Jani Master: వాళ్ళవి తప్పుడు ప్రచారాలు... త్వరలో నిజస్వరూపం తెలుస్తుంది - జానీ మాస్టర్ సెన్సేషనల్ ట్వీట్
Jani Master Case: లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల కేసు తర్వాత ఆయన జీవితంలో చాలా జరిగాయి. ఇటీవల వచ్చిన కోర్టు తీర్పుపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన స్పందించారు.

తెలుగు చిత్రసీమలోని ప్రతిభావంతులైన నృత్య దర్శకులలో జానీ మాస్టర్ (Jani Master) ఒకరు. ఓ సాధారణ డ్యాన్సర్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వెళ్లారు. అయితే, ఆయన మీద లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన ఆరోపణల కారణంగా ఆయనకు వచ్చిన జాతీయ అవార్డు క్యాన్సిల్ చేశారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కూడా జానీ మీద సస్పెన్షన్ వేటు విధించింది. దాన్ని సవాల్ చేస్తూ స్టార్ కొరియోగ్రాఫర్ కోర్టుకు వెళ్లారు. అందులో జానీకి చుక్కెదురు అయ్యిందంటూ ఝాన్సీ పేర్కొన్నారు. దానిపై ఆయన స్పందించారు.
జానీ సస్పెన్షన్ గురించి ఝాన్సీ ఏమన్నారు?
తెలుగు సినిమాలో మహిళల సంరక్షణ, హక్కుల కోసం 'ది వాయిస్ ఆఫ్ విమెన్' పేరుతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. అందులో నటి, యాంకర్ ఝాన్సీ మెంబర్. జానీ మాస్టర్ కేసు వైరల్ అయ్యాక ప్రెస్ మీట్ పెట్టి బాధితురాలికి తాము అండగా ఉంటామని, పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఇప్పుడు ఆవిడ ''జానీ మాస్టర్ మీద ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కేసు గెలిచింది. లైంగిక వేధింపుల విషయంలో ఆయన దాఖలు చేసిన కేసును కొట్టేశారు'' అని పేర్కొన్నారు.
ఝాన్సీ పోస్ట్ మీద స్పందించిన జానీ మాస్టర్!
ఝాన్సీది తప్పుడు ప్రచారం అని జానీ మాస్టర్ ట్వీట్ చేశారు. ''తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్స్ మీద తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది'' అని ఆయన పేర్కొన్నారు.
ఇంకా జానీ మాస్టర్ మాట్లాడుతూ... ''ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పుని మీకు (ఝాన్సీని ఉద్దేశిస్తూ...) అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు'' అని వివరించారు. సో... డ్యాన్సర్స్ యూనియన్ కేసులో జానీ మాస్టర్ దాఖలు చేసిన కేసుకు సంబంధించి తీర్పు వచ్చిందన్నమాట.
''మీరు (ఝాన్సీని ఉద్దేశిస్తూ?) ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారని అకుంటున్నారు ఏమో!? అసలు తీర్పు వివరాలు బయటకు వచ్చిన రోజు మీ నిజస్వరూపం ఏంటో? దేని కోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారో? అందరికీ అర్థం అవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది'' అని జానీ మాస్టర్ తన తీర్పును ముగించారు.
Also Read: మహా కుంభమేళాలో ముస్లిం దర్శకుడు... మతపరమైన విమర్శలకూ జవాబు
తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది.
— Jani Master (@AlwaysJani) January 29, 2025
ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు…
జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన అమ్మాయి ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో జానీ మాస్టర్ మీద మరోసారి ఆరోపణలు చేసింది. ఆ కేసులోనూ జానీ మాస్టర్ అతి త్వరలో బయట పడతారని, అందులోనూ ఆయన నిర్ధోషిగా బయటకు వస్తారని సన్నిహితులు చెబుతున్నారు.
Also Read: సూపర్ 'హిట్' ఫ్రాంచైజీలో మాస్ మహారాజ్... అంతా హుష్ హంబక్కే!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

