అన్వేషించండి

UPI News: గూగుల్ పే, ఫోన్ పేను టార్గెట్ చేసిన ప్రభుత్వం! అసలేం జరుగుతోంది ?

UPI In India: దేశంలోని డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ యూపీఐలో తన స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న భీమ్ యాప్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈకామర్స్ వ్యవస్థలోకి అడుగుపెడుతోంది.

BHIM App: దేశంలో యూపీఐ చెల్లింపు యాప్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిలో ప్రధానంగా ఫోన్ పే, గూగుల్ పేలకు ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. అయితే వీటి ఆధిపత్యానికి కళ్లెం వేయాలని ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న భీమ్ యాప్ వేగంగా అడుగులు వేస్తోంది. 

ఓఎన్డీసీ ఫ్లాట్ ఫారమ్‌లోని ఈ కామర్స్ 
భారత్ ఇంటర్‌ఫేస్ ఫర్ మనీ(BHIM) ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓఎన్డీసీ ఫ్లాట్ ఫారమ్‌లోని ఈ కామర్స్ చెల్లింపుల్లోకి అడుగుపెడుతోంది. వాస్తవానికి దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్మించింది. తాజాగా భీమ్ ఈ-కామర్స్‌లో దాని ఉనికిని విస్తరించడానికి ONDC ప్లాట్‌ఫారమ్‌ను ప్రభావితం చేస్తుంది. అయితే ఇది ప్రత్యేక విభాగం ద్వారా అమలు చేయబడనుందని తెలుస్తోంది. ఆహారం, శీతలపానీయాలు, కిరాణా సరుకులు, ఫ్యాషన్ ఉత్పత్తులు వంటి విభాగాల్లో సేవలను అందించటం ద్వారా కస్టమర్లను ఆకర్షించాలని చూస్తున్నారు.

భీమ్ కు పెద్ద అవకాశం 
భారతదేశంపు డిజిటల్ చెల్లింపుల వ్యాపారంలో సింహభాగాన్ని ఇప్పటికే ప్రైవేటు ఆటగాళ్లైన గూగుల్ పే, ఫోన్ పే సొంతం చేసుకున్నాయి. ఇటువంటి తరుణంలో ఓఎన్డీసీని వినియోగించుకోవటం భీమ్ కు పెద్ద అవకాశంగా మారనుందని తెలుస్తోంది. దేశంలోని మూడవ అతిపెద్ద డిజిటల్ చెల్లింపుదారు పేటీఎంపై గత నెలలో రిజర్వు బ్యాంక్ కఠిన ఆంక్షల తర్వాత అకస్మాత్తుగా ప్రభుత్వ నిర్వహణలో ఉన్న భీమ్ యాప్ డౌన్‌లోడ్స్ భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ONDCలో వ్యూహాత్మక కార్యక్రమాలకు మాజీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ హండా.. యాప్ మార్కెట్ స్థానాన్ని బలోపేతం చేసేందుకు NPCI చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా BHIM చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా పగ్గాలు చేపట్టారు.

వాస్తవానికి 2016లో ప్రారంభించబడిన భీమ్ యాప్ పరిమిత మార్కెటింగ్ బడ్జెట్, చాలా మంది వినియోగదారులకు మార్కెట్లో పరిచయం లేనందున కస్టమర్లను ఆకర్షించటంలో కష్టపడుతోంది. ఈ క్రమంలోనే రాబోయే BHIM 2.0 ప్రాజెక్ట్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారు అనుభవాన్ని పెంచటం లక్ష్యంగా సిద్ధమౌతోంది. ఎక్కువ మంది దీనిని వినియోగించేలా పురిగొలిపేందుకు వీలుగా తీర్చిదిద్దబడుతోంది. ఏదేమైనప్పటికీ వినియోగదారుల ప్రాధాన్యతలను అధిగమించడానికి ONDCపై మాత్రమే ఆధారపడటం సరిపోదని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు.

మైగ్రేట్ అవ్వాలని చూస్తున్న డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు 
వాస్తవానికి గూగుల్ పే, ఫోన్ పేలలో అత్యధికంగా భారీ స్థాయిలో జరుగుతున్న చెల్లింపులు ఎన్పీసీఐని కొత్త థర్డ్ పార్టీ యూపీఐ చెల్లింపు కంపెనీలను ఎంకరేజ్ చేసే విధంగా పురిగొల్పింది. వాస్తవానికి పేటీఎం కుప్పకూలిన తర్వాత.. కేవలం మార్కెట్లో ఒకరు లేదా ఇద్దరిపైన ఆధారపడటం సరైనది కాదని ఎన్పీసీఐ గుర్తించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పేటీఎం నుంచి దాదాపు 50-70 లక్షల మంది మర్చంట్ ఖాతాదారులు ఇతర డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మైగ్రేట్ అవ్వాలని చూస్తున్నారని వెల్లడైంది.

ఇలాంటి సమయంలో కొత్తగా కస్టమర్లను ఆకర్షించానికి భీమ్ చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్లు ఎక్కువమందికి సేవలు అందేలా చేసుకునేందుకు ఇదొక సదవకాశమని వారు చెబుతున్నారు. పేటీఎంపై ఆర్బీఐ ఆంక్షల తర్వాత భీమ్ వేగం పెంచింది తన ఫాట్ ఫామర్ లోకి వస్తున్న కస్టమర్లకు క్యాష్‌బ్యాక్స్ వంచివి ఆఫర్ చేస్తూ వారిని నిలుపుకునే ప్రయత్నం తీవ్రతరం చేసింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget