SSMB29: ఆ ఒక్కటీ చెప్పొద్దు... మహేష్ బాబుతో పాటు అందరికీ రాజమౌళి కండిషన్, అగ్రిమెంట్స్
Mahesh Babu Rajamouli Movie: సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు SSMB29లో నటిస్తున్న ఆర్టిస్టులకు, సినిమాకు పని చేస్తున్న టెక్నీషియన్లకు దర్శక ధీరుడు రాజమౌళి ఒక కండిషన్ పెట్టారని టాక్. అది ఏమిటో తెలుసా?
![SSMB29: ఆ ఒక్కటీ చెప్పొద్దు... మహేష్ బాబుతో పాటు అందరికీ రాజమౌళి కండిషన్, అగ్రిమెంట్స్ Rajamouli imposes NDA agreements on Mahesh Babu Priyanka Chopra SSMB29 team SSMB29: ఆ ఒక్కటీ చెప్పొద్దు... మహేష్ బాబుతో పాటు అందరికీ రాజమౌళి కండిషన్, అగ్రిమెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/745c8ce577b46f1aee3aaef4ac336c2c1738124889875313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను... 'పోకిరి' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) చెప్పిన డైలాగ్. ఇటీవల ఇంకోసారి ఆ మాట చెప్పారు మహేష్. పాస్ పోర్ట్ లాక్కున్నట్టు అర్థం వచ్చేలా దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) ఒక పోస్ట్ చేయగా... దాని కింద ఆ డైలాగ్ కామెంట్ చేశారు మహేష్. అయితే... సినిమా స్టార్ట్ చేసినట్లు గానీ, స్టార్ట్ చేస్తున్నట్లు గానీ ఆయన కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకో తెలుసా?
ఆ ఒక్కటి చెప్పొద్దు... రాజమౌళి కండిషన్!
ఆ ఒక్కటి అడక్కు... పేరుతో ఒక సినిమా ఉంది. ఇక్కడ అడగొద్దు అంటే ఆగరు. SSMB29 సినిమా అప్డేట్ ఏమిటి? అంటూ మహేష్ బాబుతో పాటు మిగతా యూనిట్ మెంబర్స్ అందరినీ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి సన్నిహితుల వరకు అడుగుతూనే ఉంటారు. అడిగిన వాళ్ళు అందరికీ చెప్పేస్తే ఎలా? సినిమా అప్డేట్లు, కథ కమామిషు లీక్ అయిపోదూ! అందుకే రాజమౌళి ఒక కండిషన్ పెట్టారట. అందరి చేత అగ్రిమెంట్స్ కూడా చేయించుకుంటున్నారట.
ఆ ఒక్కటి చెప్పొద్దు... మహేష్ బాబుతో పాటు హీరోయిన్ ప్రియాంక చోప్రా, ఇంకా మిగతా యూనిట్ సభ్యులు అందరి చేత సినిమాకు సంబంధించి ఎటువంటి విషయాలు ఇతరులతో షేర్ చేసుకోకూడదు అని నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ చేయించారట రాజమౌళి. అందువల్లే, ఎవరూ ఈ సినిమాకు సంబంధించి ఒక్క విషయం కూడా బయటకు లీక్ చేయడం లేదు. కనీసం సన్నిహితులతో కూడా ఈ మూవీకి సంబంధించి ఏ విషయం చెప్పడం లేదు. అంతే కాదు... సెట్‌లో సెల్ ఫోన్స్ కూడా వాడొద్దని చెప్పేశారట.
Also Read: వైజాగ్‌లో 'తండేల్' ఆడకపోతే ఇంట్లో పరువు పోద్ది... ఇంట్లో రూలింగ్ వైజాగే (శోభిత) - నాగ చైతన్య
'ఆర్ఆర్ఆర్ రౌద్రం రణం రుధిరం' సినిమాలోని 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ వచ్చింది. అంతే కాదు... హాలీవుడ్ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకులను, పలువురు సాంకేతిక నిపుణులను సినిమా మెప్పించింది. అందుకని, రాజమౌళి చేయబోయే తదుపరి సినిమా మీద పాన్ వరల్డ్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అందుకని అందరూ ఈ సినిమా విశేషాలు తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. అయితే, సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండడంతో ఇప్పటినుంచి అప్డేట్స్ ఇవ్వడం మంచిది కాదు అని రాజమౌళి భావిస్తున్నారట.
ప్రియాంక చోప్రా కూడా అందుకే కన్ఫర్మ్ చేయట్లేదు!
సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లు ఏదైనా సినిమా ఛాన్స్ వచ్చిన షూటింగ్ స్టార్ట్ చేసిన తమ పీఆర్ టీం చేత లీకులు ఇప్పిస్తూ ఉంటారు. ప్రియాంక చోప్రా మాత్రం ఈ సినిమా గురించి ఎక్కడ నోరు విప్పడం లేదు. చిలుకూరు బాలాజీ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కూడా ఫోటోలు షేర్ చేశారు తప్ప తాను హైదరాబాద్ ఎందుకు వచ్చింది వివరించలేదు. రామ్ చరణ్ సతీమణి ప్రముఖ ఎంటర్ప్రైన్యూర్ ఉపాసన సైతం కొత్త సినిమాకు విషెస్ చెప్పారు తప్ప ఇంకేమీ లీక్ చేయలేదు. ఒక ప్లానింగ్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఈ సినిమాకు పబ్లిసిటీ చేయాలని రాజమౌళి డిసైడ్ అయ్యారు. ప్రతి సినిమాకు పబ్లిసిటీ విషయంలో ఆయన ఎటువంటి కేర్ తీసుకుంటారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Also Read: మహా కుంభమేళాలో ముస్లిం దర్శకుడు... మతపరమైన విమర్శలకూ జవాబు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)