Pslv C-52 Launching Preparations: శ్రీహరికోట నుంచి ఈ ఏడాది తొలి ప్రయోగం PSLV C-52

సతీష్ ధావన్ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ ఏడాది మొదటి రాకెట్‌ ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 5.59 గంటలకు PSLV C-52 నింగిలోకి దూసుకెళ్తుంది.

FOLLOW US: 

సతీష్ ధావన్ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఈ ఏడాది మొదటి రాకెట్‌ ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 14వ తేదీ ఉదయం 5.59 గంటలకు షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది. పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌- సి 52(పీఎస్‌ఎల్‌వీ) వాహక నౌక ప్రయోగానికి ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 

ఇప్పటికే వాహక నౌక అనుసంధానం పూర్తి కావచ్చింది. నాలుగు దశల అనుసంధానం పూర్తి చేసి ఆ తర్వాత ఉష్ణకవచం అమర్చారు. అనంతరం వివిధ పరీక్షలు జరిపి రిహార్సల్స్, ప్రీ కౌంట్‌ డౌన్‌ నిర్వహించబోతున్నారు. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ ఈ నెల 13వ తేదీ వేకువజామున 4.29 గంటలకు ప్రారంభం అవుతుంది. నిరంతరాయంగా 25 గంటల 30నిముషాలపాటు కౌంట్ డౌన్ సాగుతుంది. ఆ తర్వాత పీఎస్‌ఎల్‌వీ ప్రయోగిస్తారు. 

రాకెట్‌ సన్నద్ధత, లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశాలు ఈ నెల 12న జరుగుతాయి. పీఎస్ఎల్వీ సి-52 ద్వారా ఆర్‌ఐశాట్‌-1ఎ (ఈవోఎస్‌-04)తోపాటు ఐఎన్‌ఎస్‌-2టీడీ, విద్యార్థులు రూపకల్పన చేసిన ఇన్ స్పైర్ శాట్ -1 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెడతారు. 

1,710 కిలోగ్రాముల బరువున్న ఈఓఎస్-04 శాటిలైట్ బరువు 1710 గ్రాములు. ఇదో రేడార్ ఇమేజింగ్ శాటిలైట్. ఎటువంటి వాతావ‌ర‌ణంలోనైనా ఇది హైక్వాలిటీ ఇమేజ్‌ ల‌ను తీసి పంపిస్తుంది. వ్య‌వ‌సాయం, అట‌వీ, మొక్క‌ల పెంప‌కం, నేల సాంద్ర‌త‌, హైడ్రాల‌జీ, ఫ్ల‌డ్ మ్యాపింగ్ లాంటి అప్లికేష‌న్ల‌కు ఈ శాటిలైట్‌ ను వాడ‌తారు. ఈఓఎస్-04 శాటిలైట్ ను 529 కిలోమీటర్ల ఎత్తులో 

మిగిలిన రెండు చిన్న శాటిలైట్లలో ఒకటైన‌ ఇన్స్పైర్ శాట్-1ను యూనివర్శిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన లేబొరేటరీ ఆఫ్ అట్మాస్పియరిక్ అండ్ స్పేస్ ఫిజిక్స్ తో కలిసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ తయారు చేసింది. 

ఇండియా భూటాన్ జాయింట్ శాటిలైట్.. 
రెండో చిన్న శాటిలైట్ ఐఎన్ఎస్-2టీడీ ఇండియా-భూటాన్ జాయింట్ శాటిలైట్. పీఎస్ఎల్వీ ప్రయోగానికి లాంచ్ ఆథరైజేషన్ బోర్డ్ అనుమతి లభించిన తర్వాత 25 గంటల కౌంట్ డౌన్ ప్రారంభం అవుతుంది. 

Published at : 10 Feb 2022 12:40 PM (IST) Tags: ISRO Sriharikota PSLV C-52 EARTH OBSERVATION SATELLITE

సంబంధిత కథనాలు

AP Government On Bamboo: వెదురు పెంచితే సూపర్ ఆఫర్‌- మీ తోటలో పెంచినా రాయితీ

AP Government On Bamboo: వెదురు పెంచితే సూపర్ ఆఫర్‌- మీ తోటలో పెంచినా రాయితీ

Nellore Gas leakage: పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు- నెల్లూరు గ్యాస్ లీకేజీ ఘటనలో నిజానిజాలు

Nellore Gas leakage: పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు- నెల్లూరు గ్యాస్ లీకేజీ ఘటనలో నిజానిజాలు

Transfers In AP: దేవాదాయ శాఖ‌లో సామూహిక‌ బ‌దిలీలు- అర్థరాత్రి జీవో విడుదల

Transfers In AP: దేవాదాయ శాఖ‌లో సామూహిక‌ బ‌దిలీలు- అర్థరాత్రి జీవో విడుదల

Weather Updates: పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

Weather Updates: పూర్తిగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు, నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD

PSLV C53 Success : పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం సక్సెస్, నిర్ణీత కక్ష్యలో మూడు ఉపగ్రహాలు

PSLV C53 Success : పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం సక్సెస్, నిర్ణీత కక్ష్యలో మూడు ఉపగ్రహాలు

టాప్ స్టోరీస్

Vijya Devarakonda: 'పీకే'లో రేడియోతో ఆమిర్ - 'లైగర్'లో రోజా పూల బొకేతో విజయ్ దేవరకొండ 

Vijya Devarakonda: 'పీకే'లో రేడియోతో ఆమిర్ - 'లైగర్'లో రోజా పూల బొకేతో విజయ్ దేవరకొండ 

High Alert in Hyderabad: భద్రతా వలయంలో భాగ్యనగరం - హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హై అలెర్ట్‌

High Alert in Hyderabad: భద్రతా వలయంలో భాగ్యనగరం - హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక నేపథ్యంలో హై అలెర్ట్‌

Breaking News Telugu Live Updates: తెలంగాణలో బీజేపీ పుంజుకుందని అనుకోవడం భ్రమ: ఎమ్మెల్యే

Breaking News Telugu Live Updates: తెలంగాణలో బీజేపీ పుంజుకుందని అనుకోవడం భ్రమ: ఎమ్మెల్యే

CM NTR Banners: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...

CM NTR Banners: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ...