అన్వేషించండి

Brahma Anandam Teaser: తలనొప్పిగాడని తెలిసినా... నవ్వులు పూయిస్తూ, ఎమోషనల్ టచ్ ఇచ్చిన ‘బ్రహ్మ ఆనందం’

Brahma Anandam Teaser: రియల్ లైఫ్‌లో తండ్రీకొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్.. ఇప్పుడు ‘బ్రహ్మ ఆనందం’ సినిమాతో తాత మనవళ్లుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తాజాగా వచ్చిన ఈ చిత్ర టీజర్ ఎలా ఉందంటే..

‘పల్లకిలో పెళ్లికూతురు’ హీరో గౌతమ్ గుర్తున్నాడా? ఆ సినిమా మంచి సక్సెస్ సాధించినా... ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినా, బ్రహ్మానందం తనయుడు గౌతమ్ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ కనిపించే బ్రహ్మానందం.. ఈ విషయంలో మాత్రం తీవ్ర నిరాశలో ఉన్నాడని చెప్పక తప్పదు. అయినా సరే.. ఏదో రకంగా తన కుమారుడిని తెరపై కనిపించేలా చేయాలని చేయని ప్రయత్నం లేదు. కానీ ఏ కథ తన దగ్గరకి తీసుకెళ్లినా.. ఏదో ఒక వంక పెట్టి రిజిక్ట్ చేస్తూ వచ్చాడని రీసెంట్‌గా ఓ వీడియోలో బ్రహ్మీనే చెప్పుకొచ్చారు. ఇక ఎట్టకేలకు బ్రహ్మి తనయుడు ఓ సినిమాకు ఫిక్స్ అయ్యారు. ఆ సినిమానే ‘బ్రహ్మ ఆనందం’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ టైమ్‌లో అంతగా తెలియలేదు కానీ.. ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటిగా వస్తుంటే.. సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడుతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ ఎలా ఉందంటే.. 

‘‘ఆ.. మొదలు పెడదామా అంటూ మొదలైన ఈ టీజర్‌లో గౌతమ్ తన పేరును బ్రహ్మానందం అని పరిచయం చేసుకుని.. నేను చాలా మంచోడిని అనగానే.. వెన్నెల కిశోర్ క్యారెక్టర్ ఎంటరై.. బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. అందరికీ హెల్ప్ చేయడం నా వీక్‌నెస్ అని చెప్పి.. వెంటనే నాకో రూ. 5 వేలు కావాలని గౌతమ్ అడగడం చూస్తుంటే.. ఆయన పాత్ర తీరుతెన్నులు ఏంటో అర్థం చేసుకోవచ్చు. నేను అమ్మాయిలకు చాలా దూరంగా ఉంటానని డైలాగ్ చెప్పిన మరుక్షణమే.. నీకు ఏమైనా చెప్పానా? అంటూ అమ్మాయిని ఫ్లట్ చేయడం చూపించారు. మంజెమ్మల్ బాయ్‌లా కనిపించే ప్లే బాయ్‌ రా నువ్వు.. అంటూ వెన్నెల కిశోర్ ఒక్క డైలాగ్‌తో గౌతమ్ పాత్రని తేల్చేశాడు. మరి అన్ని గుడ్ క్వాలీటీస్ ఉన్న గౌతమ్‌కు ఒక తలకాయనొప్పి ఎదురైంది. ఆ తలకాయ నొప్పి రాజీవ్ కనకాల, సంపత్, వెన్నెల కిశోర్ కాదని చెబుతూ.. బ్రహ్మానందంని రివీల్ చేసిన తీరు ఈ టీజర్‌కే హైలెట్ అనేలా ఉంది.

Also Readటీడీపీ, జనసేనకు బుల్లి రాజు ప్రచారం... ఏపీ ఎన్నికల్లో వెంకీ కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమల ఏం చేశాడో చూశారా?

