను లారీ ఢీకొని ముగ్గురు మృతి
CM Revanth Reddy: సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
సివిల్స్ అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం, రూ.1 లక్ష చొప్పున చెక్కులు అందజేసిన రేవంత్ రెడ్డి
OYO Unmarried Couples: ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
ఆ జంటలకు బిగ్ షాక్, రూమ్ ఇచ్చేది లేదన్న ఓయో హోటల్స్ - త్వరలో కొత్త చెక్ ఇన్ పాలసీ
Embed widget