Adipurush - Hanuman Jayanti : కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయంలో 'ఆదిపురుష్' దర్శకుడు - హనుమాన్ జయంతి, ఆశీస్సులు
Om Raut At Karmanghat Hanuman Temple : హనుమాన్ జయంతి సందర్భంగా 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్ హైదరాబాద్ కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు.
ప్రభు శ్రీరామ్ పాత్రలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సినిమా 'ఆదిపురుష్'. ఓం రౌత్ (Om Raut) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీత దేవి పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ నటించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా...
Devdatta Nage First Look As Lord Hanuman - Adipurush : ఈ రోజు హనుమాన్ జయంతి! ఈ సందర్భంగా 'ఆదిపురుష్' సినిమాలో హనుమంతునిగా నటించిన దేవదత్తా నాగే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో ప్రభు శ్రీరామునిపై హనుమాన్ మదిలో ఉన్న భక్తి భావన స్పష్టంగా కనిపించింది. అంతే కాదు... చిత్ర దర్శకుడు ఈ రోజు హైదరాబాద్ కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయానికి వెళ్లారు.
కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆశీస్సులు తీసుకున్న ఓం రౌత్
హనుమాన్ జయంతి రోజున 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్ హైదరాబాద్ సిటీలో ఉన్నారు. కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆశీస్సులు తీసుకోవడంతో పాటు మరికొన్ని దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీరామ నవమి సందర్భంగా సినిమా పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. అంతకు ముందు నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు ఓం రౌత్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని వైష్ణోదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
Also Read : రవితేజ - వరుణ్ ధావన్ - రానా - ఓ బాలీవుడ్ మల్టీస్టారర్!
త్రీడీలో 'ఆదిపురుష్' విడుదల
జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 'ఆదిపురుష్' విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శ్రీరాముడి అంటే హిందువులలో ఉన్న భక్తి, ప్రభాస్ క్రేజ్ దృష్టిలో పెట్టుకుని భారీ సంఖ్యలో షోస్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదీ సంగతి!
టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అండ్ కృష్ణన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ (Rajesh Nair)తో కలిసి ప్రభాస్ హోమ్ బ్యానర్ లాంటి యూవీ క్రియేషన్స్ సినిమాను విడుదల చేస్తోంది.
రికార్డు స్థాయిలో రిలీజుకు సన్నాహాలు!?
వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో షోలు వేసేలా 'ఆదిపురుష్' టీమ్ ప్లాన్ చేసిందట. ఇండియా మొత్తం మీద ఎనిమిది వేల థియేటర్లలో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. రోజుకు సుమారు 35,000 కంటే ఎక్కువ షోస్ పడే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఇన్‌సైడ్ టాక్. అయితే, వివాదాల నేపథ్యంలో విడుదల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
టీజర్ విడుదల తర్వాత సినిమాపై ట్రోల్స్ ఎక్కువ వచ్చాయి. అందుకని, మళ్ళీ వీఎఫ్ఎక్స్ చేయడం కోసం విడుదల వాయిదా వేశారు. ఆ వివాదం పక్కన పెడితే... శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కొత్త వివాదానికి కారణం అయ్యింది. ఆ పోస్టర్ హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని ముంబై నివాసి సంజయ్ దీనానాథ్ తివారి ఆరోపిస్తున్నారు. సకినాక పోలీస్ స్టేషనుకు న్యాయవాదులు ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రాలతో వెళ్లి కంప్లైంట్ చేశారు.
Also Read : నీ భార్యకు, నీకు సంబంధం ఏమిటో చెప్పగలవా? - విష్ణు వర్సెస్ మనోజ్ గొడవపై మోహన్ బాబు