అన్వేషించండి

Nellore Politics: తగ్గేదే లేదంటున్న నారాయణ - నెల్లూరులో సుడిగాలి పర్యటనలు, హామీలు

Nellore TDP News: నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 300మంది ఆటో కార్మికులు టీడీపీలో చేరారు. నారాయణ కూడా ఆటో డ్రైవర్ డ్రస్సులో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Narayana in Nellore: మాజీ మంత్రి నారాయణ ఈసారి విజయం కోసం మరింత కసిగా పనిచేస్తున్నారు. మంత్రి పదవిలో ఉండి కూడా తాను ఓడిపోయిన నెల్లూరు సిటీ నియోజకవర్గంలోనే ఈసారి గెలిచి చూపిస్తానంటున్నారు. టీడీపీ నుంచి నారాయణ అభ్యర్థిత్వం ఖరారైంది. వైసీపీలో అన్నీ అనుకున్నట్టు జరిగితే అనిల్ కుమార్ యాదవ్ ఆయనకు ప్రత్యర్థిగా మారుతారు. ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అనిల్ ఇక్కడ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆయనకి పోటీగా నారాయణ కూడా ఫుల్ టైమ్ ఈ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. చేరికలు, వివిధ కార్యక్రమాలతో ఆయన బిజీ అయ్యారు. 

ఆటో కార్మికుల చేరిక..
నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 300మంది ఆటో కార్మికులు టీడీపీలో చేరారు. నారాయణ కూడా ఆటో డ్రైవర్ డ్రస్సులో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఖాకీ చొక్కా వేసుకుని వారిలో కలసిపోయారు. ఆటో డ్రైవర్లను ఆప్యాయంగా పలకరించారు. వారికి కండువాలు కప్పి టీడీపీలోకి స్వాగతం పలికారు. 

ఆటోయ‌జ‌మానులు, డ్రైవ‌ర్లు, కార్మికుల స‌మ‌స్య‌ల‌పై తాము ప్ర‌త్యేక దృష్టిసారించామ‌ని తెలిపారు నారాయణ. ఈ మేర‌కు ఆయా ప్రాంతాల్లో డివిజ‌న్ల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడు తాము ప్ర‌త్యేకంగా వారితో మాట్లాడుతున్న‌ట్లు చెప్పారు. తాను కూడా ఓ కార్మికుని కుటుంబం నుంచి వ‌చ్చిన‌వాడినేన‌ని, త‌న తండ్రి ప్రైవేట్ బ‌స్సు కండెక్ట‌ర్ అని చెప్పారు నారాయణ. త‌న మేన‌మామ కూడా కార్మికుడేనని.. స‌మ‌స్య‌లు తెలిసిన వ్య‌క్తిని కాబ‌ట్టే కార్మికుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తాన‌ని చెప్పారు. న‌గ‌రంలోని ప్ర‌తి ఒక్క కార్మికుడి ఇంటికి వెళ్లి క‌ష్ట‌న‌ష్టాలు తెలుసుకుంటాన‌న్నారు నారాయణ. పిల్ల‌ల‌ను బాగా చ‌దివించాల‌ని వారికి సూచించారు. 

గతంలో ఇలా..
తాను మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు వీఆర్ హైస్కూల్‌ లో పేద‌పిల్ల‌ల కోసం  రెసిడెన్షియ‌న్ కాలేజీ ఏర్పాటు చేసి, 6 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో నారాయ‌ణ కాలేజీ స్టాఫ్‌తో విద్య చెప్పించామ‌న్నారు. త‌న ప‌ర్య‌ట‌న‌లో ఓ విద్యార్థి ఆ స్కూల్ గురించి గొప్పగా చెప్పారని.. అలాంటి స్పందనలు విన్నప్పుడు తనకు సంతోషం కలుగుతుందని చెప్పారు నారాయణ. నిరుపేద‌ల కోసం ఎంతో చేసిన తాము ఆర్భాటాల‌కు పోలేద‌ని, మిగ‌తా వాళ్లలాగా కొంచెం చేసి ఎక్కువ చెప్పుకోవ‌డం త‌మ‌కు తెలియ‌ద‌న్నారు. ఆటోయ‌జ‌మానులు, కార్మికుల‌తో పాటు నిరుపేద‌లకోసం..43 వేల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని.. నిర్మాణాలు పూర్త‌యి పేద‌ల‌కు ఇవ్వ‌బోయే స‌మ‌యానికి ఎన్నిక‌లు రావ‌డంతో ఆ పని సాధ్యం కాలేదని వివరించారు. ఆ త‌ర్వాత వైసీపీ గెలిచినా.. ఆ ఇళ్ల‌ను పేద‌ల‌కు ఇవ్వ‌కుండా నాశ‌నం చేశార‌ని మండిప‌డ్డారు నారాయణ. 

తాను ఎమ్మెస్సీ చ‌దివే వ‌ర‌కు తాటాకుల ఇంట్లోనే ఉన్నాన‌ని చెప్పారు నారాయణ. అక్క‌డ ట్యూష‌న్ చెప్పాన‌ని, తన ఫ‌స్ట్ స్టూడెంట్ ఆనం వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి అని చెప్పారు. తాను ఏ స్థాయిలో ఉన్నా పేద‌ల క‌ష్టాలు తెలిసిన వ్య‌క్తిన‌ని, మాట‌లు చెప్పే వ్య‌క్తిని కాద‌ని, ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకుంటాన‌ని చెప్పారు నారాయణ. నెల్లూరులో ఓ పేద‌కుటుంబంలో పుట్టి ఉన్న‌త స్థితికి ఎదిగాను కాబ‌ట్టే త‌న‌వంతుగా నెల్లూరును విస్తృతంగా అభివృద్ధి చేశాన‌న్నారు. 

నెల్లూరు సిటీలో పోటీని ఈసారి నారాయణ ఆషామాషీగా తీసుకోవట్లేదు. మంత్రి హోదాలో ఉండి 2019లో ఆయన ఎన్నిక ఓడిపోయారు. గెలుపుపై ఉన్న ధీమానే ఆయన ఓటమికి కారణం అనేది తెలిసిన విషయమే. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన.. ఈసారి మాత్రం టీడీపీ జెండా ఎగురవేస్తానంటున్నారు. నెల్లూరు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు నారాయణ. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Embed widget