Raja Singh: పాతసామాను బయటపడేస్తేనే బీజేపీకి మంచి రోజులు- రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
Raja Singh: తెలంగాణ బీజేపీ నాయకత్వంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత సామాను చాలా ఉందని దాన్ని బయటకు పంపించాలని సూచించారు.

Raja Singh Latest News: తెలంగాణలో బీజేపీ పని తీరుపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోలీపై విధించిన ఆంక్షలను తప్పుపట్టిన ఆయన బీజేపీ పని తీరుపై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే హిందూ మతం సేఫ్‌గా ఉంటుందని అన్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ముందు పార్టీలో మార్పులు జరగాలని సూచించారు రాజాసింగ్. పాత సామాను బయటకు పంపించేస్తేనే బీజేపీ బాగుపడుతుందన్నారు. కేంద్ర అధినాయకత్వం దీనిపై ఆలోచన చేయాలని సూచించారు.
రాష్ట్ర నాయకులపై రాజా సింగ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే వాళ్లతోనే కుమ్మక్కు అవుతున్నారని ఆరోపించారు. వాళ్లతోనే సీక్రెట్ మీటింగ్ పెట్టుకుంటుంటున్నారి విమర్శించారు. ఇలా చేస్తే తెలంగాణలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు.
ఇలాంటి వాటిని కేంద్ర నాయకత్వం గమనించాలని రాజా సింగ్ అభిప్రాయపడ్డారు. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనేటోళ్లు చాలా మంది ఉన్నారని తెలిపారు. అలాంటి వాళ్లను రిటైర్ చేస్తేనే బీజేపీకి మంచి రోజులు వస్తాయని సూచించారు. ఇది తన ఒక్కడి అభిప్రాయం కాదని... చాలా మంది బీజేపీ సీనియర్ అధికారులు, కార్యకర్తలు మనసులో మాట ఇదేనన్నారు.
ఇలాంటి వాటి వల్లే హోలీపై ప్రభుత్వం ఆంక్షలు విధించిందని ఆరోపించారు రాజాసింగ్. హోలీ ఎట్లా జరుపుకోవాలనేది పోలీస్ అధికారులు చెప్తారా అని ప్రశ్నించారు. హిందువులతోని పెట్టుకుంటే కెసిఆర్ పరిస్థితి ఏమైందో ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డికి సూచించారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

