కడపలో సీఎం జగన్- ఢిల్లీలో చంద్రబాబు ఇవే ఏపీలో మేజర్ అప్‌డేట్స్
నేటి ఏపీ అప్‌డేట్స్
కడప దర్గాకు సీఎం జగన్
నేడు ఏపీ సీఎం జగన్ కడప దర్గాను సందర్శించనున్నారు. నిన్న ఢిల్లీ పర్యటనలో జీ-20 సన్నాహక సదస్సులో పాల్గొన్న ఆయన ఆ సందర్భంగా పలువురు కీలక నేతలను కలిశారు. తరువాత ఏపీకి తరిగి వచ్చిన సీఎం కడప పర్యటనకు వెళ్లారు.
నేడు అంబేడ్కర్ 66వ వర్ధంతి
భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా దేశంతోపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.
నేడు ఢిల్లీ లోనే చంద్రబాబు
నిన్న ఢిల్లీలో జీ-20సన్నాహక సదస్సులో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఢిల్లీలోనే ఉండనున్నారు. కొందరు జాతీయ పార్టీ నేతలను కలువనున్న ఆయన ఈరోజు తెలుగు మీడియాతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు.
ఢిల్లీలో బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొననున్న సోము వీర్రాజు
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీలో ఉండనున్నారు. అక్కడ గత రెండు రోజులుగా జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొంటున్నారు
రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో బీసీల సదస్సు
ఆంధ్రప్రదేశ్‌లో బీసీల కోసం ఎవరు ఏం చేశారో చెప్పే పనిలో ఉన్నాయి పార్టీలు. రేపు జగన్ ప్రభుత్వం జయహో బీసీ సదస్సు నిర్వహిస్తుంటే.. దానిపై ఇవాళే టీడీపీ బీసీల సదస్సు ఏర్పాటు చేసింది. బీసీలను ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఆరోపిస్తోందా పార్టీ. అది వివరించేందుకే ఈ సదస్సును ఏర్పాటు చేసింది.
విజయవాడలో లౌకికవాద పరిరక్షణ రాష్ట్ర సదస్సు
ఈరోజు బీఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడలో లౌకిక వాద పరిరక్షణ రాష్ట్ర స్థాయి సదస్సు జరగనుంది దేశంలో లౌకిక వాదాన్ని పెంపొందించేలా ప్రభుత్వాలు పనిచెయ్యాలంటూ పలువురు ప్రముఖులు ఈ సదస్సు లో ప్రసంగించనున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, కాంగ్రెస్ నేత తులసి రెడ్డి ఈ సదస్సుకు హాజరుకానున్నారు.