Game Changer: 'గేమ్ చేంజర్'ను కోలుకోలేని దెబ్బ తీసిన లోకల్ టీవీ... సినిమాను అలా ఎలా టెలికాస్ట్ చేశార్రా?
Game Changer Piracy: 'గేమ్ చేంజర్'ను పైరసీ కోలుకోలేని దెబ్బ తీస్తోంది. ఏపీలోని ఏపీ లోకల్ టీవీలో పైరసీ ప్రింట్ స్ట్రీమింగ్ చేశారు. దీనిపై అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కు లేదంటే ఆయన కొత్త సినిమా 'గేమ్ చేంజర్'కు వ్యతిరేకంగా ఎవరైనా కుట్ర చేస్తున్నారా? ఈ అనుమానాలు మెగా అభిమానులలో, ప్రేక్షకులలో కలగడం సహజం. ఎందుకంటే... ఒక దాని వెంట మరొకటి ఆ సినిమాకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అసలే క్వాలిటీతో కూడిన ప్రింట్ నెట్టింట లీక్ అయ్యిందంటే... ఇప్పుడు ఆ ప్రింట్ లోకల్ టీవీలో టెలికాస్ట్ కావడం ఎవరు ఊహించని పరిణామం.
ఏపీ లోకల్ టీవీలో 'గేమ్ చేంజర్' వేసేశారు!
సంక్రాంతి పండక్కి టీవీలలో కొత్త సినిమాలు టెలికాస్ట్ చేయడం కామన్. ఈటీవీలో నిహారికా కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు', జెమినీ టీవీలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాకు అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' సినిమాలో టెలికాస్ట్ అయ్యాయి. అయితే... సంక్రాంతికి థియేటర్లలో విడుదల అయిన 'గేమ్ చేంజర్' (Game Changer) సినిమా కూడా ఒక టీవీలో వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ లోకల్ టీవీ పేరుతో ఒక కేబుల్ నెట్వర్క్ ఉంది. అందులో సంక్రాంతి సందర్భంగా 'గేమ్ చేంజర్' షో వేశారు. పండక్కి థియేటర్లలో చూడాల్సిన సినిమాను ప్రేక్షకులకు ఫ్రీగా చూపించారు. కొత్త సినిమా టీవీలో అలా ఎలా వేస్తారు? అంటూ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండక్కి కేబుల్ టీవీలో సినిమా టెలికాస్ట్ చేయడం వల్ల జనాలు అందరూ చూసేసి ఉంటారని, వాళ్లంతా థియేటర్లకు వచ్చే అవకాశం లేదని, ఇది సినిమాకు కోలుకోలేని దెబ్బ అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్... సోషల్ మీడియాలో ఇద్దరినీ ట్యాగ్ చేస్తూ 'గేమ్ చేంజర్' టెలికాస్ట్ అయిన విజువల్స్ ఫోటోలు తీసి కంప్లైంట్ చేశారు. సదరు టీవీ ఛానల్ మీద చర్యలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆప్ కేబుల్ నెట్వర్క్ ఛానల్ నడుస్తోందని, తమకు రూల్స్ తెలియకుండా సినిమా టెలికాస్ట్ చేశామని తప్పించుకోవడానికి వీల్లేదని, వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని అభిమానులు కోరుతున్నారు.
Also Read: అనౌన్స్‌మెంట్ అంటే ఇట్టా ఉండాలా... 'జైలర్ 2'తో దుమ్ము దులిపిన రజనీకాంత్
This channel "AP Local TV" backed by TDP. They have aired #GameChanger movie.
— vinayk1111 🥛 (@vinayk1111) January 14, 2025
Dear @PawanKalyan @kanduladurgesh they can't escape by saying that they are not aware of rules. Being a cable operator they ahould be knowing. Please initiate and cancel the license. pic.twitter.com/Bs9UbtIY7T
'గేమ్ చేంజర్' సినిమాకు సూపర్ హిట్ టాక్ రాలేదు. మొదటి రోజు మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్, రివ్యూస్ వచ్చాయి. దానికి తోడు పైరసీ భూతం వెంటాడింది. విడుదల రోజునే క్వాలిటీతో కూడిన ప్రింట్లు కావడంతో కలెక్షన్ల మీద భారీ ప్రభావం పడింది. ఇప్పుడు లోకల్ టీవీలో టెలికాస్ట్ కావడం అనేది దెబ్బ మీద దెబ్బ అని చెప్పాలి. దీనిపై సినిమా యూనిట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Also Read: 'సంక్రాంతికి వస్తున్నాం' రివ్యూ: కామెడీ ఒక్కటేనా - కథతోనూ వెంకీ, అనిల్ రావిపూడి మేజిక్ చేశారా?