Ravi Teja: సూపర్ 'హిట్' ఫ్రాంచైజీలో మాస్ మహారాజ్... అంతా హుష్ హంబక్కే!
Ravi Teja Upcoming Movies: మాస్ జాతర సినిమా తర్వాత మాస్ మహారాజ్ రవితేజ చేయబోయే సినిమా ఏమిటి? అంటే సూపర్ హిట్ ఫ్రాంచైజీలో ఆయన ఉంటారని వార్తలు వినిపించాయి. అయితే వాటిలో నిజం లేదట!
![Ravi Teja: సూపర్ 'హిట్' ఫ్రాంచైజీలో మాస్ మహారాజ్... అంతా హుష్ హంబక్కే! Fact Check news about Ravi Teja being part of Hit 4 is fake Ravi Teja: సూపర్ 'హిట్' ఫ్రాంచైజీలో మాస్ మహారాజ్... అంతా హుష్ హంబక్కే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/9c3acd7d0ec1ba5942a1dceae2070ebc1738136221862313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ravi Teja Next Movie After Mass Jathara: మాస్ మహారాజ్ రవితేజ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమా ఏదో తెలుసా? 'మాస్ జాతర'. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. రవితేజ సినిమాలకు సంబంధించి అది తప్ప జనవరి 26న మరొక అప్డేట్ రాలేదు. 'మాస్ జాతర' తర్వాత రవితేజ ఏ సినిమా చేస్తున్నారు? అంటే సూపర్ హిట్ ఫ్రాంచైజీలో పార్ట్ అవుతారని వినపడింది. అందులో నిజం లేదట!
సూపర్ 'హిట్' ఫ్రాంచైజీలో రవితేజ!?
తెలుగు సినిమా సోషల్ మీడియా సర్కిళ్లలో మంగళవారం (జనవరి 28 వ తేదీ) సాయంత్రం ఉన్నట్టుండి ఒక వార్త చక్కర్లు కొట్టడం మొదలు పెట్టింది. దాని సారాంశం ఏమిటంటే... నాచురల్ స్టార్ నాని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఫ్రాంచైజీ 'హిట్' ఉంది కదా! అందులో రవితేజ చేస్తున్నారట.
విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో 'హిట్: ది ఫస్ట్ కేస్' రూపొందింది. అది మంచి విజయం సాధించింది. ఆ తర్వాత అడివి శేష్ హీరోగా 'హిట్: ది సెకండ్ కేస్' తెరకెక్కించారు. ఆ సినిమా కూడా హిట్. ఇప్పుడు నాచురల్ స్టార్ నాని హీరోగా 'హిట్ 3' రూపొందుతోంది. దీని తర్వాత రవితేజ కథానాయకుడిగా 'హిట్ 4' తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని సదరు వార్తల సారాంశం.
సారీ... 'హిట్ 4'లో రవితేజ లేడు!
సూపర్ హిట్ ఫ్రాంచైజీలోని నాలుగో భాగంలో... అంటే 'హిట్ 4'లో మాస్ మహారాజ్ రవితేజ నటించనున్నారని వచ్చిన వార్తల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని నాని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హీరో కమ్ ప్రొడ్యూసర్ నానితో పాటు దర్శకుడు శైలేష్ కొలను కాన్సంట్రేషన్ అంతా 'హిట్ 3' మీద ఉందని, ఈ సినిమా పూర్తయ్యాక, విడుదల అయ్యాక నాలుగో భాగం మీద కాన్సంట్రేట్ చేస్తారని చెబుతున్నారు.
Also Read: ఆ ఒక్కటీ చెప్పొద్దు... మహేష్ బాబుతో పాటు అందరికీ రాజమౌళి కండిషన్, అగ్రిమెంట్స్
ఏడాదికి మినిమం మూడు నాలుగు సినిమాలు చేసే కెపాసిటీ ఉన్న హీరో మాస్ మహారాజ్ రవితేజ. ఎందుకో ఈ ఏడాది ఆయన కాస్త బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న 'మాస్ జాతర' చేస్తున్నారు. ఇది హీరోగా ఆయన 75వ సినిమా. దీని తర్వాత ఆయన ఏ సినిమాకు కమిట్ కాలేదు. ఇద్దరు ముగ్గురు దర్శకులతో రవితేజ చర్చల్లో ఉన్నారని, ఒకసారి కన్ఫర్మ్ అయ్యాక అనౌన్స్మెంట్ వస్తుందని టాక్.
Also Read: మహా కుంభమేళాలో ముస్లిం దర్శకుడు... మతపరమైన విమర్శలకూ జవాబు
The Mass Swagger that left us all stunned after the #MassJathara Mass Rampage Glimpse! 💥💥
— Sithara Entertainments (@SitharaEnts) January 26, 2025
Sit back and enjoy the ultimate feast this man is delivering! ❤️🔥❤️🔥
— https://t.co/E2lxoPJz2f #HappyBirthdayRaviTeja garu ❤️
𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl @sreeleela14… pic.twitter.com/hZNo0sS9rC
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)