అన్వేషించండి

Stock Market Closing: ఆర్‌బీఐ సిగ్నల్స్‌ బాగున్నా మార్కెట్‌ను ముంచిన FMCG స్టాక్స్‌ - 25000 దిగువన నిఫ్టీ

Stock Market Updates: బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ గత సెషన్‌లో రూ.459.50 లక్షల కోట్లుగా ఉండగా, ఈ రోజు రూ.462.43 లక్షల కోట్ల వద్ద ముగిసింది.

Stock Market Closing Today Oct 09: భవిష్యత్‌లో వడ్డీ రేట్లు తగ్గొచ్చని ఆర్‌బీఐ సిగ్నల్స్‌ ఇచ్చినప్పటికీ, FMCG, ఎనర్జీ షేర్లలో అమ్మకాల కారణంగా ఈ రోజు (బుధవారం, 09 అక్టోబర్‌ 2024) ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు నష్టాల్లో క్లోజ్‌ అయ్యాయి. ఆర్‌బీఐ గవర్నర్‌ రంగరాజన్‌ ప్రెస్‌ మీట్‌ తర్వాతి ప్రారంభమైన నష్టాల పరంపర, ట్రేడింగ్‌ చివరి గంటలో వేగవంతమైంది. నిఫ్టీ ఇంట్రాడే గరిష్ఠ స్థాయి నుంచి 280 పాయింట్లు, సెన్సెక్స్ 1000 పాయింట్లు జారిపోయాయి. అయితే, ఈ ఉదయం మార్కెట్‌ మంచి ఉత్సాహంతో ప్రారంభమైంది. మిడ్‌ క్యాప్, స్మాల్‌ క్యాప్ స్టాక్స్‌ పుంజుకున్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) వరుసగా పదోసారి రెపో రేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచింది. తన వైఖరిని 'అకామడేషన్‌ విత్‌డ్రా' నుంచి 'న్యూట్రల్‌'గా మార్చుకున్నట్లు ప్రకటించింది.

మార్కెట్‌ ముగిసిన సమయానికి, BSE 167.71 పాయింట్లు లేదా 0.21% పడిపోయి 81,467.10 వద్ద క్లోజ్‌ అయింది. NSE నిఫ్టీ 31.20 పాయింట్లు లేదా 0.12% తగ్గి 24,981.95 వద్ద ఆగింది. ఈ ఉదయం సెన్సెక్స్‌ 81,954.58 దగ్గర, నిఫ్టీ 25,065.80 దగ్గర ఓపెన్‌ అయ్యాయి.

పెరిగిన & పడిపోయిన షేర్లు 
సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లో 21 షేర్లు లాభాలతో ముగిస్తే, 9 స్టాక్స్‌ నష్టాల్లో క్లోజ్‌ అయ్యాయి. నిఫ్టీ 50 ప్యాక్‌లో 29 స్టాక్స్‌ లాభాలు ఆర్జించగా, 21 స్టాక్స్‌ నష్టాలను ఆకర్షించాయి. టాప్‌ గెయినర్స్‌లో.. టాటా మోటార్స్ 2.15 శాతం, టెక్ మహీంద్రా 1.92 శాతం, మారుతి సుజుకీ 1.80 శాతం, ఎస్‌బీఐ 1.66 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.57 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.50 శాతం, భారతి ఎయిర్‌టెల్ 1.44 శాతం, బజాజ్ ఫైనాన్స్‌ 1.35 శాతం పెరిగాయి. టాప్‌ లూజర్స్‌లో... ఐటీసీ 3.08 శాతం, నెస్లే ఇండియా 2.21 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ 1.65 శాతం, హెచ్‌యూఎల్ 1.47 శాతం, ఎల్ అండ్ టీ 1.13 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.97 శాతం పతనమయ్యాయి.

సెక్టార్ల వారీగా...
నేటి ట్రేడింగ్‌లో ఆటో, ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్, మీడియా, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాల షేర్లు పుంజుకున్నాయి. మరోవైపు.. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు క్షీణించాయి. నేటి ట్రేడింగ్‌లో, మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ స్టాక్‌లలో గరిష్ట గ్రీన్‌నెస్ కనిపించింది. 

నిఫ్టీ మిడ్‌ క్యాప్ ఇండెక్స్ 0.97 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.33 శాతం పెరిగింది.

మార్కెట్ క్యాప్
ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ పతనం అయినప్పటికీ, భారత స్టాక్ మార్కెట్‌ విలువ పెరిగింది. బీఎస్‌ఈలో లిస్టయిన స్టాక్‌ల మార్కెట్ క్యాప్ గత సెషన్‌లో రూ. 459.50 లక్షల కోట్ల వద్ద ఉంటే, ఈ రోజు రూ. 462.43 లక్షల కోట్ల వద్దకు చేరింది. నేటి సెషన్‌లో ఇన్వెస్టర్ల సంపద రూ.3 లక్షల కోట్లు పెరిగింది. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: యూపీఐ లైట్‌, యూపీఐ 123పే లావాదేవీల పరిమితి పెంపు - వాలెట్‌ నిల్వల్లోనూ మార్పు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభం - పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Atul Subhash Case: బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
బెంగుళూరు టెకీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం - అతుల్ భార్య అరెస్ట్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు, పూర్తి వివరాలివే!
Hyderabad News: 14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
14 ఏళ్ల పోరాటం - ఆ కుటుంబానికి రూ.1.99 కోట్ల పరిహారం
CM Chandrababu: 'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
'సార్.. ఒక్క ఫోటో ప్లీజ్' - సీఎం చంద్రబాబుకు బాలిక రిక్వెస్ట్, ఆయన ఏం చేశారంటే?
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Bigg Boss 8 Telugu Finale LIVE: బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే... చీఫ్ గెస్ట్ ఫిక్స్, విన్నర్ అతడే - ఇంకేం జరుగుతుంది? లైవ్ అప్డేట్స్ దేఖో
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Embed widget