AP Groups Notifications : నిరుద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్, గ్రూప్ -1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
AP Groups Notifications : ఏపీ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రూప్ -1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. త్వరలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఇవ్వనుంది.
AP Groups Notifications : నిరుద్యోగులకు ఏపీ సర్కార్(AP Govt) గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్ -1, గ్రూప్ -2 పోస్టుల(Groups Jobs) భర్తీకి సీఎం జగన్(CM Jagan) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్(Job Calendar)లో ప్రకటించిన పోస్టుల కంటే అధికంగా పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. దీంతో గ్రూప్-1లో 110 పోస్టులు, గ్రూప్-2లో 182 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ - 1, గ్రూప్ -2 పోస్టుల భర్తీకి త్వరలోనే ఏపీపీఎస్‌సీ(APPSC) నోటిఫికేషన్లు జారీ చేయనుంది. గ్రూప్ -1లో డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవో, సీటీవో, డీఎస్పీ, డీఎఫ్ఓ,మున్సిపల్ కమిషనర్‌లు, ఎంపీడీవో పోస్టులు భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గ్రూప్ 2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టుల భర్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణలో జాబ్ నోటిఫికేషన్లు
తెలంగాణలో టీఆర్ఎస్ రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత నిరుద్యోగులు తమకు ఇకనైనా జాబ్ నోటిఫికేషన్లు వస్తాయని సంతోషించారు. కానీ అందుకు అనూహ్యంగా సీఎం కేసీఆర్ ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. పైగా రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగడం, ప్రతిపక్షాల విమర్శలతో ఇటీవల ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. మొత్తం 91 వేల ప్రభుత్వ ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం నోటిఫై చేయగా, అందులో 11 వేల కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు.
నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు !
మొత్తం 80,039 ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని, నిరుద్యోగులు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. అంతకు ముందురోజైతే తాను అసెంబ్లీలో ప్రకటన చేస్తానని మరి నిరుద్యోగులను టీవీ చూడాలని సూచించారు. ఊహించినట్లుగానే భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా రావడం లేదు. మరోవైపు స్థానికత అంశంపై స్పష్టత లేదని, ఇటీవల వచ్చిన కోర్టులో ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా తేలిపోయింది. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఉగాది నుంచి శుభవార్త వినే అవకాశం ఉందని సమాచారం. ఇంకా ఆలస్యం చేస్తే నిరుద్యోగులలో ప్రభుత్వంపై నమ్మకం పోయే అవకాశాలున్నాయి.
శాఖలు - పోస్టుల సంఖ్య
హోం శాఖ - 18,334
సెకండరీ ఎడ్యుకేషన్ - 13,086
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ - 12,755
హయ్యర్ ఎడ్యుకేషన్ - 7,878
బీసీల సంక్షేమం - 4,311
రెవెన్యూ శాఖ - 3,560
ఎస్సీ వెల్ఫేర్ - 2,879
నీటిపారుదల శాఖ - 2,692
ఎస్టీ వెల్ఫేర్ - 2,399
మైనారిటీ వెల్ఫేర్ - 1,825
ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీ - 1,598
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ- 1,455
లేబర్, ఎంప్లాయిమెంట్ - 1,221
ఆర్థిక శాఖ- 1,146
మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ - 895
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ - 859
అగ్రికల్చర్, కో-ఆపరేషన్ - 801
రవాణా, రోడ్లు, భవనాలు - 563
న్యాయశాఖ - 386
పశుపోషణ, మత్స్య శాఖ - 353
జనరల్ అడ్మినిస్ట్రేషన్ - 343
ఇండస్ట్రీస్, కామర్స్ - 233
యూత్, టూరిజం, కల్చర్ - 184
ప్లానింగ్ - 136
ఫుడ్, సివిల్ సప్లయిస్ - 106
లెజిస్లేచర్ - 25
ఎనర్జీ - 16
రాష్ట్రంలో మొత్తం పోస్టులు - 80,039