Pooja Hegde: తెలుగులో పూజా హెగ్డే కెరీర్ క్లోజ్ అయినట్టేనా... మూడేళ్ళ గ్యాప్, చేతిలో ఒక్కటీ లేదు!
Pooja Hegde Upcoming Movies: పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం రెండు తమిళ సినిమాలు, రెండు హిందీ సినిమాలు ఉన్నాయి. ఒక తెలుగు సినిమా కూడా లేదు. తెలుగులో ఇకపై ఆవిడకు అవకాశాలు రావడం కష్టమేనా!?
Doors closed for Butta Bomma star in Telugu Cinema?: తెలుగు సినిమాలతో తన ఇమేజ్ - ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుని, ఆ తర్వాత బాలీవుడ్ వరకు వెళ్లిన బెంగళూరు భామ, మన బుట్ట బొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde). ఇప్పుడు ఆవిడ చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తెలుగులో ఆవిడ సినిమా చేసి మూడేళ్లు దాటుతోంది. దాంతో ఇకపై ఆవిడ కెరీర్ క్లోజ్ అయినట్టేనా!?
గ్యాప్ తీసుకుందా? లేదంటే వచ్చిందా?
బుట్ట బొమ్మ టాలీవుడ్ కెరీర్ ఏమైంది??
'అల వైకుంఠపురములో' అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెబుతారు. 'గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది' అని. తెలుగులో బుట్ట బొమ్మకు లాస్ట్ హిట్ అది. ఆ సినిమా తరువాత తెలుగు చిత్ర పరిశ్రమలో పూజా హెగ్డే విజయాలకు గ్యాప్ వచ్చింది. 'అల...' తర్వాత అఖిల్ అక్కినేనికి జోడిగా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' సినిమా చేసింది. అది యావరేజ్ హిట్ కాగా... ఆ తర్వాత చేసిన 'రాధే శ్యామ్', 'ఆచార్య' సినిమలు డిజాస్టర్లుగా నిలిచాయి. ఆ తరువాత పూజ హెగ్డేకు తెలుగులో కథానాయికగా మరో సినిమా చేసే అవకాశం రాలేదు. వెంకటేష్, వరుణ్ తేజ్ 'ఎఫ్ 3' సినిమాలో స్పెషల్ సాంగ్ చేశారంతే.
తెలుగు సినిమాలతో స్టార్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే... ఇక్కడ రెండున్నర కోట్లకు పైగా పారితోషికం అందుకున్న సందర్భాలు ఉన్నాయని ఫిలిం నగర్ వర్గాలు చెబుతాయి. అయితే రెండు వరుస డిజాస్టర్స్ తర్వాత ఆమెకు మరొక అవకాశం రాకపోవడం గమనార్హం. మార్చి 11, 2022లో 'రాధే శ్యామ్' రిలీజ్ అయితే... అదే ఏడాది ఏప్రిల్ 29న ఆచార్య వచ్చింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'గుంటూరు కారం' సినిమా కోసం ఆవిడ కొన్ని రోజులు షూటింగ్ చేశారు. కానీ డేట్స్ ఇష్యూ వల్ల తప్పుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో తెలుగు సినిమా ఆవిడ దగ్గరకు రాలేదు.
తెలుగులో పూజా హెగ్డేకు మూడేళ్ల గ్యాప్ అంటే చిన్న విషయం ఏమీ కాదు. ఆల్మోస్ట్ ఆవిడను ఆడియన్స్ అందరూ మర్చిపోయే పరిస్థితి అని చెప్పాలి. మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగ చైతన్య, వరుణ్ తేజ్ వంటి యువ హీరోలు అందరి సరసన సినిమాలు చేసిన పూజను ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీ పక్కన పెట్టడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. రెమ్యూనరేషన్ కారణంగా పూజా హెగ్డేను టాలీవుడ్ పక్కన పెట్టిందా? లేదంటే ఆవిడకు వచ్చిన ఫ్లాప్స్ కారణమా? లేదంటే నిర్మాతలను ఇబ్బంది పెడుతుందా? తెలియాల్సి ఉంది.
Also Read: 'గేమ్ చేంజర్'ను కోలుకోలేని దెబ్బ తీసిన లోకల్ టీవీ... సినిమాను అలా ఎలా టెలికాస్ట్ చేశార్రా?
ప్రజెంట్ పూజ చేస్తున్న సినిమాలు ఏమిటి?
Pooja Hegde Upcoming Movies: ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. హిందీలో షాహిద్ కపూర్ సరసన ఆవిడ నటించిన 'దేవ' విడుదలకు రెడీ అవుతుంది. జనవరి 31న థియేటర్లలోకి రానుంది. కోలీవుడ్ స్టార్ సూర్య జంటగా నటించిన 'రెట్రో' సినిమా మే 1న థియేటర్లలోకి రానుంది. దళపతి విజయ్ లాస్ట్ సినిమా దళపతి 69లోనూ, హిందీలో మరొక సినిమాలోనూ పూజా హెగ్డే నటిస్తోంది. మరి తెలుగులో ఎప్పుడు చేస్తుందో చూడాలి.
Also Read: అనౌన్స్‌మెంట్ అంటే ఇట్టా ఉండాలా... 'జైలర్ 2'తో దుమ్ము దులిపిన రజనీకాంత్