Arvind Kejriwal on AAP Election Loss | ఆమ్ ఆద్మీ ఓటమిపై స్పందించిన కేజ్రీవాల్ | ABP Desam
ఈ రోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రజలు ఇచ్చిన నిర్ణయాన్ని శిరసావహిస్తున్నాం.. వినయపూర్వకంగా స్వీకరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీకి అభినందనలు చెబుతున్నాను. బీజేపీ చెప్పిన పనులు, ఇచ్చిన హామీలు అన్నీ నెరవేరుస్తుందని నమ్ముతున్నాను. గడచిన పదేళ్లలో ప్రజలు మాకు ఇచ్చిన అవకాశంతో చాలా సేవ చేశాం. విద్యా, ఆరోగ్యం, నీటి వనరులు, విద్యుత్ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాం. విభిన్న వర్గాల ప్రజల జీవితాలు మెరుగుపడటానికి కృషి చేశాం. ఢిల్లీ మౌలిక వసతులను తీర్చిదిద్దాం. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన నిర్ణయం మేరకు ఓ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించటంతో పాటు కష్టాల్లో ఉన్న వారి అవసరాలకు అండదండగా నిలబడేందుకు ఎప్పుడూ ముందుంటాం. రాజకీయాలను మేం అధికార దర్పం ప్రదర్శించటానికి వాడుకోం. ప్రజలకు సేవ చేయటానికే ఓ మార్గం గా భావించి వచ్చాం. ఆ పని మేం చేస్తూనే ఉంటాం. మేం ఇక ముందు కూడా ప్రజలకు అండగా ఉంటూనే ఉంటాం. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలనూ అభినందిస్తున్నా..కృతజ్ఞతలు చెబుతున్నా. చాలా పెద్ద ఎన్నికల యుద్ధం చేశాం అందులో మీరందరూ వీరోచితంగా పోరాడారు అందుకు కృతజ్ఞతలు చెబుతున్నా.





