‘అదిగో వస్తున్నాడు వస్తున్నాడు.. చూడండి వాడిని’ అని గౌతమ్ అంటే.. హీరో లెవల్లో బ్రహ్మి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడమే బ్రహ్మీ కూడా అమ్మాయిని ఫ్లట్ చేయడం చూస్తున్న వారికి కూడా ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చేస్తుంది. ఇంక అక్కడి నుండి టీజర్ ఎండింగ్ వరకు ఒకటే నవ్వులు. ఆ నవ్వు కునేది కూడా ఒక్కరు కాదు.. కనబడే ప్రతి సన్నివేశంలోని పాత్రలు నవ్వుతూనే కనిపించాయి. ఫైనల్‌గా వీడింత తలనొప్పిగాడని తెలిసినా.. వీడితోనే ఎందుకు ఉంటున్నానో తెలుసా? అని గౌతమ్ చెప్పిన డైలాగ్‌తో.. బ్రహ్మానందం తనకు ఏమవుతాడో తెలుపుతూ.. ఎమోషనల్‌గా టీజర్‌ని ఎండ్ చేశారు..’’. ఓవరాల్‌గా ఇలాంటి తాత మనవళ్లు రేర్‌గా ఉంటారనే ఫీల్‌ని, ఎమోషన్‌ని ఈ టీజర్ క్యారీ చేసింది. రియల్ లైఫ్‌లో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, గౌతమ్ రీల్ లైఫ్‌లో ఇలా తాతమనవళ్లుగా కనిపించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. మరీ ముఖ్యంగా ఈ టీజర్ ఎండింగ్ చూస్తుంటే.. ఇదొక ఎమోషనల్ డ్రామా అనే విషయం కూడా రివీలవుతోంది. ఆద్యంతం నవ్వులు పూయించిన ఈ టీజర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేయడంలో సక్సెస్ అయింది.

ఈ సినిమాను ‘మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి వరుస సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో ఆర్.వి. ఎస్. నిఖిల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బ్రహ్మానందం తాతగా, రాజా గౌతమ్ మనవడిగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూనిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ ముందుకు రానున్న ఈ సినిమా.. ఈ బ్యానర్‌కు మరో హిట్ పక్కా అనే వైబ్‌ని ఈ టీజర్ ఇచ్చేసింది. 14 ఫిబ్రవరి, 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: డేంజర్ జోన్‌లో పూజా హెగ్డే టాలీవుడ్ కెరీర్... మూడేళ్ళ గ్యాప్, చేతిలో తెలుగు సినిమా ఒక్కటీ లేదు, ఎందుకిలా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
IPL 2025 Openinsg Ceremony Highlights: ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
Visakha Mayor:  విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

డీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
IPL 2025 Openinsg Ceremony Highlights: ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
ఘ‌నంగా ఐపీఎల్ ఆరంభ వేడుక‌లు.. ఫుల్ సంద‌డి చేసిన బాలీవుడ్ బాద్ షా.. 17 ఏళ్ల త‌ర్వాత కేకేఆర్‌, ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్.. భువీకి షాక్..  
Visakha Mayor:  విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
విశాఖ మేయర్ పై అవిశ్వాసం - పదవి కాపాడుకోవడం వైసీపీకి కష్టమేనా ?
SJ Suryah: 'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
'అదే జరిగుంటే నేను సూసైడ్ చేసుకునేవాడినేమో' - 'ఖుషి' మూవీ రిజల్ట్‌పై ఎస్‌జే సూర్య ఏమన్నారంటే.?
Vikram: విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
విక్రమ్ డైరెక్ట్‌గా తెలుగులో సినిమా ఎందుకు చేయలేదో తెలుసా.? - ఎస్‌జే సూర్య హీరోగా చియాన్ విక్రమ్ మూవీ?
MM Keeravani: ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
ఆ మూవీకి పని చేయడం కష్టమే.. అయినా చాలా ఇష్టం - రాజమౌళి, మహేష్ మూవీ ఓ అడ్వెంచర్ అన్న కీరవాణి
Online Gaming Websites:357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
357 వెబ్‌సైట్‌లు బ్లాక్‌- 2400 అకౌంట్లు సీజ్‌-రూ.126 కోట్లు ఫ్రీజ్‌- గేమింగ్ సంస్థలకు బిగ్‌షాక్
Embed widget