Delhi Elections Results 2025 | మాస్టర్ మైండ్ Manish Sisodia ను వీక్ చేశారు..ఆప్ ను గద్దె దింపేశారు | ABP Desam
మనీశ్ సిసోడియా. నేషనల్ పాలిటిక్స్ బాగా ఫాలో అయ్యేవాళ్లకు అంతే బాగా తెలిసిన పేరు. అసలు కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా ఈ రెండు పేర్లను వేరు చేసి చూడలేం. కేజ్రీవాల్ ఈ దేశానికి ఏదో చేయాలని ఇంట్రెస్ట్ తో తన IRS ఉద్యోగానికి VRS తీసుకున్నప్పుడు..తనతో పాటు జర్నలిస్ట్ ఉద్యోగాన్ని వదిలేసి నడిచిన వ్యక్తి మనీశ్ సిసోడియా. కేజ్రీవాల్ పన్నే ప్రతీ వ్యూహానికి వ్యూహకర్త మనీశ్ సిసోడియానే. మనకు అందరికీ తెలిసిన పోలికతో చెప్పాలంటే మోదీకి అమిత్ షా ఎలానో...కేజ్రీవాల్ కు మనీశ్ సిసోడియా అలా. కేజ్రీతో కలిసి పరివర్తన్, కబీర్ లాంటి నాన్ ఫ్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నడిపినా, లోక్ పాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి కేజ్రీవాల్, తను పోరాటం చేసినా, తర్వాత రాజకీయాల్లోకి వెళ్దామనే కేజ్రీవాల్ నిర్ణయానికి బలంగా మద్దతు పలికి ఆమ్ ఆద్మీ అనే పార్టీ ని డిజైన్ చేసినా అన్ని చోట్లా సిసోడియా ముద్ర చాలా బలంగా ఉంది.





















