News
News
వీడియోలు ఆటలు
X

TOEFL iBT: 'టోఫెల్‌' పరీక్షలో కీలక మార్పులు, జులై నుంచి అమల్లోకి!

ఇప్పటివరకు ఈ పరీక్ష పూర్తయ్యేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టగా.. ఇకపై రెండు గంటల్లోపే (గంటా 56 నిమిషాల్లో) పూర్తయ్యేలా కుదించారు. ఈ మార్పులు జులై 26 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.

FOLLOW US: 
Share:

విదేశాల్లో ఉన్నతవిద్య కోసం వెళ్లాలనుకునే వారిలో 'ఇంగ్లిష్' నైపుణ్యాలను పరీక్షించేందుకు నిర్వహించే టోఫెల్(టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్) పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఈ పరీక్ష పూర్తయ్యేందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టగా.. ఇకపై రెండు గంటల్లోపే (గంటా 56 నిమిషాల్లో) పూర్తయ్యేలా కుదించారు. అంతేకాకుండా ఈ పరీక్ష పూర్తయిన వెంటనే విద్యార్థులు తమ అధికారిక స్కోర్ విడుదలయ్యే తేదీని సైతం తెలుసుకోవచ్చని ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ వెల్లడించింది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్స్‌కు సంబంధించిన టోఫెల్, గ్రాడ్యుయేట్ రికార్డు ఎగ్జామినేషన్స్ రాసేవారికి అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేసినట్లు ఈటీఎస్ సీఈవో అమిత్ సేవక్ వెల్లడించారు. ఈ మార్పులు జులై 26 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు.

విద్యార్థుల్లో ఇంగ్లిష్ సామర్థ్యాన్ని అంచనా వేసే ఈ టోఫెల్ స్కోరును ప్రపంచవ్యాప్తంగా 160 దేశాలకు పైగా దాదాపు 11,500 యూనివర్సిటీలు అనుమతిస్తున్నాయి. విదేశీ విద్యలో భాగంగా ప్రపంచంలోనే ప్రసిద్ధ గమ్యస్థానాలుగా ఉన్న అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు యూకేలోని 98 శాతానికి పైగా విశ్వవిద్యాలయాలు ఈ స్కోరును ప్రామాణికంగా తీసుకొని డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షలో రీడింగ్ సెక్షన్‌ను కుదించడంతోపాటు స్వతంత్రంగా రాసే టాస్క్ స్థానాన్ని అకడమిక్ డిస్కషన్ కోసం రాసే విధానం‌తో భర్తీ చేసినట్టు ఈటీఎస్ తెలిపింది. స్కోరు చేయని ప్రశ్నలను పరీక్ష నుంచి తొలగించనున్నారు.

గతంతో పోలిస్తే వేగంగా, మరింత సులభంగా టోఫెల్ ఐబీటీ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని.. అలాగే, ఈ పరీక్ష ఫీజును తొలిసారి రూపాయిల్లోనే చెల్లించే సౌలభ్యం కల్పిస్తున్నట్లు అమిత్ తెలిపారు. వీటితో పాటు చెల్లింపులను సులభతరం చేసేందుకు మరిన్ని ఆప్షన్లను త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు ఆయన వెల్లడించారు. విదేశాల్లో విద్యనభ్యసించాలనుకొనే లక్షలాది భారతీయ విద్యార్థులకు ఈ మార్పులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని భారత్‌లోని ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ ప్రతినిధుల సంఘం అధ్యక్షుడు నిశిధర్ రెడ్డి బొర్రా అభిప్రాయపడ్డారు.

Also Read:

ఏపీలో పాలిటెక్నిక్‌ విద్యార్థులకు 'షాక్'! బీటెక్‌లో ప్రవేశాలకు 'బ్రేక్'?
ఏపీలోని పాలిటెక్నిక్ విద్యార్థులకు బీటెక్‌లో ప్రవేశాలకు ప్రభుత్వం బ్రేక్ వేసేలా కనిపిస్తోంది. పాలిటెక్నిక్ తర్వాత ఏడాది తప్పనిసరిగా పరిశ్రమలో పని చేయాలనే కొత్త నిబంధన తీసుకురానుండటమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సాంకేతిక విద్యాశాఖ  ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కొత్త విధానం ప్రకారం మూడేళ్ల పాలిటెక్నిక్ విద్య పూర్తిచేసుకున్న తర్వాత, నాలుగో ఏడాది తప్పనిసరిగా పరిశ్రమలో పని చేయాల్సి వస్తుంది. దీంతో పాలిటెక్నిక్ ఇక నాలుగేళ్ల కోర్సుగా మారిపోతుంది. ఏటా పాలిటెక్నిక్ నుంచి 35 వేల మంది ఉత్తీర్ణత సాధిస్తుంటే వీరిలో 85 శాతం మంది ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈసెట్) ద్వారా బీటెక్ రెండో ఏడాదిలో ప్రవేశం పొందుతున్నారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌ యూజీసీ- నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) డిసెంబర్‌-2022/ జూన్‌-2023 దరఖాస్తు గడువు వారం రోజులు పొడిగించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ-నెట్‌ దరఖాస్తు గడువు ఏప్రిల్ 10తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే వివిధ కార‌ణాల వల్ల చాలా మంది అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించలేకపోయారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఏప్రిల్‌ 17 వ‌ర‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Published at : 12 Apr 2023 11:06 AM (IST) Tags: TOFEL TOEFL iBT exam scoring metho TOEFL iBT exam pattern TOEFL iBT exam format TOEFL iBT exam

సంబంధిత కథనాలు

TS ICET Answer Key: 'టీఎస్ ఐసెట్-2023' ప్రిలిమినరీ 'కీ' విడుద‌ల‌! అభ్యంతరాలకు అవకాశం!

TS ICET Answer Key: 'టీఎస్ ఐసెట్-2023' ప్రిలిమినరీ 'కీ' విడుద‌ల‌! అభ్యంతరాలకు అవకాశం!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

TS ICET: జూన్ 5న 'టీఎస్ ఐసెట్-2023' ప్రాథ‌మిక కీ విడుద‌ల‌! ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

AP PG CET: ఏపీ పీజీ సెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

టాప్ స్టోరీస్

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

YS Sharmila: వైఎస్ షర్మిలకు కోర్టు నుంచి సమన్లు, 20న హాజరు కావాలని ఆదేశాలు

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు

KTR IT Report: హైదరాబాద్‌లో 1.83 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు - వార్షిక ఐటీ నివేదిక విడుదల

KTR IT Report: హైదరాబాద్‌లో 1.83 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు - వార్షిక ఐటీ నివేదిక విడుదల