Nara Lokesh : కాశీనాయన ఆశ్రమంలో పునర్ నిర్మాణ పనులు .. హామీ ఇచ్చిన 24 గంటల్లోపే అమలు చేసిన లోకేష్!
Reconstruction work at Kasinayana Ashram: జ్యోతి క్షేత్రం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం కాదు అన్నదాన కేంద్రం..అందుకే నారా లోకేష్ హామీ ఇచ్చిన 24 గంటల్లోపే రంగంలోకి దిగారు.

Kasinayana Ashram AP minister Nara Lokesh: కాశీనాయన ఆశ్రమంలో కూల్చివేతలపై స్పందించి ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెప్పిన మంత్రి నారా లోకేష్ ... అక్కడ పునర్ నిర్మాణ పనులు చేస్తామని హామీ ఇచ్చారు..24గంటల్లోనే రంగంలోకి దిగారు
కాశీనాయన ఆశ్రమం వద్ద అటవీ అధికారులు కూల్చిన పలు షెడ్లను సొంత నిధులతో నిర్మిస్తానని హామీ ఇచ్చిన ఏపీ మంత్రి నారా లోకేష్ .. 24 గంటల్లోనే గామీని నెరవేర్చే పనిలో దిగారు. కాశీనాయన ఆశ్రమంలో కూల్చివేతలు జరిగిన ప్రదేశంలోనే పునర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. కూల్చిన షెడ్లను తొలగించి నిర్మాణ పనులు మొదలెట్టేశారు కూడా.
నారా లోకేష్ ఇంత త్వరగా స్పందించాలంటే అందుకు కారణం..ఆ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత.
జ్యోతి క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా కన్నా అన్నదాన కేంద్రంగా వెలుగుతోంది. కాశీనాయనను భగవంతుడిగా కాదు అన్నదాన ఉద్యమ స్ఫూర్తి ప్రధాత అని పిలుస్తారు. కాశీ నాయన అత్యంత సాధారణ జీవితం గడుపారు. తనకాళ్లకు నమస్కరించేవారిని చూసి విసుక్కునేవారు .. నా కాళ్లు మొక్కితే ఏమొస్తుంది..పదిమంది ఆకలి తీర్చండి అనేవారు.
కులమతప్రాంతాలకు అతీతంగా ఎంతోమంది ఆకలితీర్చే కాశీనాయన దర్శనమే మహాభాగ్యంగా భావిస్తారు భక్తులు. కేవలం సాధారణ భక్తులు మాత్రమే కాదు రాజకీయ ప్రముఖులు కూడా ఆయన దర్శనం కోసం బారులుతీరేవారు. 1994 ఎన్నికల సందర్బంగా అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాశీనాయన ఆశ్రమానికి వెళ్లి ఆయన ఆశీస్సులు కోరారు. తన ఎదురుగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పటికీ.. "ఏం రా.. " అని సంబోధించారనే కథన వచ్చింది. అంటే కాశీనాయన దృష్టింలో అందరూ సమానమే.
మరో సందర్భంగా కాశీ నాయన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇంటికి వెళ్లినట్టు పత్రికల్లో వార్తలొచ్చాయి. అలా అడపా దడపా జనాల నోళ్లలో కాశీనాయన పేరు వినిపిస్తూనే ఉండేది. ఆయన ఏ ప్రముఖుడిని కలిసినా కానీ అన్నదానం చేయమని చెప్పేవారట.
నా వద్దకు వస్తే అద్భుతాలు జరుగుతాయని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. భక్తులను భ్రమల్లో ముంచెత్తలేదు..ఆయన చేసే ఒకే ఒక ప్రవచనం అన్నదానం. కాశీనాయన సమాధి చెందిన తర్వాత అక్కడకు భక్తుల తాకిడి మరింత పెరిగింది. అడవి మధ్య లో ఉన్న జ్యోతి క్షేత్రం లో సొంత ఇంట్లో ఉన్నట్టే భోజనాలు చేసివస్తారంతా .
కాశీ నాయన ప్రధాన ప్రవచనం అయిన "అన్నదానం " కర్నూల్, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక ఉద్యమంలాగా రూపు దాల్చింది.
నంద్యాల కల్పనా సెంటర్లో గంగమ్మ అనే ఒక మహిళ ఆధ్వర్యంలో అన్నదాన సంత్రం నడుస్తోంది. గడివేముల మండలంలో మారుమూల కుగ్రామం అయిన గనిలో స్థానిక రైతులు కాశీనాయన పేరుమీద ఆశ్రమం పెట్టి అన్నదానం చేస్తున్నారు.
నంద్యాల కోవెలకుంట్ల మార్గంలో కలుగొట్ల వద్ద నిత్యం వందల సంఖ్యలో భోజనం చేస్తారు
నెల్లూరు జిల్లా మారుమూల ఘటిక సిద్దేశ్వరం లో కూడా ఆయన పేరిట ఆశ్రమం నడుస్తోంది
బండి ఆత్మకూరు మండలం లోని ఓంకారం క్షేత్రం వద్ద ఆయన పేరుతో నిత్య అన్నదానం ఉంటుంది
ఏదో మొక్కుబడిగా కాదు ఆప్యాయంగా వండి వడ్డిస్తారు. కాశీ నాయన పేరుమీద రాష్ట్రంలో దాదాపు 100 పైగా ఆశ్రమాలు వెలిసాయి. అన్ని చోట్లా అన్నదాన కేంద్రాలున్నాయి. ఆయా ప్రాంతాల్లో రైతులు తాము పండించిన పంటలో కొంత భాగాన్ని అన్నదాన కేంద్రాలకు స్వచ్ఛందంగా అందిస్తారు.
ఇంత మహత్తరమైనా కార్యక్రమం చేస్తోన్న ఆశ్రమం కాబట్టే..కూల్చివేతలపై ప్రభుత్వం తరపున క్షమాపణలు చెప్పిన నారా లోకేష్ తక్షణమే పునర్ నిర్మాణ పనులు చేపట్టారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

