Maha Kumbh: మహా కుంభమేళాలో ముస్లిం దర్శకుడు... మతపరమైన విమర్శలకూ జవాబు
కుంభమేళా... ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే హిందూ పండుగ. మహా కుంభమేళా... 144 ఇళ్లకు ఒకసారి వస్తుంది. అందుకే హిందువులు ఉందా ప్రయాగ్ రాజ్ వెళ్తున్నారు. ఓ ముస్లిం దర్శకుడు కూడా మహా కుంభమేళాకు వెళ్లారు.

ఇప్పుడు భారతదేశం మాత్రమే కాదు... ప్రపంచం అంతా ప్రయాగ్ రాజ్ (Prayagraj) వైపు చూస్తోంది. అందుకు కారణం మహా కుంభమేళా (Maha Kumbh 2025). ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాకు భక్తులు పోటెత్తుతారు. ఇక, 144 ఏళ్లకు ఒకసారి వచ్చే 'మహా కుంభమేళా' కావడంతో హిందువులంతా ఉత్తరప్రదేశ్ వైపు అడుగులు వేస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి రావాలని కోరుకుంటున్నారు. హిందువుల మాత్రమే కాదు... అక్కడికి ఒక ముస్లిం దర్శకుడు కూడా వెళ్లారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశం అవుతోంది.
సల్మాన్ ఖాన్ హీరోగా సూపర్ హిట్స్...
మహా కుంభమేళాల్లో ఖాన్ దర్శకుడు!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'భజరంగీ భాయిజాన్' సినిమా గుర్తు ఉందా? దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించినది ఎవరో గుర్తు ఉందా? కబీర్ ఖాన్ (Kabir Khan). అది ఒక్కటే కాదు... సల్మాన్ ఖాన్ హీరోగా 'ఏక్ థా టైగర్' కూడా తీశారు. ఇప్పుడు ఈ దర్శకుడు మహా కుంభమేళాలో ఉన్నారు.
కబీర్ ఖాన్ మంగళవారం ఉదయం ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. తాను మహా కుంభమేళాలో భాగం కావాలని అనుకున్నానని, త్రివేణి సంగమంలో పుణ్య సనం చేయడానికి వచ్చానని ఒక న్యూస్ ఏజెన్సీతో తెలిపారు. ''మహా కుంభమేళాకు ప్రజలు తండోప తండాలుగా వస్తున్నారని విన్నాను. ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. కొన్ని రోజులు మహా కుంభమేళాలోనే ఉంటాను'' అని చెప్పారు.
మహా కుంభమేళాలో ముస్లిం...
కుల మతాలకు ముడిపెట్టొద్దు!
ముస్లిం అయ్యి ఉండి మహా కుంభమేళాకు రావడం ఏమిటి? అనే ప్రశ్నలకు కూడా కబీర్ ఖాన్ సమాధానం ఇచ్చారు. ''ఇటువంటివి (మహా కుంభమేళాను ఉద్దేశిస్తూ...) హిందువుల గురించో, ముస్లింల గురించో కాదు. మన దేశ మూలాలకు సంబంధించినవి, మన నాగరికతకు సంబంధించినవి. ఇందులో ముస్లిం, హిందూ అనే ప్రశ్నకు తావు లేదు. 'నేను భారతీయుడిని' అని మీరు నమ్మితే అంతా మనదే అని కబీర్ ఖాన్ చెప్పారు.
ఇప్పటి వరకు మహా కుంభమేళాకు వచ్చిన భక్తుల సంఖ్య కోటి పైగా ఉంటుందని అంచనా. జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగాభక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాగ్ రాజ్ చేరుకోవడానికి సుమారు 150కు పైగా స్పెషల్ ట్రైన్స్ వేశారు.
మహా కుంభమేళాకు కబీర్ ఖాన్ వెళ్లడం డిస్కషన్ టాపిక్ అయ్యింది. సల్మాన్ హీరోగా 'బజరంగీ భాయిజాన్', 'ఏక్ థా టైగర్' సినిమాలతో పాటు సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'న్యూయార్క్', రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో 1983లో టీమిండియా క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన నేపథ్యంలో రూపొందించిన '83', ఇంకా కార్తీక్ ఆర్యన్ 'చందు ఛాంపియన్' వంటి సినిమాలకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు.
Also Read: మహా కుంభమేళాకు భార్యతో కలిసి వెళ్లిన టాలీవుడ్ యాక్టర్... అతను ఎవరో గుర్తు పట్టారా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

