TDP Twitter Hacked: టీడీపీ ట్విట్టర్లో విచిత్రమైన పోస్టులు - స్పందించిన నారా లోకేష్, అసలేం జరిగిందంటే !
TDP official Twitter Account hacked: తెలుగుదేశం పార్టీకి హ్యాకర్లు షాకిచ్చారు. టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేయడంతో పాటు ఏవో విచిత్రమైన పోస్టులు చేశారు.
TDP Twitter Hacked: దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్‌లతో పాటు పలు పార్టీల అధికారిక ఖాతాలు హ్యాక్ అయ్యాయి. తాజాగా తెలుగుదేశం పార్టీకి హ్యాకర్లు షాకిచ్చారు. టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు. అంతటితో ఆగకుండా తమకు తోచినట్లుగా ఏవో పోస్టులు చేయడంతో టీడీపీ శ్రేణులు అలర్ట్ అయ్యాయి.
టీడీపీ ఖాతా నుంచి విచిత్రమైన పోస్టులు..
టీడీపీ అధికారిక ట్విట్టర్ నుంచి విచిత్రమైన పోస్టులు ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఓవైపు పెగాసస్ వ్యవహారంపై రాజకీయ దుమారం.. మరోవైపు టీడీపీ ట్విట్టర్ నుంచి ఏవో పోస్టులు దర్శనమివ్వడంతో పార్టీ శ్రేణులు అలర్ట్ అయ్యారు. టీడీపీ ట్విట్టర్ నుంచి ఏకంగా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు ట్వీట్లు చేశారు హ్యాకర్లు. స్టార్‌షిప్ ఫుల్ స్టాక్ టెస్టింగ్ జరుగుతుందని స్పేస్ ఎక్స్ ట్వీట్ చేయగా గ్రేట్ జాబ్, సూపర్ అంటూ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ నుంచి రెస్పాన్స్ రావడంతో ఆందోళన మొదలైంది. అసలే పెగాసస్ వివాదం తలనొప్పిగా మారిందనుకుంటే అంతలోనే అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ (TDP Twitter Account hacked) కావడం, దాన్ని నుంచి హ్యాకర్లు ఎలాంటి పోస్టులు పెడతారోనని నేతలు తలలు పట్టుకుంటున్నారు.
స్పందించిన నారా లోకేష్.. (Nara Lokesh On TDP Twitter Hacked)
టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఏవో పోస్టులు కావడంపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. తమ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైందని తెలిపారు. ట్విట్టర్ ఇండియాకు విషయం తెలిపామని, త్వరలోనే ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తారని ట్వీట్ చేశారు.
Kindly note that our official party account @jaitdp has been hacked by nefarious elements. We are working with @TwitterIndia to restore the account.
— Lokesh Nara (@naralokesh) March 19, 2022
ఇటీవల సైతం టీడీపీ అకౌంట్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. గత నెలలో ట్విట్టర్ సేవలు నిలిచిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ట్విట్టర్‌కు ఏమైందంటూ ఇతర సామాజిక మాద్యమాలలో పోస్టులతో తమ సమస్యను తెలిపారు. కొందరైతే మీమ్స్‌తో చెలరేగిపోయారు. శుక్రవారం రాత్రి నుంచి టీడీపీ ట్విట్టర్‌లో స్పెస్ ఎక్స్ సంస్థకు రిప్లైలు ఇవ్వడంతో పాటు మరికొన్ని ట్వీట్లు చేశారు హ్యాకర్స్.
Also Read: Pegasus YSRCP TDP : "పెగాసస్"పై అప్పుడే క్లారిటీ ఇచ్చిన గౌతం సవాంగ్ - ఇప్పుడు వాడేస్తున్న టీడీపీ