30 Years PrudhviRaj: 'డోంట్ బాయ్ కాట్.. వెల్ కమ్ టు 'లైలా' - క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీ, కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ పడుతుందా?
Laila Controversy: 'బాయ్ కాట్ లైలా' వివాదంపై నటుడు పృథ్వీరాజ్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పిన ఆయన.. ఈ కాంట్రవర్సీకి ఇంతటితో ముగింపు పలకాలని కోరారు.

30 Years Prudhvi Raj Apology About Laila Controversy: 'బాయ్ కాట్ లైలా' వివాదంపై నటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ (Prudhvi Raj) స్పందించారు. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతూ.. 'డోంట్ బాయ్ కాట్.. వెల్ కమ్ టు లైలా' (Welcome To Laila) అంటూ పేర్కొన్నారు. 'గోదావరి ఎటకారం నాకు వెన్నతో పెట్టిన విద్య. వ్యక్తిగతంగా నాకు ఎవరి మీది ఎలాంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మాట్లాడుకుందాం. సినిమాను కిల్ చెయ్యుద్దు. సినిమాను ప్రేమిద్దాం. గౌరవిద్దాం. నా వల్ల ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాను. ఎవరివైనా మనోభావాలు దెబ్బతినుంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా. ఇంతటితో ఈ వివాదానికి ముగింపు పలకండి. లైలాను బాయ్ కాట్ చేయకండి. విశ్వక్‌సేన్‌కు ఫలక్‌నుమాదాస్‌కు మించిన విజయం ఈ సినిమా అందిస్తుందని ఆశిస్తున్నా' అని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.
క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీ #Laila #PrudhviRaj pic.twitter.com/WbufeIVcpu
— Milagro Movies (@MilagroMovies) February 13, 2025
కాగా, ఇటీవల 'లైలా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. పరోక్షంగా తమ పార్టీని టార్గెట్ చేశారంటూ వైసీపీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. సోషల్ మీడియా వేదికగా 'బాయ్ కాట్ లైలా' అంటూ ట్రెండ్ చేశాయి. దీనిపై హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయినా, వివాదం చల్లారకపోవడంతో పృథ్వీరాజ్ స్వయంగా సారీ చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఓ వ్యక్తి తనతో నీచంగా మాట్లాడాడని.. చనిపోయిన తన అమ్మను సైతం తిట్టాడని పృథ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. 'అది అతని వ్యక్తిత్వం. నా ఆరోగ్యం సైతం దెబ్బతినేలా చేశాడు. అతని గురించి నేను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను సైతం వెనక్కి తీసుకుంటున్నా.' అని పృథ్వీ అన్నారు.
వివాదానికి కారణం ఏంటంటే.?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'లైలా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో మెగా మాస్ ప్రీ రిలీజ్ పేరుతో ఈ నెల 9న నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, అంతకు ముందే కార్యక్రమంలో నటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. 'మేకల సత్యం అనే క్యారెక్టర్ సీన్ షూట్ చేసేటప్పుడు యాదృచ్ఛికంగా ఒకటి జరిగింది. మొదట 150 మేకలు ఉన్నాయని చెప్పారు. చివరికి ఎన్ని ఉన్నాయని లెక్కిస్తే సరిగ్గా 11 ఉన్నాయి.' అని వ్యాఖ్యానించగా.. పరోక్షంగా తమ పార్టీనే టార్గెట్ చేశారంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. 'బాయ్ కాట్ లైలా' అంటూ సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ చేశాయి.
హీరో విశ్వక్, నిర్మాత సాహు వివరణ
దీనిపై స్పందించిన హీరో విశ్వక్, నిర్మాత సాహు గారపాటి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చారు. అది తమ నోటీస్‌లో జరగలేదని.. సినిమాను సినిమాగా చూడాలని అన్నారు. సదరు వ్యక్తి మాట్లాడే సమయంలో తాము అక్కడ లేమని.. అది తమకు తెలియకుండా జరిగిందని వివరణ ఇచ్చారు. ఒక్కరు చేసిన తప్పునకు సినిమాను బలి చెయ్యొద్దంటూ నటుడు విశ్వక్ క్షమాపణ చెప్పారు. తాజాగా, పృథ్వీరాజ్ సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పడంతో ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని కోరారు. కాగా.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ 'లైలా' మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్‌లో విభిన్న పాత్రలో నటించారు.
Also Read: 'రానా నాయుడు 2'పై రానా కీలక అప్ డేట్ - ట్రైలర్, స్ట్రీమింగ్ డేట్స్‌పై కీలక వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

