Vijayawada Temple: బెజవాడ దుర్గ‌మ్మ టెండ‌ర్ల అలా ఎలా ! టోల్ వసూళ్లకు కొత్త రూట్‌పై గందరగోళం

Durga Temple In Vijayawada: భక్తులు సమర్పించిన చీరల విక్ర‌యాల టెండర్లతో పాటుగా టోల్ గేట్ నిర్వహణ టెండ‌ర్,సెక్యూరిటీ టెండ‌ర్ నిర్వహణ విషయాల్లో ఆరోప‌ణ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

FOLLOW US: 

కృష్ణా జిల్లా విజయవాడ కనకదుర్గ‌మ్మ ఆల‌యంలో టెండర్ల నిర్వహణ పై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. భక్తులు సమర్పించిన చీరల విక్ర‌యాల టెండర్లతో పాటుగా టోల్ గేట్ నిర్వహణ టెండ‌ర్,సెక్యూరిటీ టెండ‌ర్ నిర్వహణ విషయాల్లో ఆరోప‌ణ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.టెండర్లు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించక‌పోవ‌టంపై కూడా అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. 
షెడ్యూల్ ప్రకారం టెండర్ జరగలేదా!
టెండర్  పిలిచిన తరువాత షెడ్యూల్ ప్రకారం టెక్నిల్ బిడ్ ప్రైజ్ బిడ్ తెరిచిన తరువాత నిబంధనల ప్రకారం టెండర్ కేటాయించాలి. అయితే సెక్యూరిటీ టెండర్ విష‌యంలో అనుమాలు వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త నెల 25న జ‌రిగిన టెండ‌ర్ల‌ు తొమ్మిది మంది  దాఖలు చేయగా టెక్నికల్ బిడ్ ప్రకారం నలుగురు అందుకు అర్హత సాధించారు. ప్రైజ్ బిడ్ ను తెరచి రివర్స్ టెండరింగ్ పిల‌వ‌గా అందులో ఒకరు అనర్హులయ్యారు. మిగతా ముగ్గురిలో ఒకరికి టెండర్ నిర్ధారించడానికి డాక్యుమెంట్ల పరిశీలన పేరిట రెండు వారాలుగా కాలం గ‌డుపుతున్నారు, అదేమంటే, స్పందించిన అదికారులు లేర‌ని టెండ‌ర్ దారులు అంటున్నారు. 

అధికారులపై రాజకీయ ఒత్తిడి ఉండటంతో టెండర్ ఖరారులో జాప్యం జరుగుంద‌న్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో దేవస్థానం అదికారులు చీరల టెండర్ పిలిచారు. ఏడాదికి  నాలుగు కోట్ల ఆదాయం వచ్చే చీరల టెండర్ను క‌రోనా సాకుగా చూపించి, మూడు కోట్ల రూపాయలకే దేవస్థానం కట్టబెట్టిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే నిర్వహణ భారం తగ్గిందని అధికారులు, పాలకమండలి త‌మ వాద‌న వినిపించారు. టోల్ గేట్ వ్యవహారంలో కూడ గతంలో కాంట్రాక్ట‌ర్ దేవస్థానానికి  25 లక్షల రూపాయలు చెల్లించకుండా ఏడాది పాటు భక్తుల నుంచి టోల్ టాక్స్ కింద డ‌బ్బులు వసూలు చేశారు. 

దేవస్థానానికి నిర్దిష్ట ఆదాయం వస్తున్నప్పటికి, టోల్ వ‌సూళ్ళ‌ను కూడా టెండర్ పిలిచేందుకు దేవస్థానం అధికారులు సన్నాహాలు చేయ‌టంపై అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. అయితే నిబంధనల మేరకే సెక్యూరిటీ టెండర్ ను పిలిచి షెడ్యూల్ ప్రకారం టెక్నిల్ బిడ్ నిర్వ‌హిస్తామ‌ని అదికారులు చెబుతున్నారు. దేవస్థానానికి బాకీ పడిన కాంట్రాక్ట‌ర్లుకు నోటీసులు ఇచ్చామ‌ని స్పందించ‌మ‌ని ప‌క్షంలో  బ్లాక్ లిస్టులో పెడతామ‌ని వివ‌ర‌ణ ఇస్తున్నారు. మ‌రి అధికారులు చ‌ర్య‌లు రాజ‌కీయ ఒత్తిళ్లు ఉన్న క్రమంలో ఎంత వ‌ర‌కు ఫ‌లితాలు ఇస్తాయ‌న్న‌ది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాలి. 

