Akira Nandan: పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరాతో పంజా సీక్వెల్... దర్శకుడు విష్ణువర్ధన్ ఏమన్నారంటే?
Director Vishnuvardhan: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ ఫిలిం 'పంజా' గుర్తుందా? దానికి విష్ణువర్ధన్ డైరెక్టర్. అకిరాతో ఆ సినిమా సీక్వెల్ తీసే అంశం గురించి ఆయన స్పందించారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాల కంటే రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఏపీ డిప్యూటీ సీఎంగా తన విధి నిర్వహణలో అంకిత భావంతో పని చేస్తున్నారు. 'ఓజీ: దే కాల్ హిమ్ ఓజీ', 'హరి హర వీరమల్లు'... ఆయన హీరోగా రూపొందుతున్న సినిమాల విడుదల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ఎంట్రీ గురించి కూడా అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అకిరా నందన్ హీరోగా పంజా సీక్వెల్!?
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ 'పంజా' గుర్తు ఉందా? ఆ చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. పవన్ కళ్యాణ్ సినిమా చేశాక మళ్ళీ తెలుగులో చేయలేదు. ఆ మధ్య హిందీలో విమర్శకులతో పాటు ప్రేక్షకులను మెప్పించిన 'షేర్షా' సినిమా గుర్తు ఉందా? సిద్ధార్థ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ఆ సినిమా దర్శకుడు కూడా విష్ణువర్ధనే.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్, ఒకప్పటి హీరో 'హృదయం' ఫేమ్ మురళి తనయుడు ఆకాష్ మురళి జంటగా నటించిన 'ప్రేమిస్తావా' చిత్రానికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఆ సినిమా ఈ నెల 30న (గురువారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా టాలీవుడ్ మీడియాతో ముచ్చటించారు.
టాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన విష్ణువర్ధన్ (Vishnuvardhan)కు పవన్ కళ్యాణ్ 'పంజా', ఆ సినిమా సీక్వెల్ గురించి ప్రశ్న ఎదురైంది. పవన్ తనయుడు అకీరా నందన్ త్వరలో హీరోగా లాంచ్ కోసం ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారని, ఒకవేళ అవకాశం వస్తే ఆయనతో 'పంజా' సీక్వెల్ చేస్తారా? అని మీడియా ప్రశ్నించింది. అప్పుడు ఆయన మాట్లాడుతూ... ''నేను అకిరాను చిన్నప్పుడు చూశా. వెరీ చార్మింగ్ యంగ్ స్టర్. మనం ప్లాన్ చేసే దాని కంటే... జరగాల్సినవి కరెక్ట్ టైంలో జరుగుతాయి. 'పంజా' కూడా అలాగే జరిగింది. అవకాశం వస్తే కచ్చితంగా చేస్తా'' అని చెప్పారు.
'గేమ్ చేంజర్' విడుదలకు ముందు డైరెక్టర్ నుంచి నటుడిగా మారిన ఎస్.జె. సూర్యకు సైతం అకిరా నందన్ గురించి ప్రశ్న ఎదురైంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ 'ఖుషి' సినిమాకు సూర్య దర్శకత్వం వహించారు. 'ఒకవేళ అవకాశం వస్తే అకిరా నందన్ హీరోగా 'ఖుషి 2' చేసే అవకాశం ఉందా?' అనే ప్రశ్నించగా... కుదిరితే తప్పకుండా చేస్తానని సూర్య తెలిపారు.
అకిరా నందన్ సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఉందని తెలుస్తోంది. అయితే, ప్రస్తుతానికి నటన వైపు ఆయన అడుగులు వేయడం లేదు. పవన్ తనయుడికి సంగీతం పట్ల ఆసక్తి ఉందని అర్థం అవుతోంది. కానీ ఆ అబ్బాయి హీరోగా రావాలని పవన్ కళ్యాణ్ అభిమానులు అందరి కోరిక. ఏపీ ఎన్నికల్లో పవన్ విజయం సాధించిన తర్వాత ఆయన వెంట అకీరా నందన్ కనిపించారు. అప్పటినుంచి అతను హీరో మెటీరియల్ అని ఇండస్ట్రీ అంతా అతని వైపు చూస్తోంది. తనయుడిని హీరోగా ఎప్పుడు పవన్ కళ్యాణ్ పరిచయం చేస్తారో చూడాలి.
Also Read: మహా కుంభమేళాలో ముస్లిం దర్శకుడు... మతపరమైన విమర్శలకూ జవాబు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

