Rajinikanth: రజనీకాంత్ - నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాలో ఐశ్వర్యా రాయ్ రోల్ ఏంటంటే?
రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ మరోసారి జంటగా నటించనున్నారు. అయితే, ఆ సినిమాలో ఐశ్వర్య రోల్ ఏంటో తెలుసా?
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) ది విజయవంతమైన జోడీ. వాళ్ళిద్దరూ జంటగా నటించిన 'రోబో' రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు మరోసారి ఈ జోడీ రిపీట్ కానుంది.
'కో కో కోకిల', 'డాక్టర్', 'బీస్ట్' సినిమాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar)తో రజని ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఐశ్వర్యా రాయ్ కథానాయిక. ఇది పాత విషయమే. రజని, ఐశ్వర్య జోడీ మరోసారి రిపీట్ కానుందనే మాట కొన్ని రోజులుగా వినబడుతోంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... రజనీకాంత్ భార్యగా ఐశ్వర్య కనిపిస్తారట.
భార్యాభర్తలుగా ఐశ్వర్య, రజని పాత్రలను నెల్సన్ దిలీప్ కుమార్ డిజైన్ చేశారట. ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రియాంకా అరుల్ మోహన్‌ను ఇతర పాత్రలకు ఎంపిక చేశారు. ఆగస్టులో సినిమా షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం.
ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... ఈ సినిమాకు సూపర్ స్టార్ రజనీకాంత్ కథ అందిస్తున్నారు. కె.ఎస్. రవికుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇందులో శివ కార్తికేయన్ అతిథి పాత్రలో, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారట. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు.
Also Read: బాలకృష్ణకు జోడిగా నటించిన హీరోయినే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా?
ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కొన్ని రోజులుగా సినిమాలు తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇటీవల మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆమె ఓకే చెప్పారంటే... సినిమా సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్టు ఉంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Also Read: టెన్త్ ఫెయిల్ అయిన మంత్రి గన్ బిల్ పాస్ చేస్తే? - లావణ్యా త్రిపాఠి 'హ్యాపీ బర్త్‌డే' టీజర్ చూశారా?
View this post on Instagram