Skill Courses: 'స్కిల్' కోర్సులకు యూజీసీ మార్గదర్శకాలు వెల్లడి, సూచనలకు ఆహ్వానం
UGC Guidelines: 'స్కిల్ డెవలప్‌మెంట్' కోర్సులను ప్రవేశపెట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) డిసెంబరు 18న మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిపై సలహాలు, సూచనలు కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
Guidelines for Skill Development Courses: దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో స్వల్పకాలిక 'స్కిల్ డెవలప్‌మెంట్' కోర్సులను ప్రవేశపెట్టేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) డిసెంబరు 18న మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిపై సలహాలు, సూచనలు కోరుతూ ప్రకటన విడుదల చేసింది. ఆర్టిఫీషియన్ ఇంటెలిజెన్స్ (AI)-మెషిన్ లెర్నింగ్, ఏఐ-రోబోటిక్స్, ఐఓటీ, ఇండస్ట్రీస్ ఐఓటీ, డేటా సైన్స్, అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి 29 విభాగాల్లో స్వల్పకాలిక నైపుణ్య కోర్సులను యూజీసీ సూచించింది. మౌలిక సదుపాయాలు, శిక్షణ సామర్థ్యం ఆధారంగా ఆయా కళాశాలలు ఈ కోర్సులను ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది.
పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకోవాలని, కంప్యూటర్ ల్యాబ్, యంత్రాలు, పరికరాలు తప్పనిసరిగా ఉండాలని విద్యాసంస్థలను యూజీసీ ఆదేశించింది. అధ్యాపకులతోపాటు ఈ కోర్సుల్లో అనుభవం ఉన్న వారి సేవలను వినియోగించుకోవచ్చని సూచించింది. కొత్తగా ప్రవేశపెట్టే ఈ షార్ట్‌టర్మ్ స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులను 3-6 నెలలు సర్టిఫికేట్ కోర్సులుగా నిర్వహించాల్సి ఉంటుందని యూజీసీ పేర్కొంది. ఇందులో వారానికి ఒక గంట థియరీ, రెండు గంటలు ప్రాక్టీకల్స్ ఉండాలని తెలిపింది. థియరీ 15 గంటలకు ఒక క్రెడిట్, ప్రాక్టీకల్, నైపుణ్య శిక్షణ ఇచ్చే 30గంటలకు ఒక క్రెడిట్ చొప్పున ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. విద్యార్థుల, అధ్యాపకుల కనీస నిష్పతి 30:1గా ఉండాలని, ప్రతి కోర్సుకు ఉన్నత విద్యాసంస్థలు ముందుగా ఫీజులు నిర్ణయించి సొంత నిధులతో ఇవి కొనసాగేలా రూపకల్పన చేయాలని సూచించింది.
ALSO READ:
‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం, ప్రధానితో మాట్లాడే అవకాశం
పరీక్షల సమయం దగ్గరపడుతోంది. దీంతో ప్రిపరేషన్‌పై పూర్తిగా దృష్టిసారించలేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడి, భయానికి లోనవుతారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఏటా నిర్వహించే 'పరీక్షా పే చర్చ'(Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ విద్యాసంవత్సరానికి గాను 'పరీక్షా పే చర్చ' రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ డిసెంబరు 14న ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానితో మాట్లాడేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అధికారిక వెబ్‌సైట్‌లో జనవరి 12లోపు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపింది. మరోవైపు పరీక్షా పే చర్చ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని కేంద్ర విద్యాశాఖ అధికారిక ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్టు చేసింది.
‘పరీక్షా పే చర్చ’ రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..
'ఫ్యాషన్' కోర్సుల్లో ప్రవేశాలకు 'నిఫ్ట్-2024' నోటిఫికేషన్ వెల్లడి, ఎంపిక ఇలా
దేశవ్యాప్తంగా ఉన్న 18 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT), క్యాంపస్‌లలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహించే ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఆయా కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తారు. యూజీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత, పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సులకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, ప్రవేశాల వివరాల కోసం క్లిక్ చేయండి..