అన్వేషించండి

Hyundai Creta: ట్యాంక్‌ ఫుల్‌ చేస్తే హ్యుందాయ్ క్రెటా ఎంతదూరాన్ని కవర్‌ చేస్తుంది? కొనే ముందు ఇది తెలుసుకోండి

Hyundai Creta Mileage: పవర్‌, పెర్ఫార్మెన్స్‌, మైలేజ్‌ల కలబోతను అందించే SUV కోసం మీరు చూస్తుంటే, హ్యుందాయ్ క్రెటా మీకు బెస్ట్‌ ఆప్షన్‌ కావచ్చు.

Hyundai Creta Engine And Performance Details: హ్యుందాయ్ క్రెటా, మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUV. గత నెల (మార్చి 2025)లో, 18 వేలకు పైగా క్రెటా యూనిట్లను హ్యుందాయ్‌ విక్రయించింది, ఇది ఈ కార్‌కు ఉన్న పాపులారిటీని గుర్తు చేస్తుంది. హ్యుందాయ్ క్రెటా డీజిల్ వెర్షన్‌, ఫుల్ ట్యాంక్‌లో 1000 కి.మీ. పైగా దూరాన్ని కవర్ చేయగలదు, ఇది లాంగ్ డ్రైవ్ ప్రియులకు సరిగ్గా సూట్‌ అవుతుంది. కానీ, ఈ కాంపాక్ట్‌ SUVని కొనుగోలు చేసే ముందు, మీరు దాని మైలేజీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి.

హ్యుందాయ్ క్రెటా ఇంజిన్ ఆప్షన్స్‌ 
హ్యుందాయ్ క్రెటా మూడు విభిన్న ఇంజిన్ ఆప్షన్స్‌తో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. 
ఆప్షన్‌ నంబర్‌- 1.... 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్. ఇది 160 PS పవర్‌ను & 253 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. 
ఆప్షన్‌ నంబర్‌ - 2.... 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇది, 115 PS పవర్ & 144 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 
ఆప్షన్‌ నంబర్‌ - 3.... 1.5 లీటర్ టర్బో డీజిల్ యూనిట్. ఇది 114 bhp పవర్‌ను & 250 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. 

ఈ మూడు ఇంజిన్ ఆప్షన్స్‌లోనూ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, CVT (Continuously Variable Transmission), 7 స్పీడ్ DCT (Dual Clutch Transmission) వంటి గేర్‌బాక్స్ ఆప్షన్స్‌ను హ్యుందాయ్ క్రెటాలో చూడవచ్చు.

ట్యాంక్ ఫుల్‌ చేస్తే ఎంతదూరం నడుస్తుంది?
హ్యుందాయ్ క్రెటాలో 50 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. ఈ SUV మైలేజ్ దాని ఇంజిన్ & ట్రాన్స్మిషన్‌ ప్రకారం మారుతుంది. మీరు డీజిల్ మాన్యువల్ వేరియంట్‌ను ఎంచుకుంటే, ARAI ప్రకారం, ఈ మోడల్‌ మైలేజ్ లీటర్‌కు 21.8 కి.మీ. అంటే ఫుల్ ట్యాంక్‌తో దాదాపు 1,090 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. ARAI ప్రకారం, డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 19.1 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది & దాని ఫుల్‌ ట్యాంక్ పరిధి దాదాపు 955 కిలోమీటర్లు.

కంపెనీ వెల్లడించిన ప్రకారం, పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 18.4 kmpl మైలేజీని కలిగి ఉంది. అంటే, ఈ మోడల్‌ను ఫుల్ ట్యాంక్ చేసి దాదాపు 920 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. CVT లేదా DCT ట్రాన్స్‌మిషన్‌తో కూడిన పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 17.4 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ప్రకారం, దీని ఫుల్‌ ట్యాంక్‌ రేంజ్‌ దాదాపు 870 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అయితే, వాస్తవ మైలేజ్ అనేది మీ డ్రైవింగ్ స్టైల్‌, ట్రాఫిక్ పరిస్థితులు & రోడ్డు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

హ్యుందాయ్ క్రెటా ధర, ఫీచర్లు 
భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా ఎక్స్-షోరూమ్ ధర (Hyundai Creta ex-showroom price) రూ. 11.11 లక్షల నుంచి ప్రారంభమవుతుంది - రూ. 20.50 లక్షల వరకు ఉంటుంది. కంపెనీ ఈ SUVని మొత్తం 54 విభిన్న ట్రిమ్‌లు, వేరియంట్లలో విక్రయిస్తోంది. హ్యుందాయ్ క్రెటాలో చెప్పుకోదగ్గ ఫీచర్లు చాలా ఉన్నాయి. క్యాబిన్‌లో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను అమర్చారు, ఇది డ్రైవింగ్‌ను మరింత స్మార్ట్‌గా మారుస్తుంది. డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ AC దీని మరో ప్రత్యేకత, ఇది ఉష్ణోగ్రత నియంత్రణ సౌకర్యాన్ని అందిస్తుంది.

హ్యుందాయ్ క్రెటాలో వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, 8 స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. భద్రత కోసం, క్రెటాలో 6 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ & ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి అధునిక లక్షణాలతో ఈ కార్‌ను డిజైన్‌ చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?

వీడియోలు

Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam
Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
BJP President: బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
బీజేపీ బాస్‌గా నితిన్ నబీన్ - నామినేషన్ ప్రక్రియలో ఏపీ నేతల కీలక పాత్ర
When Did Sunday Holiday Start:ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
ఆదివారం సెలవు దినంగా ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు దాన్నే కొనసాగించడం అవసరమా?
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
Telangana Latest News: మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
మహిళా సంఘాలకు గుడ్ న్యూస్ చెప్పిన భట్టి విక్రమార్క- వడ్డీ లేని రుణాలపై కీలక ప్రకటన 
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Embed widget