Also Read: TDP Twitter Hacked: టీడీపీ ట్విట్టర్లో విచిత్రమైన పోస్టులు - స్పందించిన నారా లోకేష్, అసలేం జరిగిందంటే !

Also Read: Pegasus YSRCP TDP : "పెగాసస్"పై అప్పుడే క్లారిటీ ఇచ్చిన గౌతం సవాంగ్ - ఇప్పుడు వాడేస్తున్న టీడీపీ

Published at : 19 Mar 2022 12:06 PM (IST) Tags: Krishna district vijayawada Durga Temple kanakadurga temple Durga Temple In Vijayawada

సంబంధిత కథనాలు

AP Govt GO: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - ప్రొబేషన్ డిక్లరేషన్‌పై జీవో విడుదల

AP Govt GO: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త - ప్రొబేషన్ డిక్లరేషన్‌పై జీవో విడుదల

Secunderabad Roits: సికింద్రాబాద్‌ అల్లర్ల కేసులో ఆవుల సుబ్బారావే ప్రధాన సూత్రధారి- తేల్చిన రైల్వే పోలీసులు- రిమాండ్‌కు తరలింపు

Secunderabad Roits:  సికింద్రాబాద్‌ అల్లర్ల కేసులో ఆవుల  సుబ్బారావే ప్రధాన సూత్రధారి- తేల్చిన రైల్వే పోలీసులు- రిమాండ్‌కు తరలింపు

AP Inter Revaluation 2022: ఇంటర్‌లో మార్కులు తక్కువగా వచ్చాయనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

AP Inter Revaluation 2022: ఇంటర్‌లో మార్కులు తక్కువగా వచ్చాయనుకుంటున్నారా, అయితే ఇలా చేయండి

Petrol Price Today 25th June 2022: తెలంగాణలో నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్లు, ఏపీలో పలు చోట్ల పెరిగిన ఇంధన ధరలు

Petrol Price Today 25th June 2022: తెలంగాణలో నిలకడగా పెట్రోల్, డీజిల్ రేట్లు, ఏపీలో పలు చోట్ల పెరిగిన ఇంధన ధరలు

Weather Updates: బీ అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Weather Updates: బీ అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

టాప్ స్టోరీస్

Bharat NCAP Crash Test Rating: వచ్చే ఏడాది నుంచి కార్‌లకు ఆ పరీక్ష తప్పనిసరి, స్టార్‌ రేటింగ్‌తో రోడ్డు భద్రత

Bharat NCAP Crash Test Rating: వచ్చే ఏడాది నుంచి కార్‌లకు ఆ పరీక్ష తప్పనిసరి, స్టార్‌ రేటింగ్‌తో రోడ్డు భద్రత

Srivari Arjitha Seva Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త - రెండేళ్ల తరువాత లక్కీ డిప్, ఆర్జిత సేవల టికెట్లు విడుదల ఎప్పుడంటే

Srivari Arjitha Seva Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త - రెండేళ్ల తరువాత లక్కీ డిప్, ఆర్జిత సేవల టికెట్లు విడుదల ఎప్పుడంటే

Janhvi Kapoor Photos: బ్రేక్ ఇవ్వకపోతే ఎలా జాన్వీ బోర్ కొట్టదూ!

Janhvi Kapoor Photos: బ్రేక్ ఇవ్వకపోతే ఎలా జాన్వీ బోర్ కొట్టదూ!

Hindupur Ysrcp Politics : హిందూపురం వైసీపీలో లోకల్, నాన్ లోకల్ పాలిటిక్స్, ఎమ్మెల్సీ ఇక్బాల్ ఎదురీత

Hindupur Ysrcp Politics : హిందూపురం వైసీపీలో లోకల్,  నాన్ లోకల్ పాలిటిక్స్, ఎమ్మెల్సీ ఇక్బాల్ ఎదురీత